నవ వధువుకు ఎంత కష్టం

తాజావార్తలు

నవ వధువుకు ఎంత కష్టం
పొదుపు సొమ్ము అప్పుకింద జమ
తెల్లారితే వివాహం.. నగదు అందక కన్నీరుమున్నీరు
శింగనమల: తెల్లవారితే (ఈనెల 9వ తేదీ) ఆ యువతి వివాహం. ఇందుకోసం బ్యాంకులో పొదుపు చేసుకొన్న నగదును అప్పుకింద జమ చేస్తామంటోన్న బ్యాంకు అధికారులు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇదీ ఓ నవ వధువుకు వచ్చిన నోట్ల కష్టం.  అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల‌ మండలంలోని రాచేపల్లికి చెందిన శోభారాణి అనే యువతి వివాహం ఈ నెల 9వ తేదీన కడపలో జరగాల్సి ఉంది. బ్యాంకులో తన ఖాతాలో రూ.6 వేలు, తమ్ముడి ఖాతాలో రూ.20 వేలు జమ చేసుకొన్నారు. బుధవారం సలకంచెరువు గ్రామంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లి పొదుపు సొమ్ము ఇవ్వాలని మేనేజర్‌ను వేడుకొంది. అయితే ఈ మొత్తాన్ని తన తండ్రి అప్పు కింద జమచేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారని ఆ యువతి కన్నీటి పర్యంతమైంది. ఉన్నదే కొంత సొమ్ము.. దాన్ని కూడా తండ్రి అప్పు కింద జమ చేసుకొంటే వివాహం నిలిచిపోతుందని కన్నీరు పెట్టినా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్‌ సయ్యద్‌ను వివరణ కోరగా వారు బ్యాంకుకు అప్పు ఉన్నార‌ని, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి చెందిన అప్పు కావడం వల్లే జమ చేసుకొంటున్నామని తెలిపారు. అయితే కొంత సొమ్ము జమ చేసుకొని కొంత మాత్రమే ఇస్తామని వివరించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.