latestnews

నాకు ఎవరూ పోటీ కాదు!
‘డిక్టేటర్‌’ పాటల విజయోత్సవంలో బాలకృష్ణ
‘‘నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు పోషించే అవకాశం లభించింది. అదంతా నా అదృష్టం. జానపదాలు, పౌరాణికాలు, సోషియో ఫాంటసీ... ఇలా విభిన్నమైన సినిమాలు చేశాను. ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడ’’న్నారు బాలకృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన ‘డిక్టేటర్‌’ పాటల విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు బాలకృష్ణ జ్ఞాపికలు అందజేశారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. తమన్‌ సంగీతమందించారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నువ్వెంత అనుకునేవాడికి నియంత మా ‘డిక్టేటర్‌’. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా పండగ ఆనందాన్నిస్తుంది. ‘సింహా’, ‘లెజెండ్‌’ తరహాలో మరో గొప్ప విజయాన్ని అందించే చిత్రమిది. సినిమాలో సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ నా సంభాషణల్ని నెమరేసుకుంటుంటారు. అదంతా రచయితల గొప్పతనం. తమన్‌ ఆణిముత్యాల్లాంటి పాటలు అందించాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందించారు. నేను ఏ సినిమా చేసినా కుటుంబ వాతావరణం ఉండాలి. ఈ సినిమా కూడా అలాంటి వాతావరణంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీవాస్‌ నన్ను మరింత స్టైలిష్‌గా చూపించాడు. అంజలి లాంటి కథానాయికలు దొరికితే అద్భుతాలు సృష్టించొచ్చు. సోనాల్‌ చౌహాన్‌ బాగా నటించింది. నవరసాలున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముంద’’న్నారు. శ్రీవాస్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా, నిర్మాతగా రెండు పాత్రలు పోషించడం కష్టమనుకున్నా. బాలకృష్ణగారు ఉన్నారనే ధైర్యంతో నిర్మాతగా ఈ సినిమా చేశా. మేం పేపరుపై ఏదైతే రాసుకున్నామో దాన్నే పక్కాగా తెరపైకి తీసుకొచ్చాం. బాలకృష్ణగారి అభిమానులకు విందు భోజనంలా ఉంటుందీ చిత్రమ’’న్నారు. అంజలి మాట్లాడుతూ ‘‘నాకు బాగా నచ్చిన సినిమా ఇది. బాలకృష్ణగారి 99వ సినిమా ఎలా ఉండాలో అలానే ఉంటుంది. శ్యామ్‌ కె.నాయుడు ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించార’’న్నారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, సుమన్‌, చిన్నా, హేమ, శ్రీధర్‌ సీపాన, అజయ్‌, కాశీవిశ్వనాథ్‌, జీవీ, కౌసల్య, శ్యామ్‌.కె.నాయుడు, గౌతంరాజు, రత్నం, బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.

 
 


దిల్లీ-దుబాయ్‌ చెట్టపట్టాల్‌!

‘ఆసియా పరిణామాల ప్రధాన స్రవంతిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కేంద్ర బిందువు కావాలి. యూఏఈ శక్తి, భారత్‌ సామర్థ్యాలు...

Full Story...

ఇక మేయర్‌ పాలన

మహా నగరంలో ఇక మేయర్‌ పాలన మొదలు కానుంది. గురువారం మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయంగా సాగడంతో పాటు... ఆ ఇద్దరు శుక్రవారం నుంచి బాధ్యతలు...

నోటమాటే లేదు..!

పొలం వద్ద నుంచి మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు రూ.500 ఖర్చు చేయాల్సి వచ్చింది. తీసుకువచ్చిన 55 పెట్టెల టమాట అమ్ముడుపోకపోవడంతో అక్కడే వదిలేశా. ఉదయం రూ.30కి...

‘స్వచ్ఛ మిషన్‌’ నత్తనడక

స్వచ్ఛ భారత్‌ నిర్మాణంలో వ్యక్తిగత మరుగుదొడ్డి అతి ముఖ్యమైన అంశం. ప్రతి ఇంటా వీటిని తప్పనిసరిగా నిర్మించాలచే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్య అంశంగా...

జిల్లా అంతటికీ సాగునీరు

మన దగ్గర ఉన్న నిధులు.. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రచించుకుంటే సమగ్రత ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లా సాగు నీట...

ఆర్‌ఎంపీలపై నియంత్రణ డొల్ల

జిల్లాలో 2,809 ఆర్‌ఎంపీ ఆస్పత్రులు ఉన్నట్లు సంబంధిత వైద్యుల సంఘం వద్ద లెక్కలు ఉన్నాయి. సంఘానికి కూడా తెలియకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు మరో వెయ్యి దాకా...

ప్రచారం.. పరిసమాప్తం

నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారపర్వానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుండటంతో కొన్ని రోజులుగా మారుమూల...

యాదాద్రి విస్తరణకు పచ్చజెండా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధికి మార్గాలన్నీ సుగమమయ్యాయి. రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం యాడా అధికారులత...

