latest breaking telugu news

తాజావార్తలు


వణక్కు... తొణక్కు!
చలిపులి పంజాపై... వేసెయ్‌ పంచాస్త్రం
ఉదయాన్నే మంచు తెరలు... వెచ్చదనాన్ని అందించే భానుని కిరణాల కోసం ఎదురుచూపులు... వేడివేడి ఫలహారాలు లాగించడం... రాత్రివేళల్లో మంటలు వేసుకోవడం... మొత్తంగా శీతాకాలం చలి నగరవాసుల్ని చక్కిలిగిలి పెడుతుంది. ఇదంతా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడే. ఈ సీజన్‌లో అప్పుడప్పుడూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతుంటాయి. అప్పటివరకు ఆహ్లాదకరంగా అనిపించిన వాతావరణమే చలి పెరిగి.. గాలిలో తేమ తగ్గి చికాకు పెట్టేస్తుంది.


 హైదరాబాద్‌: దీపావళికి ముందే నగరవాసిని చలి వణికిస్తోంది. ఈ సమయంలో 20 డిగ్రీలు ఉండాల్సిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోయాయి. ఒకేసారి మూడు డిగ్రీలు తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర భారతం నుంచి నగరంపైకి వస్తున్న చలిగాలులతో వాతావరణం పొడిగా మారింది. గాలిలో తేమ తగ్గడంతో చిన్నా, పెద్దా అందరినీ చర్మ సంబంధ సమస్యలు చికాకు పెడుతున్నాయి. చర్మం పొడిబారి కళావిహీనం కావడం, శిరోజాలు చిట్లిపోవడం, చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాస, చర్మ సంబంధ అలర్జీలు.. మనో వ్యాకులత పెరగడం.. తరచూ కడుపునొప్పి.. ఇలా ఒకదాని వెనక ఒకటి చుట్టు ముట్టేస్తుంటాయి. ఇవి చాలవన్నట్లు నగరంలో పాడైన రహదారులపై లేస్తున్న దుమ్మురేణువులు శీతాకాలంలో శ్వాస, చర్మ సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలోనే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలాన్ని వెచ్చవెచ్చగా ఆస్వాదించవచ్చు అంటున్నారు వైద్యులు.

పిల్లలూ... పెద్దలూ...
చిన్నపిల్లలు, పెద్దలను చలి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది.
* చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. మెడమీద, చేతులపై ఇవి ఎక్కువ. మంట, దురద ఉంటుంది.
* సోరియాసిస్‌ సమస్యతో బాధపడే వారికి ఎలర్జీ ఎక్కువవుతుంది.
* అధిక రక్తపోటు, రక్తంలో కొవ్వు తగ్గించే మందులు వాడుతున్న వారిలో ఈ సీజన్‌లో చర్మం పొడిబారడం ఎక్కువ.
* చలి తీవ్రత పెరిగే కొద్దీ హార్మోన్‌, థైరాయిడ్‌ సమస్యలున్న వారి చర్మంపై ప్రభావం చూపిస్తుంది. వీరిలో ఎక్కువగా కాళ్లు, చేతులు పగులుతాయి.

1 ఇంట్లో...
చర్మం పొడిబారకుండా ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి చిట్కాలతోనూ చర్మం నిగనిగలాడేలా చూసుకోవచ్చు. నీ ఎక్కువ వేడినీళ్లతో.. పూర్తిగా చన్నీళ్లతో కాకుండా... గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. స్నానానికి ముందు శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేసుకోవడం ద్వారా చర్మం పొడి బారదు. నీ స్నానం చేసేటప్పుడు సబ్బును సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించాలి. వాడే సబ్బులు మాయిశ్చరైజ్‌ ఉన్నవైతే ఉత్తమం. నీ స్నానానికి ముందు కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, వెన్న, నెయ్యిని ఒంటికి రాసుకోవడం మంచిది. ఫలితంగా చర్మంలో తేమ పోకుండా ఉంటుంది. నీ సబ్బుల స్థానంలో సున్నిపిండి, పెసరపిండి వాడితే మంచిది. స్నానం అయిపోయాక తడి ఆరకముందే మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరినూనెనూ వాడొచ్చు. నీ స్నానానికి ఉపయోగించే నీటిలో రెండు చెంచాల నూనెను వేయండి. ఫలితంగా చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.

2 బయటకు వెళితే...
* ఇంట్లోంచి బయటకు వెళ్లేవారు శరీరం పూర్తిగా కప్పే వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఇది తప్పనిసరి. నీ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు కచ్చితంగా శిరస్త్రాణం ధరించాలి. ఇది రెండు విధాలా ఉపయోగకరం. ప్రమాదాల నుంచి రక్షణతో పాటూ చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. నీ శీతాకాలం ఎండైనా సరే... మధ్యాహ్నం పూట వెళ్లేవారు గొడుగు వాడటం అలవాటు చేసుకోవాలి. నీ ఈ కాలంలో బూట్లు వేసుకోవడం కాళ్లు పగిలేవారికి ఉపశమనంగా ఉంటుంది. వీరు ఇంట్లో ఉన్నప్పటికీ సాక్స్‌లను ధరించడం మేలు. నీ బయటి నుంచి వచ్చినప్పుడు చర్మం ఎక్కువగా పొడిబారి సాగినట్లు అనిపిస్తుంది. చల్లగాలిలో తిరగడంతో చర్మంపై ముడతలు వెక్కిరిస్తుంటాయి. ఇంటికి వచ్చాక క్లెన్సర్లతో శుభ్రం చేసుకున్నాక ఆయిల్‌తో నిదానంగా మసాజ్‌తో ఫలితం ఉంటుంది. నీ ఈ కాలంలో చర్మం నిగారింపును కోల్పోవడం సహజం. చల్ల గాలులు తగలడం, చలి తట్టుకోలేక ఎక్కువ సమయం ఎండలో గడపడమే ఇందుకు కారణం. ఒకవేళ ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకున్నాక వెళ్లాలి.

