latestnews
సృష్టికి ప్రతిసృష్టి!
క్లోనింగ్‌ విగ్రహాలపై మోజు
అంకుర సంస్థలతో ఉపాధి భళా
ఇంజినీరింగ్‌ విద్యార్థుల జోరు
బెంగళూరు (హెబ్బాళ), న్యూస్‌టుడే : చదివిన చదువులకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూసే పట్టభద్రుల్ని మనం చూసుంటాం. పుట్టిన దేశంలో కాకుంటే విదేశాల్లోనైనా ఏదో చిన్న పాటి ఉద్యోగం రాకపోదా అని వీసాల పయనాలతో విసిగి వేసారిన యువ నిరుద్యోగులకూ ప్రస్తుతం కొదవలేదు. ఈ గడ్డపైనే అనువైన ఉపాధిని తమకు తామే సృష్టించుకొని- మరి కొందరికి చేయూతనిచ్చే యువకులు కొందరే ఉంటారు. ఇటువంటి వారే మన దేశానికి కావాలని ప్రధాని సైతం స్టార్టప్‌ జపంతో పరితపిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి యువకులు నగరంలో కొంగొత్త ఆలోచనలతో సంప్రదాయ వ్యాపారాలను ఛేదిస్తూ దూసుకెళ్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీ, స్వీడన్‌ వంటి దేశాల్లో ఎంతో ఆదరణ పొందుతున్న త్రిడి స్వీయ చిత్రాల (త్రీడీ సెల్ఫీ రెప్లికా) ప్రక్రియను నగరంలోనూ ప్రారంభించి విజయం సాధిస్తున్నారు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు. వీరిలో సిద్ధార్థ రాథోడ్‌ ఒకరు. ఆయన నిర్వహిస్తున్న ‘క్లోన్‌ మి’ సంస్థ ప్రస్తుతం నగరంలో ఒక క్రేజ్‌గా మారింది. ఆ వివరాల్లోకి ఓసారి తొంగి చూస్తే..

ఆలోచనకు అర్థం..
సిద్ధార్థ స్థానిక ఎం.ఎస్‌.ఆర్‌.ఐ.టి.లో బీటెక్‌, ఇంగ్లాండ్‌ మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌. ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రత్యేకతతో చదివిన ఉన్నత విద్యను సరిగ్గా అన్వయించుకొని ప్రారంభించిన క్లోన్‌ మి సంస్థ ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా ఆదరణకు నోచుకొంటోంది. సమీప బంధువు కమలేష్‌ కొఠారి సహకారంతో త్రిమితీయ ప్రతిరూపం (త్రిడీ రెప్లికా) సాంకేతికతపై ఆసక్తి పెంచుకొన్న సిద్ధార్థ అందుకోసం ప్రత్యేకంగా కోర్సులేం చేయకుండా అంతర్జాలం ద్వారానే స్వీయ విజ్ఞాని కావటం గమనార్హం. ఇలా 2013లో నగరంలోనే ప్రారంభించిన క్లోన్‌ మి ల్యాబ్‌ అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 80ఏళ్ల పండు ముసలి వరకు అందమైన త్రిమితీయ ప్రతిరూపాల్ని తయారు చేసి అందిస్తూ వారి కళ్లలో ఆనందాన్ని చవి చూస్తుంది.

ఏమిటీ బొమ్మ..
ఇటీవలి కాలంలో ఎంతో క్రేజు సంపాదించుకొన్న మొబైల్‌ ప్రక్రియ అంటే సెల్ఫీనే. అటువంటి సెల్ఫీని తీసుకొని మొబైల్‌లోని ఒక ఫైల్‌లో భద్ర పరచటమే కాదు.. ఆ సెల్ఫీకి అచ్చమైన ప్రతి రూపాన్ని ఇవ్వటమే త్రీడి సెల్ఫీ రెప్లికా. మనలాంటి ఒక ప్రతి రూపాన్ని మనకు ఇష్టమైన సైజుల్లో తయారు చేసివ్వటం ఈ క్లోన్‌మి ప్రత్యేకత. వినియోగదారుడు క్లోన్‌మి ల్యాబ్‌కు వెళ్లి కుర్చీలో కూర్చోగానే అక్కడి సిబ్బంది విభిన్న కోణాల్లో చిత్రాలు తీస్తారు. ఇలా తీసిన చిత్రాన్ని ప్రొ జెట్‌×60 3డీ ప్రింటర్‌లో స్కాన్‌ చేసి తర్వాత అందమైన లేపనాలతో విగ్రహాలు తయారు చేస్తారు. ఇలా చేసిన విగ్రహాల్ని కేవలం నాలుగు నుంచి వారం రోజుల్లో మన బల్లలపై ఉంచుకొని తరచి తరచి చూసుకోవటం మన వంతు అవుతుంది. సిద్ధార్ధ్‌తో పాటు మరో ఇంజినీరింగ్‌ విద్యార్థి నిఖిల్‌ సైతం ఇలాంటి ఓ ల్యాబ్‌ను నిర్వహిస్తూ తన ఆలోచనను పదును పెడుతున్నాడు.