గొంతు.. విప్పాలి గొంతు.. తడపాలి

ఈ చిత్రం కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి వెళ్లే రహదారి. గ్రామం సుమారు 5,250 మంది జనాభాతో విస్తరించి ఉంది. దీని పరిధిలో అనంతారం, బొట్లకుంట శివారు ప్రాంతాలు.

కంచె కుదించి... అక్రమానికి తెగించి!

భూభాగంలో 33 శాతం అటవీ ప్రాంతం లేకపోవడం పర్యావరణపై పెనుప్రభావం చూపుతోంది. ప్రకృతి విపత్తులు సంభవించేందుకు ఇదే ప్రధాన కారణం. అటవీ భూములు విచ్చలవిడిగా...

ముసుగేసి.. మూలన పడేసి..

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంకోసం ఏర్పాటుచేసిన టీవీలు కనిపించకుండా పోతున్నాయి. ‘మన టీవీ’లు అటకెక్కాయి. వీటిని వినియోగించుకోవడంలో అధికారులు...

రూ.10 వేల కోట్ల పెట్టుబడి..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం విజయవాడ-గుంటూరు మధ్య నిర్మితమవుతుండడంతో గుంటూరుతోపాటు కృష్ణా జిల్లాలోనూ పారిశ్రామిక ప్రగతి వూపందుకుంది. ఔత్సాహిక...

‘ఇంటి గుట్టు’.. అవినీతి కనికట్టు

పురపాలక సంఘ కమిషనర్‌ బినామీతో చేజిక్కించుకున్న రాజీవ్‌నగర్‌లోని సర్వే నంబరు 367లోని ఇంటి సంఖ్య 248 ఇది. ఇందిరమ్మ పథకం కింద దీన్ని నిర్మించారు. దారిద్య్రరేఖకు...

కాసులిస్తేనే పని..

కృష్ణాజిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో హల్‌చల్‌ చేస్తున్న బ్రోకర్ల దందాపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) స్పందించింది. గురువారం ఉదయం విజయవాడ ఉపరవాణా కమిషనర్‌...

అతుకుల పనుల్లో.. అడ్డగోలు దోపిడీ!

నీటి సంరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతుల మాటున భారీ దోపిడీ జరుగుతోంది. పనులు తూతూమంత్రంగా చేపట్టి నిధులు కాజేస్తున్నారు.

నిధులున్నా నిర్లక్ష్యం

జిల్లాలో ఇందిర ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు గతంలోనే ఇళ్లు మంజూరైనా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం...

ఇసుకాసురుల ‘సిండికేట్‌’ యత్నాలు

ఇసుక రీచ్‌లను దక్కించుకోవడానికి కీలక నేతలు, వారి అనుయాయులు తెరవెనుక ఉండి అంతా నడిపించారు. ముఖ్యంగా అధిక రీచ్‌లలో సిండికేట్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.

అమరుడా అహమ్మద్‌... దేశమే వందనమంది

‘కుటుంబంలో చిన్నవాడు ముస్తాక్‌ అహమ్మద్‌. దీంతో గారాబంగా పెంచుకొన్నాం. అందుకు తగ్గట్టే కుటుంబసభ్యుల్ని అభిమానంగా చూసుకొనేవారు.

నేతల కన్ను!

జిల్లాలో ఇసుక రేవులను దక్కించుకొనేందుకు నేతలు రంగంలోకి దిగారు.గుత్తేదారులను రింగు చేసి పోటీ లేకుండా చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఉత్కంఠ.. ఉద్విగ్నం

పోలీసుల అదుపులో మృతి చెందిన వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన బొప్పన పరిపూర్ణచంద్రరావు మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నేపథ్యంలో ఒంగోలు రిమ్స్‌లో...

చినుకు రాలనంది.. చింత తీరకుంది

‘భారత వ్యవసాయ రంగం పురోగతి సాధించినప్పటికీ పూర్తిగా వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంది. సరైన వర్షాలు లేక పంటల దిగుబడి తగ్గడం తీవ్ర ఆందోళనకరం’-ప్రణబ్‌ముఖర్జీ,...

సాగుకు సరే... మరివిద్యుత్తు?

ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం సాగునీటికే ప్రాధాన్యం ఇస్తుండటంతో సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్కేంద్రాల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గోదావరి డెల్టాలోని రబీ...

కదిలిన అధికార యంత్రాంగం

జిల్లా కేంద్రం విజయనగరం పట్టణం, నెల్లిమర్ల, గుర్ల మండలాలకు తాగునీరు అందించే చంపావతి నది ఎండిపోవడంపై ‘ఈనాడు’ పత్రికలో గురువారం ప్రచురితమైన ‘ఎండినది’ ...

నీ స్పర్శ కోసం..!

కడుపులో ఓ నలుసు పడిందన్న మాటతో ఆనందబాష్పాలతో మైమరిచావు.. నెలనెలా కొత్త వూపిరి అందిస్తూ.. జీవితంపై ఆశలు రెకేత్తించావు.. 9 నెలల యాతనను ఆనందంగా అనుభవించావు..