latestnews
ఆ చితా భస్మం నేతాజీదో కాదో నిర్ధారించాలి
విమాన ప్రమాదమే సుభాష్‌చంద్రబోస్‌ మరణానికి కారణం కావొచ్చు
అనితా బోస్‌ అభిప్రాయం
దిల్లీ: నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ మరణానికి 1945, ఆగస్టు 18న తైపేలో జరిగిన విమాన ప్రమాదమే కారణమయి ఉండవచ్చని, అయితే జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉంచిన చితాభస్మం ఆయనదో కాదో నిర్ధారించడానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె డాక్టర్‌ అనితా బోస్‌ (73) అన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనితా బోస్‌ మాట్లాడుతూ ‘‘డీఎన్‌ఏ పరీక్ష రుజువును అందిస్తుంది.’’ అని అన్నారు. అనితా బోస్‌ వచ్చే నెలలో భారత్‌ను సందర్శించవచ్చు.డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాల్సిందిగా జపాన్‌తో మాట్లాడాలని భారత ప్రభుత్వాన్ని ఆమె కోరవచ్చని భావిస్తున్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూవంటి నేతలకు ఇచ్చిన స్థాయిలో బోస్‌కు గౌరవం ఇవ్వలేదనే వాదనపై అభిప్రాయం కోరగా ఆమె స్పందిస్తూ ‘‘అది అధికారిక కేసు మాత్రమే కావచ్చు. కానీ సామాన్యులు ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకున్నారు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ సీనియర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు.’’ అని అన్నారు. బోస్‌ పట్ల నెహ్రూ వైఖరి గురించి ప్రశ్నించగా చాలా అంశాల్లో వారి అభిప్రాయాల మధ్య సారూప్యాలున్నాయని, కొన్ని అంశాల్లో వారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారని చెప్పారు. నేతాజీ మరణాన్ని రాజకీయాలు చేయడానికి ఉపయోగించుకున్నారని ప్రముఖ ఆర్థికవేత్త ఆమర్త్యసేన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ కొంతమంది విషయంలో ఇది నిజమేనన్నారు. అయితే తన తల్లి సహా బోస్‌ బంధువులు పలువురు ఆయన ఆ ప్రమాదం నుంచి బయట పడే ఉంటారని లేదా అందులో ఉండి ఉండరని నిజాయతీగానే భావించారన్నారు.నేతాజీ దస్త్రాలను కేంద్రం, పశ్చిమ్‌ బంగ ప్రభుత్వం బహిర్గతం చేయడం .. ఆయన మరణం వెనక ఉన్న మర్మాన్ని ఛేదించడానికి ఉపకరిస్తుందా అని ప్రశ్నించగా 90శాతం దస్త్రాల విషయంలో.... దశాబ్దాల క్రితమే బహిర్గతం చేయకపోవడానికి మనకు కారణమేమీ కనిపించదని, తన తండ్రి మరణం గురించి అనూహ్య విషయాలను ఈ దస్త్రాలు బహిర్గతం చేయడం అనుమానమేననన్నారు. నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలా అని ప్రశ్నించగా ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి జాతీయ సెలవుదినంగా ప్రకటించడం కన్నా మెరుగైన మార్గాలున్నట్లు చెప్పారు.

కేసీఆర్‌ ‘విజన్‌’కు నీరాజనం!

తెరాస ఉండగా వేరే పార్టీ వైపు చూపు సారించడం దండగని రాజధాని నగరవాసులంతా తీర్మానించినట్లుగా వెలువడిన తీర్పు- చార్‌ సౌ షహర్‌లో కొత్తచరిత్ర....

Full Story...

ముహూర్తం కుదిరింది ఖరారు మిగిలింది

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల క్రతువు ముగియడంతో మేయర్‌ ఎన్నికకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్‌...

అప్పులిచ్చారా... కప్పిపుచ్చారా!

కలిసిరాని ప్రకృతి, కలిసిరాని ధరలు, విపణిలో అక్రమాలు వెరసి సేద్యమంటేనే రైతులు హడలుతున్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా... లక్షలాది మంది ఇప్పటికీ...

మేడారంలో అధికారులకు ప్రత్యేక యూనిఫాం!

జాతర ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా భక్తులు వరదలా వస్తున్నారు. ప్రతిరోజూ మేడారం కిక్కిరిసిపోతోంది. అధికారులు ముందే మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

నాణ్యత.. పైపూత!

48 కిలోమీటర్ల దూరం... రూ.23 కోట్లు నిధులు... అంటే ఒక కిలోమీటరు దూరానికి సగటున రూ.47 లక్షలు! ఇంత మొత్తం మరమ్మతులకు వెచ్చిస్తున్నారంటే ఆ రహదారి...

నిధులిచ్చినా..నెమ్మదే!

