యువీ సేన భారీ విజయం

తాజావార్తలు


యువీ సేన భారీ విజయం
గ్రీన్‌పై 219 పరుగుల తేడాతో గెలుపు
బౌలర్‌ కుల్దీప్‌ విజృంభణ
గ్రేటర్‌ నోయిడా: దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో నిర్వహించిన తొలి మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ సారథ్యంలోని ఇండియా రెడ్‌ ఘన విజయం సాధించింది. సురేశ్‌ రైనా నేతృత్వంలోని ఇండియా గ్రీన్‌పై యువీసేన 219 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రెడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ అర్ధ శతకంతో (77; 116 బంతుల్లో 12×4) ఒంటరి  పోరాటం చేశాడు. గ్రీన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ (4/62) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా గ్రీన్‌.. నాథూ సింగ్‌ (6/53), కుల్దీప్‌ యాదవ్‌ (3/32) బౌలింగ్‌ దెబ్బకు 151 పరుగులకే కుప్పకూలింది.
ముకుంద్‌, సుదీప్‌ శతకాలు
తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లదే పైచేయి కాగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ రాణించారు. పది పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా రెడ్‌.. ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ (169; 221 బంతుల్లో 20×4), సుదీప్‌ ఛటర్జీ (114; 182 బంతుల్లో 14×1) శతకాలతోచెలరేగడంతో 486 పరుగుల లక్ష్యాన్ని గ్రీన్‌ ముందుంచింది. గురుకీరత్‌ సింగ్‌మన్‌ (82; 96 బంతుల్లో 13×4, 1×6) అర్ధశతకంతో రాణించాడు. యువరాజ్‌సింగ్‌ (10) రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. గ్రీన్‌ బౌలర్లలో శ్రేయాస్‌ గోపాల్‌ (5/123) ఆకట్టుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రైనా సారథ్యంలోని గ్రీన్‌.. బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (6/88) అద్భుత ప్రదర్శనతో 277 పరుగులకే చేతులెత్తేసింది. రాబిన్‌ ఉతప్ప (72; 66 బంతుల్లో 10×4, 1×6) అర్ధశతకం చేశాడు. అయితే చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్‌ సురేశ్‌ రైనా (90; 101 బంతుల్లో 11×4, 3×6)ను జట్టు స్కోరు 275 వద్ద కుల్దీప్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత రెండు పరుగులకే ప్రజ్ఞాన్‌ ఓజా (7) వెనుదిరగడంతో ఇండియా రెడ్‌ 219 పరుగులతో విజయం సాధించింది.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.