బ్రెగ్జిట్‌ నష్టాలు పూడ్చుకోవచ్చు

తాజావార్తలుబ్రెగ్జిట్‌ నష్టాలు పూడ్చుకోవచ్చు
దేశీయంగా అంతర్లీన సానుకూలతలు
రుతుపవనాల పురోగతిపై దృష్టి
కొనసాగనున్న టాటా గ్రూప్‌ షేర్ల నష్టాలు
విశ్లేషకుల అంచనాలు
బ్రెగ్జిట్‌ కారణంగా వచ్చిన నష్టాలను ఈ వారం మార్కెట్లు పూడ్చుకునే అవకాశం ఉంది. అంతర్లీనంగా సానుకూలతలున్నందున బ్రెగ్జిట్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నది మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. ఒకవేళ బ్రెగ్జిట్‌ పరిణామాల వల్ల మార్కెట్లు మళ్లీ పడ్డా, అది కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చని బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నాయి. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులకు గురువారం గడువు తీరనున్నందున వూగిసలాట కనిపించవచ్చు. నిఫ్టీ 8000-8300 మధ్య కదలాడవచ్చని చెబుతున్నారు. రుతుపవనాల పురోగతి సంతృప్తికరంగా ఉండటం, ఎఫ్‌డీఐ ప్రకటనలు సానుకూలతలు తెచ్చిపెట్టవచ్చు. వ్యవసాయ, వినియోగ సంబంధిత షేర్లను బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. బ్రిటన్‌తో సంబంధమున్న టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎంపిక చేసిన ఫార్మా కంపెనీల్లో బేరిష్‌ ధోరణి కనిపించే అవకాశం ఉందని అంటున్నాయి. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలిలా..
చమురు
ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటివి సానుకూల ధోరణితో చలించొచ్చు. అయితే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, కెయిర్న్‌ ఇండియాలపై కొంత ప్రతికూలతలు కనిపించొచ్చు. కీలక సూచీలు, చమురు ధరల సరళి కొన్ని రోజుల పాటు చమురు రంగ కంపెనీలపై ప్రభావం చూపించవచ్చు. ఐఓసీకి రూ.430 వద్ద నిరోధం; రూ.405 వద్ద మద్దతు; బీపీసీఎల్‌కు రూ.1040 వద్ద నిరోధం రూ.980 వద్ద మద్దతు కనిపిస్తున్నాయి.
వాహన
మార్కెట్‌తో పాటే ఈ రంగ షేర్లూ ప్రతికూల ధోరణితో ట్రేడవవచ్చు. శుక్రవారం వెలువడే వాహన విక్రయ గణాంకాలను మార్కెట్‌ పరిశీలిస్తుంది. ఐరోపాలో కార్యకలాపాలున్న టాటా మోటార్స్‌కు ఒత్తిడి కొనసాగొచ్చు. ఈ స్క్రిప్‌నకు రూ.400 వద్ద బలమైన మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.380 వరకూ పడిపోవచ్చు. మారుతీ సుజుకీ కీలక మద్దతు స్థాయైన రూ.4000 దిగువకు చేరొచ్చంటున్నారు.
ఔషధ
ప్రతికూల ధోరణితో ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు. బ్రిటన్‌ నుంచి కొన్ని కంపెనీలకు ఆదాయాలు అందుతుండడమే ఇందుకు నేపథ్యం. యూఎస్‌ ఎఫ్‌డీఏ నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంపెనీల నుంచి మదుపర్లు దూరంగా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు పెద్ద స్థాయి ఔషధ కంపెనీలన్నీ ప్రతికూల ధోరణితో చలించొచ్చు. మధ్యస్థాయి కంపెనీల్లో దివీస్‌ లేబొరేటరీస్‌పై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు.
టెలికాం
ఈ రంగం మిశ్రమ ధోరణులను ప్రదర్శించొచ్చు. బ్రిటన్‌ వాణిజ్య విధానాల్లో స్పష్టత వచ్చేవరకు ఐరోపాలోని వ్యాపారులు ఐటీ, టెలికాం సేవల్లో పెట్టుబడులను నిలిపి ఉంచొచ్చని భావిస్తున్నారు. ఎయిర్‌టెల్‌కు రూ.352-355 స్థాయిలో మంచి మద్దతు దొరకవచ్చు. ఇది రూ.362 స్థాయినీ అధిగమిస్తే రూ.370కు పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌కామ్‌, టాటా కమ్యూనికేషన్స్‌లు ఈ వారం పెరగవచ్చు.
లోహ
లోహ, గనుల తవ్వక కంపెనీలు వూగిసలాటకు లోనుకావొచ్చు. బ్రెగ్జిట్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లోహ ధరలు కుంగాయి. దీనికి కరెన్సీ హెచ్చుతగ్గులూ తోడయ్యాయి. ఈ నేపథ్యంలో లోహ షేర్లలో కొంత దిద్దుబాటు కనిపించొచ్చు. ఐరోపాలో అనుబంధ సంస్థ ఉన్న టాటా స్టీల్‌పై ‘విక్రయించండి’ అని బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. హిందాల్కోను మాత్రం కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నాయి.
ఐటీ
ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. ప్రధాన మార్కెట్‌ నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఐరోపా కార్యకలాపాల నుంచి ఐటీ కంపెనీలకు 25% ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నష్టాల పాలైనప్పటిÂ ఈ వారం తిరిగి లాభాలను పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నష్టాలొచ్చినా మరీ ఎక్కువ పతనం ఉండదని అంటున్నారు. స్వల్పకాలానికి టెక్‌ మహీంద్రాను పరిశీలించొచ్చంటున్నారు.
ఎఫ్‌ఎమ్‌సీజీ
సానుకూల ధోరణితో చలించొచ్చు. కొద్ది రోజులుగా రుతుపవనాలు పుంజుకుంటుండడం ఈ రంగ షేర్లపై సెంటిమెంటును పెంచొచ్చు. బ్రెగ్జిట్‌ ప్రభావం మన ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలపై పరిమితమే. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, డాబర్‌ ఇండియాలు సానుకూల ధోరణితో చలించొచ్చని అంటున్నారు. గోద్రేజ్‌ కన్జూమర్‌ రూ.1600; డాబర్‌ రూ.330లను చేరుకోవచ్చని అంటున్నారు. ఐటీసీ రూ.350-365 మధ్య చలించొచ్చు.
బ్యాంకింగ్‌
బ్యాంకింగ్‌ షేర్లు శుక్రవారం వచ్చిన నష్టాలను ఈ వారం భర్తీ చేసుకోవచ్చు. సానుకూల ధోరణితో కదలాడవచ్చు. అయితే వూగిసలాటలకు అవకాశం ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ల్లో కొనుగోళ్లు కనిపించొచ్చని ఒక బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ స్థానంలో ఎవరు రావొచ్చనే దానిపై మార్కెట్‌ దృష్టి సారిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీ 17000 స్థాయిలో స్థిరీకరణకు గురికావొచ్చు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.