ఓం నమోవెంకటేశాయ.. శుభారంభం

తాజావార్తలు

ఓం నమోవెంకటేశాయ.. శుభారంభం
హైదరాబాద్‌: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో ఇప్పటికి మూడు భక్తిరస చిత్రాలు విడుదలయ్యాయి. వీరి కలయికలో వస్తున్న నాల్గో చిత్రం ‘ఓం నమోవెంకటేశాయ’. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ దిగ్విజయంగా మొదలైందని రాఘవేంద్రరావు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి సమక్షంలో నాగార్జున, పూజారులు తదితరులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఓం నమో వెంకటేశాయ 25వ తారీఖున ముహూర్తం షాట్‌ దిగ్విజయంగా మొదలైంది. నేను నమ్మే ఆ స్వామి కృప వలన ఇప్పటివరకు నా జీవితంలో చాలా మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి కూడా అంతే మంచే జరుగుతుందని, ఆ స్వామి వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం’ అని రాఘవేంద్రరావు పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.