Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
‘కాల’దోషానికి కొత్త చికిత్స
అంతర్జాలమూ వ్యసనమే గుర్తించకపోతే చిక్కులే
అంతర్జాల వ్యసన విముక్తి నిపుణులు
మనోజ్‌కుమార్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి
ఈనాడు - బెంగళూరు
అంతర్జాలం.. కొందరికి వ్యసనంగా మారుతోంది. ఈ వ్యసనంలో చిక్కుకున్న వారు బయటపడటం చాలా కష్టం. అసలు ఇది ఒక వ్యసనమని ఇప్పటి వరకూ చాలా మందికి తెలియనే తెలియదు. ఈ వ్యసనం వల్ల ఆరోగ్య, మానసిక సమస్యలు పెరిగినా చాలా మంది ఆ విషయాన్ని గుర్తించడం లేదు. అసలు అంతర్జాల వ్యసనాన్ని గుర్తించడం ఎలా..? చికిత్స విధానమేంటి.. అనే అంశాలపై బెంగళూరులోని జాతీయ మస్తిష్క- నాడీమండల శస్త్రచికిత్స కేంద్రం (నిమ్హన్స్‌)లో అంతర్జాల వ్యసన విముక్తి విభాగాధిపతి మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ శర్మను ‘ఈనాడు’ సంప్రదించింది. ఈ కేంద్రంలో ఇప్పటి వరకూ 70 మంది అంతర్జాల వ్యసనపరులకు విముక్తి కల్పించారు.ఈ నేపథ్యంలో మనోజ్‌కుమార్‌ వెల్లడించిన వివరాలు..

అంతర్జాల వ్యసనం.. కొత్తగా ఉంది.. ఇది అంత ప్రమాదమా: ఇది వ్యసనమే. దీని విముక్తి కోసం చికిత్స పొందుతున్న వారు ఎదుర్కొంటున్న రుగ్మతలను పరిగణనలోకి తీసుకున్నపుడు ప్రధానంగా నాలుగు రకాల సమస్యలున్నట్లు వెల్లడైంది. అవి.. 1.వీడియో ఆటలు 2.సామాజిక మాధ్యమాలు- ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌లు 3.స్మార్ట్‌ చరవాణిల్లో సమాచారం, చిత్రాలను నిరంతం ఎగుమతి, దిగుమతి చేయటం. 4.అశ్లీల చిత్రాల వీక్షణ.

ఇప్పటి వరకూ ఎందరికి చికిత్స చేశారు? ఫలితాలు ఎలా ఉన్నాయి?: ఇప్పటి వరకూ ఈ కేంద్రంలో 70 మందికి చికిత్స చేశాం.. మరికొందరకి కొనసాగిస్తున్నాం. వారిలో 60 శాతం మందికి రుగ్మత నయమైంది. అంటే వారు గతంలో కంటే ఎక్కువ సమయం ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. వేళకు సరిగ్గా ఆహారాన్ని తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మిత్రులతో మాటా మంతీ పెరిగింది. తల్లిదండ్రుల్లో సంతోషం నెలకొంది. ఇది చిరకాలం కొనసాగేలా చూడాలి.

చికిత్సకు వస్తున్న వారి వయస్సు?: చికిత్సకు వచ్చినవారిలో ఎక్కువ మంది వయస్సు 18- 22. మరికొందరిది 25 వరకూ ఉంది. వారంతా ఉద్యోగులు. చికిత్స చేసిన వారిలో పది మంది సమాచార సాంకేతిక సిబ్బంది. వీరూ అంతర్జాలానికి అతుక్కుపోయారు. ఉద్యోగంలో చేరిన దశలోనే భవిష్యత్తును ఫణంగా పెట్టారు. విధులకు ఆలస్యంగా హాజరు కావటం పరిపాటైంది. వీడియో గేమ్స్‌ ఆడే పిల్లలు రాత్రి రెండు, మూడు గంటలకు నిద్రపోయే వారున్నారు. మరి కొందరు తెల్లవారుజాము నాలుగు, మూడున్నరకూ లేస్తున్నారు.

అంతర్జాల అతి వినియోగం వల్ల వారి ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలేంటి: నిద్రలేమి, కంటి జబ్బులు, వేళ్ల నొప్పులు, వేలి కొనల నొప్పులతో బాధపడుతున్నారు. వేళకు సరిగ్గా అన్నం తినక కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.

వ్యసనానికి బానసలయ్యారని గుర్తించటం ఏలా: నాలుగు ‘సీ’ల్ని గుర్తించాలి. క్రేవింగ్‌- ప్రగాఢ వాంఛ. కంటిన్యుటి- ఎల్లకాలమూ వాటితోనే కాలం గడపటం. కంట్రోలు లూస్‌ -నియంత్రణ కోల్పోవటం. కాన్సిక్వెన్సెస్‌- పర్యవసానాలు. ఈ నాలుగు సీలూ ఉన్నట్లయితే వ్యసనానికి బానిసలవుతున్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించాలి.

వ్యసనానికి దూరమయ్యేందుకు మీరిచ్చే సలహాలు: ఒక అధ్యయనం ప్రకారం బెంగళూరులో చరవాణి వినియోగదార్లలో ఐదు శాతం పురుషులు, మూడు శాతం మహిళలు దీనికి బానిసలు. అవతలి వాళ్లను చరవాణికి బదులుగా నేరుగా వెళ్లి సంభాషించేందుకు ప్రయత్నించాలి. కొన్ని రోజుల పాటు ఫోన్‌ చేసిన తర్వాత ఎవరెవరికి ఫోన్‌ చేశామో.. అది అవసరామాని ఆలోచించాలి. అవసరం లేనపుడు దాన్ని కట్టేయాలి. రాత్రిళ్లు ఆపేయాలి. సంక్షిప్త సందేశాలు ఏవైనా వచ్చాయేమోనని తరచూ దాన్ని తనిఖీ చేయటం మానేయాలి. మోటారు వాహనాల్ని నడిపేటపుడు చరవాణిల్లో మాట్లాడటాన్ని నిలిపేయాలి.

* చికిత్స- సలహాల కోసం వ్యసన విముక్తి కేంద్రాన్ని 080 2668 5948 నంబరులో సంప్రదించవచ్చు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net