భవిష్యత్తు అంతా త్రీడిదే
ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌, సెల్ఫీ చిత్రాలదే హవా అయినా.. రానున్న రోజుల్లో డిజిటల్‌ త్రీడీలదే రాజ్యమంటున్నాదు సిద్ధార్థ్‌. సినిమా తారలు మొదలుకొని, పోలీసు అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారాలు ఇలా తమ ప్రతి రూపాల్ని చూసుకొని మురిసి పోవటం చూస్తుంటే ఈ సాంకేతికతకు భద్రమైన భవిష్యత్తు తద్యమని అంటున్నారు. ఈ ప్రయోగాలయం ప్రారంభించిన మూడు నాళ్లలో చిన్నా పెద్దా విగ్రహాలతో కలిపి కనీసం 30వేలకు పైగా ప్రతి రూపాల్ని తాను తయారు చేసినట్లు చెబుతున్నాడు సిద్ధార్థ. లక్షలు పోసి చదివానని, అనుకొన్న ఉద్యోగం రాలేదని కుమిలే నిరుద్యోగ పట్టభద్రులకు ఇటువంటి అంకుర సంస్థల వ్యవస్థాపకులు మార్గదర్శకులు అవుతారనటంలో ఎటువంటి సందేహం లేదు.


కేసీఆర్‌ ‘విజన్‌’కు నీరాజనం!

తెరాస ఉండగా వేరే పార్టీ వైపు చూపు సారించడం దండగని రాజధాని నగరవాసులంతా తీర్మానించినట్లుగా వెలువడిన తీర్పు- చార్‌ సౌ షహర్‌లో కొత్తచరిత్ర....

Full Story...

ముహూర్తం కుదిరింది ఖరారు మిగిలింది

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల క్రతువు ముగియడంతో మేయర్‌ ఎన్నికకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్‌...

అప్పులిచ్చారా... కప్పిపుచ్చారా!

కలిసిరాని ప్రకృతి, కలిసిరాని ధరలు, విపణిలో అక్రమాలు వెరసి సేద్యమంటేనే రైతులు హడలుతున్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా... లక్షలాది మంది ఇప్పటికీ...

మేడారంలో అధికారులకు ప్రత్యేక యూనిఫాం!

జాతర ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా భక్తులు వరదలా వస్తున్నారు. ప్రతిరోజూ మేడారం కిక్కిరిసిపోతోంది. అధికారులు ముందే మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

నాణ్యత.. పైపూత!

48 కిలోమీటర్ల దూరం... రూ.23 కోట్లు నిధులు... అంటే ఒక కిలోమీటరు దూరానికి సగటున రూ.47 లక్షలు! ఇంత మొత్తం మరమ్మతులకు వెచ్చిస్తున్నారంటే ఆ రహదారి...

నిధులిచ్చినా..నెమ్మదే!

జిల్లాలో ఏళ్లతరబడి కొనసా..గుతున్న నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఖరీఫ్‌కు.. లేదంటే రబీకి సాగునీరంటూ కాలం వెళ్లదీయడమే...

‘బండ’బడ.. ఇదేమి ఆగడం?

ఏదైనా ప్రభుత్వ ఆస్తిని అమ్మాలంటే ఆషామాషీ కాదు. తొలుత దాని విలువను నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం టెండరు నిర్వహించి ఎక్కువ ధర ఎవరు ఇస్తామంటే వారికే దానిని...

