latestnews

రూ.7.9 లక్షల కోట్లు ఎగిరిపోయాయ్‌
మదుపర్లను ముంచేసిన జనవరి
చిన్న, మధ్యస్థాయి షేర్లు కుదేలు
చైనా, చమురు ధరలే ప్రధాన కారణం
కొత్త సంవత్సరం వస్తూ వస్తూనే మదుపరిని గట్టి దెబ్బే కొట్టింది. ఏ క్షణాన ఎలా కదలాడుతాయో తెలియని గందరగోళ స్థితికి నెట్టేశాయి స్టాక్‌ మార్కెట్లు. మదుపర్లకు జనవరి నెల కంటి మీద కునుకులేకుండా చేసింది. ఈ నెలలోనే 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌.. ఇప్పటిదాకా 6 శాతానికి పైగా కోల్పోయింది. అంతర్జాతీయ వృద్ధిపై చైనా మందగమనం ప్రభావం పడుతుందనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి మన సూచీలు ఏమీ మినహాయింపు కాదు. గతేడాది లాభాలను పంచిన చిన్న, మధ్య స్థాయి షేర్లు.. ఈ ఏడాది తొలినాళ్లలో కుదేలయ్యాయి. కొంత వూరట కలిగించే అంశమేమిటంటే.. మ్యూచువల్‌ ఫండ్‌లు దాదాపు రూ.5,000 కోట్లను స్టాక్‌ మార్కెట్లలోకి చొప్పించడమే.

జనవరిలో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. చైనా మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పాటు చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం వల్ల షేర్లు కకావికలమయ్యాయి. ఎక్కడా చూసినా నష్టాలతో మదుపరి నెత్తురోడాడు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 1,632 కోల్పోయింది. ఈ నష్టాలతో మదుపర్ల సంపద రూ.7,96,903 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.100 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.92,40,831 కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయ వృద్ధి భయాలతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈనెలలో రూ.9,900 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. రూపాయి 28 నెలల కనిష్ఠానికి చేరడం, కార్పొరేట్‌ కంపెనీల బలహీన ఫలితాలు కూడా పతనానికి తోడ్పడ్డాయి.

వైదొలుగుతున్న ఎఫ్‌పీఐలు: ఓపక్క షేర్ల ధరలు భారీగా క్షీణిస్తున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్‌పై మ్యూచువల్‌ ఫండ్‌లు సానుకూల ధోరణిని కనబరిచాయి. కొత్త సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మార్కెట్‌ నుంచి వైదొలుగుతుంటే.. దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు (ఎంఎఫ్‌లు) మాత్రం ఇప్పటి వరకు ఈక్విటీల్లోకి రూ.5,023 కోట్లను గుమ్మరించడమే ఇందుకు నిదర్శనం. స్థిరాస్తి విపణి స్తబ్దుగా ఉండటంతో పాటు పసిడి ధరల పతనం కొనసాగుతుండటం వల్ల స్టాక్‌ మార్కెట్ల నుంచి ఫండ్‌ మేనేజర్లు భారీ లాభాలను ఆశించారు. గత ఏడాది మొత్తం మీద రూ.70,716 కోట్లు తీసుకొచ్చిన దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు.. ఈ ఏడాది జనవరిలో రూ.5,023 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఎఫ్‌పీఐలు మాత్రం ఇదే సమయంలో రూ.9,963 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన 2014 మే నుంచి దేశీయ ఎంఎఫ్‌లు స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ధోరణితో ఉన్నారని క్వాంటమ్‌ ఏఎంసీ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ పేర్కొనడం గమనార్హం.

