స్టార్‌వార్స్‌ను పరీక్షించిన ఇజ్రాయిల్‌
close

తాజావార్తలు

స్టార్‌వార్స్‌ను పరీక్షించిన ఇజ్రాయిల్‌
జెరూసలెం: ఖండాంతర క్షిపణి విధ్వంసక వ్యవస్థను ఇజ్రాయిల్‌ పరీక్షించింది. దీనిద్వారా దేశం బయట నుంచి వచ్చే క్షిపణులను సురక్షితంగా ధ్వంసం చేయవచ్చు. దీనిని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఇచ్చిన యారో-3 విధ్వంసక వ్యవస్థను ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్సుకు అందజేశారు. దీనిని ఇజ్రాయిల్‌ వైమానిక సంస్థలు, బోయింగ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పటికే యారో-2 వ్యవస్థను 2000 సంవత్సరం నుంచి పరీక్షిస్తున్నాయి. ప్రస్తుతం వచ్చిన యారో వ్యవస్థ దీంతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్రయోగంతో ఇజ్రాయిల్‌పై ఖండాంతర దాడులు గణనీయంగా తగ్గుతాయని ఆ దేశ రక్షణమంత్రి తెలిపారు. వీటిని అంతరిక్షంలోనే పేల్చివేయడంతో న్యూక్లియర్‌, జీవ, రసాయిన అయుధాల నుంచి రక్షణ పొందొచ్చని వివరించారు. ఇజ్రాయిల్‌ తరచూ తన శత్రువైన ఇరాన్‌ నుంచి క్షిపణి దాడి ముప్పు పొంచి ఉందని భావిస్తుంటుంది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.