తప్పుదారి

జిల్లాలో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అక్రమ పద్ధతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి రసాయనాలను సైతం అమ్మేసుకుంటున్నారు.

‘శత’విధీ..

ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా శత కోటి రూపాయలు వెచ్చించిన నిర్మించిన పథకం అది.. దీన్ని ఏ ప్రయోజనం ఆశించి నిర్మించారో అది ప్రస్తుతం అవసరం లేకుండా...

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిహాసం

నవీపేట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సొరకాయపప్పు కలిపి చేసిన భోజనం చేసిన కొద్దిసేపటికి ఒకొరితరువాత ఒకరు వాంతులు...

ఒప్పంద ఉద్యోగం.. అధికారులపై పెత్తనం

చేసేది ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగం.. పెత్తనం మాత్రం గజిటెడ్‌ అధికారులపై.. మరి అటువంటి ఉద్యోగి చెప్పినట్లు అధికారులు వింటారా? అంటే ఎవరైనా సరే అంతగా శ్రద్ధ పెట్టరనే...

ఎత్తిపోతల ధర్మ‘వరం’

దుర్గి మండలం ధర్మవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరం ఇచ్చారు. గ్రామ పరిధిలో 3500 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.35 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి...

సొమ్ము నేసేశారు

శవాలపైన కూడా కాసులు ఏరుకోవడమంటే ఇదే. ప్రకృతి ప్రకోపించి బతుకులు కకావికలమైన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం విదిల్చిన ఆ కాస్త నిధులపైనా దళారుల కన్ను...

నీరు దారి మళ్లొద్దు!

కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో, ఈ నీటిని సక్రమంగా పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

అడుగడుగునా ఆక్రమణ

1959, 1985, 2010లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాచీన కట్టడాలు, పురావస్తు క్షేత్రాలు, శిథిలావశేషాల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ ప్రాధాన్యత కట్టడంగా లేపాక్షిని గుర్తించారు.

దీక్షకు దన్ను

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో...

ఎత్తిపోతలకు కొత్తరూపు

మెట్ట భూములకు ప్రతి నీటి బిందువు అమృత సింధువే. బీడువారిన పొలాలకు జలసిరి అందించి సస్యశ్యామలం చేయటానికి ప్రవహించే నీటిని ఎత్తిపోసేలా పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నా...

చేతులు దులుపుకొన్నారా? చేతులు తడుపుకొన్నారా?

అవుకు మండలం పాతచెర్లోపల్లిగ్రామ పరిధిలో అక్రమ క్వారీ తవ్వకాల గుట్టును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రట్టు చేసింది. పదేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారుల దృష్టికి రాలేదా?

లెక్క లేదు

దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల ప్రగతికి విడుదలయ్యే నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల ఆలనాపాలనా చూడాల్సిన పాలకులు నిధులు కైంకర్యం...

కష్టాల జడి కన్నీటి తడి

వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాదీ పొగాకు రైతులను వెన్నాడుతోంది.. పొగాకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి పొగ నాట్లు ఆలస్యం కావడం..

కూలితే.. కళ్లుతెరుస్తారేమో!

మీరు రూ. 5 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. పదడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారానికి ఏర్పాట్లు చేసి... ఐదడుగుల మేరకే తలుపు బిగిస్తే! ఏమవుతుంది? చూసిన వారు నవ్వుతారు.

జయహో భారత్‌

నభూతో అన్నట్టుగా... చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, గ్రేట్‌ బ్రిటన్‌ వంటి దిగ్గజ దేశాల నౌకాదళాధిపతులు అచ్చెరువొందగా.. మన నౌకాదళం అద్భుత పాటవాన్ని ప్రదర్శించింది. విశాఖ సాగర...

పాలకులేరీ?

పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. సుమారు మూడేళ్లు కావస్తుంది. నేటికీ పలు పంచాయతీలకు పాలకులు కరవయ్యారు. జిల్లాలో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 74...

మసి పూసి మాయచేసి!

ఇది ఏలూరు అగ్నిమాపక కేంద్ర కూడలి నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారి. ఇక్కడ కొత్త డ్రెయిన్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ వివిధ రకాల హోటళ్లు, దుకాణాలు, ఖరీదైన ఇళ్లు, ఆర్టీసీ గ్యారేజీ...