బ్లూచిప్‌ షేర్లే మెరుగు: ఈ ఏడాది బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే.. చిన్న, మధ్య స్థాయి షేర్లు కుదేలయ్యాయి. ఈ నెలలో ఇప్పటిదాకా చిన్న, మధ్య స్థాయి (మిడ్‌క్యాప్‌) షేర్ల సూచీలు 10 శాతం చొప్పున కుదేలవ్వగా.. సెన్సెక్స్‌ 6 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్‌ సూచీ 8.52 శాతం తగ్గి 10,217.05 పాయింట్లకు, చిన్న స్థాయి షేర్ల సూచీ 9.62 శాతం కుంగి 10,697.91 పాయింట్లకు చేరాయి. జనవరి 20న మిడ్‌క్యాప్‌ సూచీ 9,892.36 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. అనిశ్చితి నేపథ్యంలో చిన్న, మధ్య షేర్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాదిలో చిన్న, మధ్య షేర్ల హవా నడిచిన విషయం తెలిసిందే. బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే సగటున 7.4 శాతం ప్రతిఫలాన్ని ఈ షేర్లు అందించగలిగాయి. ఈ వారంలో వెలువడనున్న ఫెడ్‌, బీఓజే సమావేశ నిర్ణయాలు.. మిగిలిన మూడు రోజుల ట్రేడింగ్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి.


బుకాయింపుల బూటకం!

పట్టుమని అయిదు లక్షల రూపాయల పెట్టుబడి; అలవోకగా దాదాపు అయిదు వేలకోట్ల రూపాయల గిట్టుబడి! సోనియాగాంధీ...

Full Story...

ధనా‘గన్‌’

ముంబయి తరహా కాల్పుల ఘటనలు హైదరాబాద్‌లోనూ జరుగుతున్నాయని సోమవారం చోటుచేసుకున్న ఉదంతం రుజువుచేస్తోంది. కార్పొరేటు ఆసుపత్రి ప్రారంభం, వాటాల పరంగా పొరపచ్చాలు...

డీసీసీ పదవికి క్యామ రాజీనామా

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు...

సమ్మక్కే నాలోకొచ్చింది..!

‘అందాల మా వూరి అక్కాచెల్లెల్లే.. సమక్క సారక్క’ అంటూ వినసొంపైన పాటలు దశాబ్ద కాలం కిందట అందరిలోనూ గొంతుకయ్యాయి. అప్పట్లో ‘సమ్మక్క సారక్క’ చిత్రం...

ఆలస్యం.. అమృతమ్‌..!

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అమృత్‌ పథకం ప్రకటించి 8 నెలలు కావస్తోంది.. ఇప్పటికే నిధులు కేటాయించిన కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటుండగా..

పుష్కర ప్రయోజనం సిద్ధిరస్తు!

పాలమూరుకు కృష్ణా పుష్కరాలు నిధుల వరదను మోసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న పుష్కరాల కోసం ఘాట్లు, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు...

లోలోతుకు..

జిల్లాలో వేగంగా పడిపోతున్న నీటి మట్టాల తీరు చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు జలదరించాల్సిందే. తీవ్ర వర్షాభావానికితోడు నీటి పొదుపు విషయంలో నిర్లక్ష్య ధోరణి.. వెరసి భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెడుతున్నాయి.

ఎంచక్కాపనులిక

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా వస్తున్నకృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగే పుష్కర మహోత్సవానికి ...

‘బెల్టు’ దోపిడీ

క్కరూ రూపాయే కదా అని...లక్షమంది వదిలేస్తే రూ.లక్ష అవుతాయి. మద్యం మాఫియా సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. తాగాలనుకుంటే ఎమ్మార్పీ ధరలకన్నా రూ.5, రూ.10 ఎక్కువయినా ...

బాలికా..భరోసా ఏదిక...!

ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ గ్రామానికి చెందిన మచ్చర్ల నరేశ్‌, విజయ కూతుళ్లు శ్రీనిధి, సహస్ర. శ్రీనిధి 2009లో జన్మిస్తే, సహస్ర 2011లో జన్మించింది.

ఇక ఆన్‌లైన్‌లో పంట ఉత్పత్తుల విక్రయం

ఏ రోజు ఎంత ధర ఉంటుందో తెలియదు.. పంటను మార్కెట్‌కు తీసుకువెళ్లిన తరువాత వ్యాపారులు ఏ ధర నిర్ణయిస్తే, ఆ రోజు మొత్తానికి అదే ధర. ఒక్కో విపణిలో ఒక్కో ధర ఉంటోంది. ఏడాది పొడవునా కష్టపడి ...

