డబ్బులడిగిన కుమారుని పొడిచిన తండ్రి!
close

తాజావార్తలు

గాలిపటానికి డబ్బులడిగిన కుమారుని పొడిచిన తండ్రి!
వారణాశిలో దయనీయ ఘటన
వారణాశి: గాలిపటం కొనుక్కోవడానికి ఓ రెండు రూపాయలివ్వు నాన్నా! అంటూ మారాం చేస్తున్న అభంశుభం తెలియని అయిదేళ్ల కుమారుడిని కన్నతండ్రే దారుణంగా కత్తితో పొడిచేసిన సంఘటన ఇది. తీవ్రంగా గాయపడిన కుమారుడిని తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ఆదివారం నాడిక్కడ ఈ ఘటన జరిగింది. పర్యటక గైడ్‌గా పనిచేస్తున్న వినోద్‌ రాజ్‌భర్‌(35)కు మొత్తం ముగ్గురు పిల్లలు. ఇటీవల బాగా ఆర్థికచిక్కుల్లో పడ్డాడు. పైగా, బాగా మద్యం సేవించే దురలవాటు కూడా ఉంది. ఈ క్రమంలో ఆదివారం అతడు బాగాతాగి ఉన్నాడు. అప్పుడే కుమారుడు శివం గాలిపటం కోసం మారం చేయడంతో ఆగ్రహం పట్టలేకపోయాడు. అయిదేళ్ల పిల్లాడిని బరబరా డాబా మీదకు ఈడ్చుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి....కత్తితో ఆ చిన్నారిని కసితీరా పొడిచాడు. ఇదంతా చూసిన మరో కుమారుడు సత్యం గబగబా వెళ్లి తల్లిని పిలుచుకొచ్చాడు. ఆమె పరుగున వెళ్లి బిడ్డను ఆ దుర్మార్గుడి నుంచి లాక్కుని ఆసుపత్రికి తరలించింది. అక్కడ శివం కు వైద్యులు ప్రాధమిక చికిత్సలు చేసి...ప్రయివేటు ఆసుపత్రికి పంపారు. తప్పతాగి...కన్నబిడ్డనే కత్తితో పొడిచిన తండ్రి వినోద్‌ రాజ్‌భర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.