మంత్రగత్తె అన్నారు.. మూత్రం తాగించారు

తాజావార్తలు

మంత్రగత్తె అన్నారు.. మూత్రం తాగించారు
పట్నా : ఓ దళిత మహిళపై దుండగులు దాడికి పాల్పడి ఆమెతో బలవంతంగా మూత్రాన్ని తాగించిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్భంగా జిల్లాలోని పిప్రా గ్రామంలో ఓ మహిళను మంత్రగత్తె అని ఆరోపిస్తూ నలుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యానికి గురికావడానికి ఈ మహిళే కారణమనిపేర్కొంటూ తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక ఆమెతో బలవంతంగా ఆమె మూత్రాన్ని తాగించారు. ఈ ఘటన అనంతరం బాధితురాలు ఆ గ్రామాన్ని విడిచి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారి అంజనీ కుమార్‌ తెలిపారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.