Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
భారీ పోలింగ్‌
పుర పోరులో 73.13 శాతం నమోదు
ప్రకాశంలో అత్యధికంగా 82.45%
నిజామాబాద్‌లో అత్యల్పం 60.65%
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు
ఓటింగ్‌కు కదం తొక్కిన యువత ఈనాడు - హైదరాబాద్‌
పురపాలక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. కనీవినీ ఎరుగని రీతిలో, వూహించిన దానికంటే అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి 73.13 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2005లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి 4.01 శాతం పోలింగ్‌ పెరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా కదిలారు. ప్రధాన పార్టీలు పోటీపోటీగా పంపకాల జాతరకు పాల్పడ్డాయి. పలుచోట్ల ప్రధాన పార్టీలు బాహాబాహీకి దిగాయి. ఎండ తీవ్రత ఓటర్లపై ప్రభావం చూపింది. మధ్యాహ్నం వేళల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పలుచగా కనిపించారు. సాయంత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఐదు గంటల తరువాత పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేస్తూ కనిపించారు. చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రంలోని పది నగర పాలక సంస్థలు, 145 పురపాలక సంఘాల్లో ఆదివారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్రఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈవీఎంలు మొరాయించిన ఆరు చోట్ల ఏప్రిల్‌ 1న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఉదయం నుంచే: ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఓటర్లు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి రెండు గంటల్లోనే పోలింగ్‌ శాతం 15.22 శాతం దాటింది. 11 గంటల సమయానికి 34.89 శాతానికి చేరింది. తరువాత ఎండ తీవ్రత అధికం కావడంతో పోలింగ్‌ జోరు తగ్గింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చిన వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ 54.59 శాతానికి, 3 గంటలకు 66.42 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటల సమయానికి 73.13గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 82.45 శాతం పోలింగ్‌ నమోదు కాగా... అత్యల్పంగా నిజామాబాద్‌ జిల్లాలో 60.65 శాతంగా ఉంది.

చిన్న చిన్న సంఘటనలు మినహా అంతా ప్రశాంతం: చిన్న, చిన్న సంఘటనలు మినహా మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కమిషనర్‌ బి.రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఉదయం కొన్నిచోట్ల ఏడు గంటలకు ఈవీఎంలు మొరాయించినా, వెంటనే ఈసీఐఎల్‌ అధికారులు వాటిని సరిచేశారని చెప్పారు. వూహించిన దానికంటే పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. కొన్ని చోట్ల 80 శాతం దాటిందని తెలిపారు. సాయంత్రం 5 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న వారికి ప్రత్యేక స్లిప్పులు ఇచ్చి, ఓటింగ్‌కు అనుమతించామని వెల్లడించారు. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో ఒక మాజీ ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేయడానికి యత్నించి, కింద పడేశారని తెలిపారు. ఈ సంఘటనలో ఈవీఎం విరిగి పోలేదని, వెంటనే దాన్ని సీజ్‌చేసి, కొత్త ఈవీఎంను తీసుకువచ్చి ఓటింగ్‌ కొనసాగించామని చెప్పారు. ఈ సంఘటనలో ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మడకశిరలో మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌పై స్థానిక సీఐ లాఠీఛార్జి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదు అందిందని, ఈ సంఘటనపై నివేదిక తెప్పించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్న బలమైన ఆకాంక్షతో ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు వచ్చారని ప్రశంసించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, పోలీసులు, పురపాలక అధికారులను అభినందించారు. రీపోలింగ్‌ జరిగే కేంద్రాలు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉంటే, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సమీపంలోని ఇతర భవనాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

రీపోలింగ్‌ జరిగే వార్డులు
తాడిపత్రి (1), మదన్‌పల్లి (1), నందిగామ (2), సూర్యాపేట (2)
రీపోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 1 (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలు)

తగ్గిన పోలింగ్‌
2005 ఎన్నికలతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో పోలింగ్‌ శాతం పడిపోగా కొన్నిచోట్ల పెరిగింది. నెల్లూరు నగర పాలక సంస్థలో అత్యధికంగా 5.36 శాతం పోలింగ్‌ పడిపోయింది. ఆ తరువాత నిజామాబాద్‌ నిలిచింది. అక్కడ 4.63 శాతం పడిపోయింది. కృష్ణా జిల్లాలోనూ 1.18 శాతం తగ్గింది. ఇక ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11.06 శాతం పోలింగ్‌ పెరిగింది. ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో గతంతో పోలిస్తే 10.85 శాతం పెరగడం గమనార్హం.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net