ఆమిర్‌ ఇడియట్‌.. అందుకే దంగల్‌ చేశాడు

తాజావార్తలు

ఆమిర్‌ ఇడియట్‌.. అందుకే దంగల్‌ చేశాడు
విధు వినోద్‌ చోప్రా
ముంబయి: ఆమిర్‌ ఖాన్‌ లాంటి ఇడియటే దంగల్‌ లాంటి సినిమా తీస్తాడు అని వ్యాఖ్యానించారు దర్శకుడు విధు వినోద్‌చోప్రా. అంటే ఆయన ఆమిర్‌ని తిడుతూ ఈ మాట అనలేదు. నటన అనే కళలో తల పండిన, నిబద్ధత, అంకితభావం ఉన్న ఆమిర్‌లాంటి వ్యక్తే ఈ సినిమా చేయగలడన్నది ఆయన అభిప్రాయం.

ఆమిర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దంగల్‌. హరియాణాకి చెందిన రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ పోఘట్‌ జీవితాధారంగా ఈ చిత్రం రాబోతోంది. గురువారం చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా విధు వినోద్‌చోప్రా ముంబయిలో జరిగిన మామి ఫిలిం ఫెస్టివల్‌లో ఆమిర్‌ మల్లయోధుడిగా కనిపించిన తీరు గురించి ప్రశంసిస్తూ.. ‘ఓ నటుడిగా ఆమిర్‌ అంటే చాలా ఇష్టం. స్వతహాగా తనలోని నైపుణ్యాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటున్నాడు. ఆమిర్‌ ఓ పిచ్చివాడు. త్రీఇడియట్స్‌లాగా ఆమిర్‌ని ఇడియట్‌ అని పిలుస్తుంటాం. కాబట్టి ఇడియట్సే(ఎక్కువ వర్క్‌ చేసేవారు) ఇలాంటి సినిమా చేయగలరు’’ అంటూ కితాబిచ్చారు త్రీఇడియట్స్‌ దర్శకుడు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.