మోకీలుకు ముడి పడింది

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మో‘కీలు’ మార్పిడి శస్త్ర చికిత్సల నిర్వహణకు ‘నిధుల సమస్య’ వచ్చి పడింది. మరోవైపు ఈ శస్త్ర చికిత్సల కోసం అవసరమైన నిరుపేదలు నిత్యం ఆసుపత్రిని సంప్రదిస్తున్నారు.

‘మార్పు’ ఇదేనా ..‘మన భవిత’ భద్రమేనా?

ఈ చిత్రంలోని పెద్దపాళెం పంచాయతీ వీరాంజనేయపురానికి చెందిన పదిరోజుల బాలింత శారద(19) ఆదివారం రాత్రి మృతిచెందారు.

పశ్చిమాన పుష్కలం తూర్పున నిష్ఫలం

కొత్తగా వేలం వేయనున్న రేవులు: ప్రస్తుతం చెవిటికల్లు, కంచెల, శనగపాడు, పొక్కునూరు, కాసరబాద, అల్లూరుపాడు, సూరాయిపాలెం, గుంటుపల్లి, భవానీపురం, పెదపులిపాక, మద్దూరు.

తాగునీటికి... నిధుల ఎద్దడి!

కణేకల్లు మండలం హనకనహాల్‌లో చాలా కాలంగా తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. వేదావతి హగరి నుంచి సొల్లాపురం మీదుగా పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతోంది.

దీక్షాఫలం

తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది.. కాపులకు రిజర్వేషన్‌.. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు...

గడువు మీద గడువు.. ముందుకు పడదే అడుగు

గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం.. సీమ నడిగడ్డ రైతుల చిరకాల స్వప్నం. కీలకమైన వరదకాల్వ పనులు ఏళ్ల తరబడి సాగు..తూనే ఉన్నాయి.

పరీక్షమార్హం.. కాదు

నగరంలోని గాయిత్రీ ఎస్టేట్‌లో మూడు సంవత్సరాల క్రితం వెలిసిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు నగరంలోని సింహభాగం పరీక్షలు రాస్తుంటారు. కారణం ప్రతి వైద్యునికి వారి క్లినిక్‌ను బట్టి నెలకు...

వరద పనుల్లో నాణ్యతకు పరదా

గూడూరు నియోజకవర్గం కోట మండలం గూడలి- మెట్టు మార్గంలో ర.భ. శాఖకు చెందిన రోడ్డు ఇటీవల వరదలకు తెగిపోయింది. ఈ పనులను తుతు మంత్రంగా చేశారు.

భూ షకలక...

రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ప్రభుత్వ భూములు కనిగిరి ప్రాంతంలో ఉన్నాయి. ఇదే అదనుగా భూ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములనూ ఆక్రమించుకుని తెగనమ్ముకుంటున్నారు.

‘మహోదయ’ స్నానం... భక్తజన పావనం

రాకరాక వచ్చిన అరుదైన రోజు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సుదినం. భక్తజనం కదిలింది. సాగరం చెంత నదీ సంగమ ప్రాంతాల్లో సోమవారం ‘మహోదయ’ స్నానాలాచరించారు.

విశాఖ కెవ్యుకేక

‘భారతీయుల గుండెల్లో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన నగరం ఇది. హుద్‌హుద్‌ వంటి విలయాన్ని ఎదుర్కొని కేవలం 14 నెలల వ్యవధిలోనే పూర్వస్థితికి చేరుకుంది. విశాఖ ప్రజలస్ఫూర్తికి సెల్యూట్‌’

భక్తజన మహోదయం!

చంపావతి నదీ సాగర సంగంలో పుణ్యస్నానాలు చేసే భక్తులకు నిజంగానే దేవుడు కనిపించాడు. ప్రభుత్వ సౌకర్యాలు కానరాకపోవడం.. కనీస సదుపాయాలు కొరవడడంతో వచ్చిన భక్తులకు ...

కమీషన్‌ ఏజెంట్లకే ‘మద్దతు’

మద్దతు ధరపై ఈసారి విస్తృత ప్రచారం చేసి అధికారులు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. రూ. 1849 కోట్ల మేర రైతుల నుంచి ధాన్యం కొన్నారు. అంకెల ప్రకారం చూస్తే ఇది...