Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
ఢిల్లీకి మారిన వేదిక
అన్ని పార్టీలదీ హస్తిన బాటే
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ బాట పట్టనున్నాయి. శాసనసభ నుంచి రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతికి చేరడంతో పార్టీల నేతలూ హస్తిన వెళ్లనున్నారు. సమైక్యాంధ్ర అయినా, తెలంగాణ అయినా ఇక తేలాల్సింది ఢిల్లీలోనే కావడంతో ఎవరికివారు అక్కడికెళ్లే పనిలో పడ్డారు. ఢిల్లీలో ఇక చివరిసారిగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, భాజపాలతోపాటు ఇతర పార్టీలనూ కలిసి తమ తమ వాదనలు వినిపించాలని నిర్ణయించారు.

రాజ్‌ఘాట్‌లో దీక్షకు కాంగ్రెస్‌ నేతల యోచన
కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా బిల్లుపై చర్చ వివరాలు రాష్ట్రపతికి చేరేలోపే ఢిల్లీ వెళ్లి తమ వాదనలు వినిపించాలని నిర్ణయించారు. బిల్లు శాసనసభలో తిరస్కరణకు గురైనందున పార్లమెంటుకు పంపించకూడదని రాష్ట్రపతిని కలిసి కోరనున్నారు. ఒకరోజు పాటు రాజ్‌ఘాట్‌లో మౌన దీక్ష చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. వీలైతే సమైక్యాంధ్రకు మద్దతిచ్చే ఇతర పార్టీలు, నేతలను కలుపుకొని వెళ్లాలని యోచిస్తున్నారు. తెదేపా సీమాంధ్ర ఎమ్మెల్యేలూ ఢిల్లీ వెళ్లనున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాన్ని రూపొందించుకోవాలని వారు నిర్ణయించారు. వైకాపా నేతలు, ఎమ్మెల్యేలూ ఫిబ్రవరి నాలుగో తేదీన ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని యోచిస్తున్నారు. లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. పార్టీ నేతలు ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరి, వినోద్‌కుమార్‌లతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి భాజపా నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌ల వరకూ పలువురు నేతలను కలవనున్నారు. రెండో తేదీన ప్రధానిని కలిసేందుకు సమయం అడిగారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా చివరి లాబీయింగ్‌ చేయడమే ఆయన ఉద్దేశం. సీపీఐ జాతీయ నాయకుడు బర్దన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ తదితరులనూ కేసీఆర్‌ కలవనున్నారు. తెరాసకు చెందిన 10మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి మూడు, నాలుగు తేదీల్లో ఢిల్లీలోనే ఉండి పార్టీలోని కీలక నేతల్ని కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయనున్నారు.తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ప్రధాని, రాష్ట్రపతి కలవాలని నిర్ణయించారు. తెలంగాణ ఐకాస నేతలు కోదండరాం నేతృత్వంలో 5న ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా తెలంగాణ నేతలు 7 నుంచి బిల్లు పార్లమెంటులో పెట్టి ఆమోదం పొందే వరకూ ఢిల్లీలోనే ఉంటారు. భాజపా సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు రఘునాథబాబు ఆధ్వర్యంలో 6న వెళ్లాలని యోచిస్తున్నారు. సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రతిపాదించాల్సిన సవరణలను జాతీయ నేతలకు సూచించనున్నారు. సీపీఐ నేతలూ ఈ కీలక సమయంలో ఢిల్లీ వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కొత్త రాజధానికి రూ.5లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని, ముంపు ప్రాంతం పేరుతో భద్రాచలం డివిజన్‌లోని గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించాలని వారు నిర్ణయించారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net