జిల్లాలో ఏళ్లతరబడి కొనసా..గుతున్న నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఖరీఫ్‌కు.. లేదంటే రబీకి సాగునీరంటూ కాలం వెళ్లదీయడమే...

‘బండ’బడ.. ఇదేమి ఆగడం?

ఏదైనా ప్రభుత్వ ఆస్తిని అమ్మాలంటే ఆషామాషీ కాదు. తొలుత దాని విలువను నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం టెండరు నిర్వహించి ఎక్కువ ధర ఎవరు ఇస్తామంటే వారికే దానిని...

తప్పుదారి

జిల్లాలో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అక్రమ పద్ధతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి రసాయనాలను సైతం అమ్మేసుకుంటున్నారు.

‘శత’విధీ..

ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా శత కోటి రూపాయలు వెచ్చించిన నిర్మించిన పథకం అది.. దీన్ని ఏ ప్రయోజనం ఆశించి నిర్మించారో అది ప్రస్తుతం అవసరం లేకుండా...

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిహాసం

నవీపేట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సొరకాయపప్పు కలిపి చేసిన భోజనం చేసిన కొద్దిసేపటికి ఒకొరితరువాత ఒకరు వాంతులు...

ఒప్పంద ఉద్యోగం.. అధికారులపై పెత్తనం

చేసేది ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగం.. పెత్తనం మాత్రం గజిటెడ్‌ అధికారులపై.. మరి అటువంటి ఉద్యోగి చెప్పినట్లు అధికారులు వింటారా? అంటే ఎవరైనా సరే అంతగా శ్రద్ధ పెట్టరనే...

ఎత్తిపోతల ధర్మ‘వరం’

దుర్గి మండలం ధర్మవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరం ఇచ్చారు. గ్రామ పరిధిలో 3500 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.35 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి...

సొమ్ము నేసేశారు

శవాలపైన కూడా కాసులు ఏరుకోవడమంటే ఇదే. ప్రకృతి ప్రకోపించి బతుకులు కకావికలమైన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం విదిల్చిన ఆ కాస్త నిధులపైనా దళారుల కన్ను...

నీరు దారి మళ్లొద్దు!

కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో, ఈ నీటిని సక్రమంగా పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

అడుగడుగునా ఆక్రమణ

1959, 1985, 2010లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాచీన కట్టడాలు, పురావస్తు క్షేత్రాలు, శిథిలావశేషాల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ ప్రాధాన్యత కట్టడంగా లేపాక్షిని గుర్తించారు.

దీక్షకు దన్ను

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో...

ఎత్తిపోతలకు కొత్తరూపు

మెట్ట భూములకు ప్రతి నీటి బిందువు అమృత సింధువే. బీడువారిన పొలాలకు జలసిరి అందించి సస్యశ్యామలం చేయటానికి ప్రవహించే నీటిని ఎత్తిపోసేలా పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నా...

చేతులు దులుపుకొన్నారా? చేతులు తడుపుకొన్నారా?

అవుకు మండలం పాతచెర్లోపల్లిగ్రామ పరిధిలో అక్రమ క్వారీ తవ్వకాల గుట్టును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రట్టు చేసింది. పదేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారుల దృష్టికి రాలేదా?

లెక్క లేదు

దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల ప్రగతికి విడుదలయ్యే నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల ఆలనాపాలనా చూడాల్సిన పాలకులు నిధులు కైంకర్యం...

కష్టాల జడి కన్నీటి తడి

వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాదీ పొగాకు రైతులను వెన్నాడుతోంది.. పొగాకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి పొగ నాట్లు ఆలస్యం కావడం..

కూలితే.. కళ్లుతెరుస్తారేమో!

మీరు రూ. 5 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. పదడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారానికి ఏర్పాట్లు చేసి... ఐదడుగుల మేరకే తలుపు బిగిస్తే! ఏమవుతుంది? చూసిన వారు నవ్వుతారు.

జయహో భారత్‌

నభూతో అన్నట్టుగా... చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, గ్రేట్‌ బ్రిటన్‌ వంటి దిగ్గజ దేశాల నౌకాదళాధిపతులు అచ్చెరువొందగా.. మన నౌకాదళం అద్భుత పాటవాన్ని ప్రదర్శించింది. విశాఖ సాగర...

పాలకులేరీ?

పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. సుమారు మూడేళ్లు కావస్తుంది. నేటికీ పలు పంచాయతీలకు పాలకులు కరవయ్యారు. జిల్లాలో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 74...

మసి పూసి మాయచేసి!

ఇది ఏలూరు అగ్నిమాపక కేంద్ర కూడలి నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారి. ఇక్కడ కొత్త డ్రెయిన్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ వివిధ రకాల హోటళ్లు, దుకాణాలు, ఖరీదైన ఇళ్లు, ఆర్టీసీ గ్యారేజీ...