Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
రెక్కలు తెగిన లోహ విహంగాలివీ..
సుదూర ప్రయాణాల తీరుతెన్నులను మార్చేసిన విమానయాన రంగాన్ని అనేక ప్రమాదాలు కుదిపేశాయి. అధునాతన పరిజ్ఞానం వచ్చినప్పటికీ అడపాదడపా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద చర్యలు వీటికి తోడవుతున్నాయి. ఫలితంగా భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. గత కొన్నేళ్లలో చోటుచేసుకున్న ప్రధాన విమాన ప్రమాదాలివీ..


2014
* డిసెంబర్‌ 28: ఎయిర్‌ ఏషియా విమానం ఇండొనేషియాలోని సురబయా నుంచి సింగపూర్‌ వెళుతూ.. జావా సముద్రంపై గల్లంతైంది. ప్రతికూల వాతావరణం కారణంగా నిర్దేశిత మార్గం నుంచి మళ్లేందుకు పైలట్‌ అనుమతి కోరారు. విమానంలో 162 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
* జులై 24: ఎయిర్‌ అల్జీరీకి చెందిన ఏహెచ్‌5017 విమానం.. బుర్కినా ఫాసో సరిహద్దు వద్ద మాలిలో కూలింది. 116 మంది మరణించారు.
* జులై 17: మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌17 విమానం తూర్పు ఉక్రెయిన్‌లో కూలింది. 298 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల తిరుగుబాటుదారులే క్షిపణితో కూల్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 1998 నుంచి ఇప్పటి వరకూ జరిగిన విమాన ప్రమాదాల్లో ఎక్కువ మందిని బలితీసుకున్న ఘటన ఇదే.
* మార్చి 8: మలేషియాకు చెందిన ఎంహెచ్‌370 విమానం 239 మందితో కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళుతూ.. గల్లంతైంది. దీనికోసం విస్తృతంగా గాలించినప్పటికీ శకలాలు దొరకలేదు. విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత భారీ, ఖరీదైన గాలింపు చర్యగా మిగిలిపోయింది.
2015
* జూన్‌ 30: ఇండొనేషియాకు చెందిన హెర్క్యూలస్‌ సి-130 సైనిక రవాణా విమానం మెడాన్‌లోని నివాస ప్రాంతంలో కూలింది. విమానంలోని 122 మంది, నేల మీదున్న మరో 19 మంది చనిపోయారు.
* మార్చి 24: బార్సిలోనా నుంచి డుస్సెల్‌డార్ఫ్‌కు వెళుతున్న జర్మన్‌ వింగ్స్‌ సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఎ320 ఫ్రెంచ్‌ ఆల్ప్స్‌ వద్ద కూలింది. 148 మంది మరణించారు.
2012
* జూన్‌ 3: డానా ఎయిర్‌కు చెందిన విమానం నైజీరియాలోని లాగోస్‌లో కూలింది. 150 మంది చనిపోయారు.
* ఏప్రిల్‌ 20: భోజా ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ విమానాశ్రయంలో కూలింది. అందులోని 121 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
2010
* జులై 28: కరాచీ నుంచి బయలుదేరిన పాకిస్థాన్‌ విమానం.. ఇస్లామాబాద్‌ విమానాశ్రయం వద్ద దిగే క్రమంలో పక్కనే ఉన్న కొండను ఢీకొని కూలిపోయింది. 152 మంది బలయ్యారు.
* మే 22: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం మంగళూరు విమానాశ్రయం వద్ద దిగుతూ లోయలోకి జారిపోయింది. ఫలితంగా మంటలు చెలరేగి విమానంలోని 158 మంది చనిపోయారు.
2009
* జులై 15: కాస్పియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుపోలెవ్‌ విమానం అర్మేనియా వెళుతూ ఉత్తర ఇరాన్‌లో కూలిపోయింది. 168 మంది ప్రాణాలు కోల్పోయారు.
* జూన్‌ 30: యెమన్‌కు చెందిన ఎయిర్‌బస్‌ 310 హిందూ మహాసముద్రంలో కామోరోస్‌ దీవుల వద్ద కూలింది. 153 మంది చనిపోగా.. ఒక్కరు ప్రాణాలు దక్కించుకున్నారు.
* జూన్‌ 1: ఎయిర్‌ ఫ్రాన్స్‌ ఎయిర్‌బస్‌ 330 విమానం రియో డి జెనైరో నుంచి పారిస్‌ వెళుతూ అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూలింది. 228 మంది బలయ్యారు.
2008
* ఆగస్టు 20: స్పాన్‌ ఎయిర్‌ విమానం మాడ్రిడ్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతూ ప్రమాదానికి లోనైంది. 154 మంది చనిపోగా.. 18 మంది గాయపడ్డారు.
2007
* జులై 17: టీఏఎం ఎయిర్‌లైన్స్‌ విమానం సావో పాలోలో దిగుతూ కూలిపోయింది. విమానంలోని 186 మంది, నేలమీదున్న 13 మంది దుర్మరణం పాలయ్యారు.
* మే 5: కెన్యా ఎయిర్‌ వేస్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం దక్షిణ కామెరూన్‌లోని బురద నేలలో కూలి, 114 మంది మరణించారు.
* జనవరి 1: ఆడం ఎయిర్‌కు సంబంధించిన బోయింగ్‌ 737-400 విమానం ఇండోనేషియాలోని సులవెసి దీవిలోని పర్వతాల్లో కూలింది. 102 మంది బలయ్యారు.
2006
* సెప్టెంబర్‌ 29: 154 మందితో వెళుతున్న బోయింగ్‌ 737 విమానమొకటి గాల్లో ఓ ప్రైవేటు జెట్‌ విమానాన్ని ఢీ కొని బ్రెజిల్‌లోని అమేజాన్‌ అడవుల్లో కూలింది. విమానంలోని వారందరూ ప్రాణాలు కోల్పోయారు.
* ఆగస్టు 22: రష్యాకు చెందిన టుపోలెవ్‌-154 విమానం ఉత్తర ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్‌లో కూలి, 170 మంది దుర్మరణం పాలయ్యారు.
* మే 3: ఆర్మేవియా సంస్థ విమానం నల్ల సముద్రంలో కూలి 113 మంది చనిపోయారు.
* 2005లో ఏకంగా ఏడు ప్రధాన విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో మొత్తం 827 మంది బలయ్యారు.
* 2003 ఫిబ్రవరి 19న ఇరాన్‌ సైనిక రవాణా విమానం కూలి 276 మంది చనిపోయారు. 1998-2015 మధ్యకాలంలో ఎక్కువ మందిని బలితీసుకున్న రెండో పెద్ద విమాన ప్రమాదం ఇదే.
* 2002లో తైవాన్‌కు చెందిన బోయింగ్‌ 747 విమానం పెంఘు దీవి వద్ద కూలి 225 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
* 2001 నవంబర్‌ 12న అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఎ300 విమానం డోమినికన్‌ రిపబ్లికన్‌కు వెళుతూ.. న్యూయార్క్‌లోని నివాస ప్రాంతంపై కూలిపోయింది. అందులోని 260 మంది, నేల మీదున్న ఐదుగురు చనిపోయారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net