21 బంతుల్లోనే శతకం.. గేల్‌ రికార్డు బద్ధలు

తాజావార్తలు


21 బంతుల్లోనే శతకం.. గేల్‌ రికార్డు బద్ధలు
టొబాగో: వెస్టిండీస్‌ విధ్వంకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ టీ20 క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వాటిలో అరుదైనది 30 బంతుల్లోనే శతకం చేయడం. ఐపీఎల్‌-6లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన గేల్‌ పుణె వారియర్స్‌పై ఈ ఘనత సాధించాడు.

ఈ అరుదైన రికార్డును వెస్టిండీస్‌కే చెందిన ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో బ్యాట్స్‌మన్‌ 23 ఏళ్ల ఇరాక్‌ థామస్‌ అనే కుర్రాడు బద్ధలు కొట్టాడు. కేవలం 21 బంతుల్లోనే శతకం సాధించాడు. 31 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో థామస్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం. థామస్‌ చెలరేగి ఆడడంతో తన టీం స్క్రాబొర్రా ప్రత్యర్థి స్పెసైడ్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని 8 ఓవర్లలోనే ఛేదించగలిగింది.

FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.