3 ఆహారం
చలికాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు త్వరగా మనపై దాడి చేస్తుంటాయి. ఆహార అరుగుదల తక్కువ. నీ ఈ కాలంలో జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఏది పడితే అది... ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటిని తీసుకోకుండా శుచి శుభ్రతతోపాటూ వేడిగా ఉన్న ఆహారం తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీ రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలి. సి విటమిన్‌ ఉండే ఆహారం, పళ్లను తినాలి. నీ ఈ కాలంలో చర్మం కాంతిమంతంగా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగడం అవసరం. దాహంగా లేదని చాలామంది రోజు మొత్తం రెండు మూడు గ్లాసులు మించి తీసుకోరు. నీరు తాగాలనిపించకపోతే పళ్ల రసాలు, కూరగాయల రసాలు తీసుకోవచ్చు. చల్లని నీరు తాగడం వల్ల పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే వేడి చేసుకుని తాగడం మేలు. నీ ఈ కాలంలో గుడ్లు, చేపలు తీసుకోవడం మంచిది. ఇంట్లోనే వండుకున్నవి మేలు.

4 పండ్లు
* ఈ కాలంలో దొరికే అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు. జామ, దానిమ్మ, బొప్పాయి, కమల, అరటిపండ్లను విరివిగా తినొచ్చు. వీటన్నింటిలో విటమిన్‌ సి ఎక్కువ. ఇది జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. నీ పళ్లను వేర్వేరు రూపాల్లో తినొచ్చు. రసాల కంటే సలాడ్స్‌ రూపంలో తీసుకోవడం మేలు. మరి పచ్చిగా కాకుండా బాగా పండినవి కాకుండా ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నీ ఈ కాలంలో దొరికే నల్ల ద్రాక్ష వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణకు దోహదం చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ ఎ, బి1, బి2... మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

5 కురులు
* కేశాలు చలికి పొడి బారి అంద విహీనమై చిట్లి పోతాయి. చిన్నచిన్న చిట్కాలతో కురుల అందం చెడకుండా చూసుకోవచ్చు. నీ తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. మాయిశ్చరైజ్‌ ఉన్నవాటినే వాడాలి. నీ బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం చర్మానికే కాదు.. తల వెంట్రుకలకూ నష్టకారకం. తరచూ తలంటుకునే వాళ్లు వెంట్రుకలు పొడి బారకుండా నాన్‌ సడ్సింగ్‌ షాంపులు ఉపయోగించడం మేలు. నీ నగరంలో కాలుష్యం కారణంగా రోజూ తలస్నానం చేసేవారు ఉన్నారు. వీరు ఈ సీజన్‌లో రెండు మూడు రోజులకోసారి చేయడం మేలు.నీ రోజువారీ ప్రయాణాలు చేసేవారు కేశాలను ఆర బెట్టుకునేందుకు, అలంకరణ కోసం హీటింగ్‌ మిషన్లను వాడుతుంటారు. దీన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. ఎక్కువ వేడి చేయడం వల్ల వెంట్రుకలు చిట్లిపోతాయి. నీ చలికి బయటికి వెళ్లేటప్పుడు, శిరస్త్రాణం ధరించేటప్పుడు తల వెంట్రుకలను స్కార్ప్‌లు, తల రుమాలుతో కప్పుకోవడం వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌లోని దుమ్ము, ధూళి నుంచి కాపాడుకోవచ్చు. నీ కేశాలకు యువతరం రకరకాల రంగులతో ప్రయోగాలు చేస్తుంటారు. చలికాలంలో రంగులు ఉపయోగించడం వల్ల కురులు తేమ కోల్పోయి పొడిగా మారే ప్రమాదం ఉంది. ఇది అలర్జీకి కారణం అవుతుంది. చర్మంపై దద్దుర్లకు దారితీస్తుంది. ఈ తరహా ప్రయోగాలను ఈ కాలంలో వాయిదా వేయడం ఉత్తమం.

వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ
- డాక్టర్‌ శివరాజు, జనరల్‌ ఫిజీషియన్‌
చలికాలం వచ్చిందంటే జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, నిమోనియా వంటి వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా బాధిస్తుంటాయి. అలర్జీలు పెరుగుతాయి. యాభై ఏళ్లు పైబడినవారు.. ఆస్తమా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. హృద్రోగ సమస్యలు ఉన్నవారిలో చలికి రక్తనాళాలు బిగుసుకుపోతాయి. పొగతాగే వారిలో కొందరికి రక్తనాళాల్లోకి కొవ్వు చేరి అడ్డంకులు ఏర్పడొచ్చు. వీరు తమ శరీరంలో శీతాకాలంలో వచ్చే మార్పులపై అప్రమత్తంగా ఉండాలి. నడుస్తుంటే కాళ్లు నొప్పి పుట్టడం, చల్లగా అయిపోవడం. స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. గదిలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే చలి చొక్కాలు ధరించడం ఉత్తమం. ఉదయపు నడకకు తెల్లవారు జామునే చలిలో కాకుండా సూర్యోదయం తర్వాత వెళ్లాలి. పెద్దవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. వాతావరణంలోని కాలుష్యం ఈ కాలంలో వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.