Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
అడ్డదారుల్లో ప్రైవేటు పరుగులు
ప్రధానదారులు వదిలి పల్లె మార్గాల నుంచి
ఆపరేటర్ల కొత్త ఎత్తుగడలు
ప్రయాణికులకు నరకం
ఆర్టీఏ అధికారులకు దొరకకుండా ఉండేందుకే
ఈనాడు - హైదరాబాద్‌
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాలకిశోర్‌ బెంగళూరులో అత్యవసర సమావేశం ఉండటంతో ప్రైవేటు బస్సులో బయలు దేరారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లో బస్సు ఎక్కారు. ఉదయం 6.30కే చేరిపోవాల్సి ఉండగా ఆ బస్సు ఉదయం 11.30కు చేరింది. ఆ బస్సును డ్రైవరు కొండలు, కోనల్లోంచి.. అదనంగా తిప్పి తీసుకెళ్లడమే అందుకు కారణం. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ప్రయాణ సమయం గరిష్ఠంగా 12 గంటలైతే..ప్రస్తుతం 17 గంటలపైగా పడుతోంది.

ఇదంతా ప్రైవేటు బస్సుల మాయాజాలం. పాలెం బస్సు దుర్ఘటన అనంతరం ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా ఝళిపిస్తుండటంతో వారు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. అధికారులకు చిక్కకుండా గ్రామీణ రహదారులు, కొండలు, అడవుల సమీపం నుంచి వెళ్తున్నారు. చుట్టూ తిరిగి చివరికి నగరానికి కొంత దూరంలో నిలిపేసి అక్కడే ప్రయాణికులను దింపేస్తున్నారు. ఇంటర్య్వూలు, పరీక్షలు, ఇతరత్రా అత్యవసర పనులపై వెళ్లే వారు సమయం మించిపోతుండటంతో మధ్యలో దిగిపోయి వేరే వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, కడప, అనంతరం, బెంగళూరు, ముంబయి, గోవా, షిర్డీ తదితర ప్రాంతాలకు నిత్యం ఆరేడు వందల ప్రైవేటు బస్సులు తిప్పుతున్నారు. ఇప్పటికే అధికారులు నగర పరిధిలో దాదాపు 350బస్సులను సీజ్‌ చేశారు. వీటిలో కొందరు జరిమానాలు చెల్లించి మళ్లీ తిప్పుతున్నారు. అధికారులు నిరంతరం దాడులు చేస్తుండడంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు వారి కళ్లుగప్పి అడ్డదారులు పట్టారు.

ప్రమాదకర ప్రయాణం...
గ్రామీణ రహదారులు ఇరుకుగా, గోతులతో ఉంటాయి. ఈ దారుల్లో భారీ బస్సులను తిప్పడం మరింత ప్రమాదకరమని అధికారులు అంటున్నారు. బస్సు ఎక్కేటప్పుడే కచ్చితంగా వివరాలు తీసుకొని ప్రయాణించాలని.. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ మీద నుంచి కాకుండా...ఉప్పల్‌ వరకు ప్రయాణికులను రప్పించి అక్కడి నుంచి అడ్డదారుల్లో చౌటుప్పల్‌ వరకువెళ్లి.. ప్రధానరహదారి మీదకు వెళుతున్నారు. విజయవాడ సమీపంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అడ్డదారుల్లో నగర శివార్లకు చేరుతున్నారు.

ప్రస్తుతం ప్రైవేటు బస్సులన్నీ కాంట్రాక్టు క్యారేజ్‌లుగా అనుమతులు తీసుకొని స్టేజీ క్యారేజ్‌లుగా తిరుగుతున్నవే. అయితే కొందరు బస్సు యాజమాన్యాలు కాంట్రాక్టు అవసరాల కోసమే తిప్పుతున్నట్లు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వస్తే.. తామంతా కలిసి బస్సును బుక్‌ చేసుకున్నట్లు చెప్పాలని ప్రయాణికులపై ఒత్తిడి తెస్తున్నాయి.

అధికారుల మధ్య సరిహద్దుల గొడవ...
ఆర్టీఏ అధికారుల మధ్య సరిహద్దుల గొడవలు కూడా ప్రైవేటు బస్సులకు కలిసి వస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. చాలా ప్రైవేటు బస్సులు రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల సరిహద్దుల నుంచి బయలుదేరుతుంటాయి. వీటిపై దాడులు చేయడానికి ఆయా జిల్లాల అధికారుల నుంచి కొంత సహాయ నిరాకరణ ఎదురవుతోందని నగరానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ‘‘చౌటుప్పల్‌ దాటి వెళితే కానీ... చాలా బస్సులు దొరకడం లేదు. అడ్డదారులను ఆశ్రయించడమే ఇందుకు కారణం. నగరానికి చెందిన అధికారులు అక్కడి వరకు వెళ్లాలంటే నిబంధనలు అంగీకరించవు. ఆ ప్రాంతం వేరే జిల్లాలో ఉండడమే దీనికి కారణం.’’ అని ఆ అధికారి వివరించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా తనిఖీల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net