Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


భగవత్‌ స్వరూపాలే రుతువులు
సంవత్సరంలో వచ్చే ఆరు రుతువులలో తొలి రుతువు వసంత రుతువు. ఆ తర్వాత గ్రీష్మం, వర్షం శరత్తు, హేమంతం, శిశిరం అనే రుతువులొస్తాయి. ఈ రుతువులు ఏదో కాలానుగుణంగా కాల గణన కోసం వచ్చి వెళ్ళిపోయేవి అని అనుకోకూడదు. అక్షరాలా ఆరు రుతువులూ భగవత్‌ స్వరూపాలే. ఒక్కొక్క రుతువుకూ ఒక్కో రంగు కూడా ఉంటుంది. ఆ రంగు వస్త్రాలనే ఆ రుతువుకు అధి దేవతలుగా ఉండే దేవతలు ధరిస్తుంటారు. మానవాళి ఏ రుతువులో ఆచరించాల్సిన ధర్మాలను ఆ రుతువులో ఆచరించనప్పుడు ఆ దేవతల అనుగ్రహాన్ని పొందటం ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతిసుఖాలు ఆ అనుగ్రహం వల్ల సొంతం చేసుకోవటం సులభమవుతుందని తైత్తిరీయ అరణ్యకంలోని ప్రథమ ప్రపాఠకం వివరిస్తోంది. ఈ ఉపనిషద్వాణిని భక్తితో గ్రహించి ఆచరణలో పెట్టడం ఎంతో మేలని అనుభవజ్ఞులు, పెద్దలు వివరిస్తున్నారు.

రుతువుకు అరవై అహోరాత్రులు ఉంటాయి. అహోరాత్రానికి ఒక కొలమానం ఉంది. ముప్ఫై ముహూర్తాల కాలాన్ని ఒక అహోరాత్రం అని అంటారు. అటువంటి అరవై అహోరాత్రాలతో ఒక రుతువు కూడుకుని ఉంటుంది. రుతువులలో తొలి రుతువైన వసంతానికి అగ్ని, వసువులు అనే దేవతలు అధి దేవతలు. ఈ రుతువులలో ధాత, ఆర్యముడు అనే ఇద్దరు ఆదిత్యులుంటారు. ఎర్రని వస్త్రాలను ఆ దేవతలు ధరించి ఉంటారు. గ్రీష్మరుతువుకు ఏకాదశరుద్రులు, ఇంద్రుడు అధిదేవతలు. మిత్రుడు, వరుణుడు అనే ఆదిత్యులుంటారు. ఈ రుతువు వర్ణం తెలుపు. ఆ దేవతలు తెల్లని వస్త్రాలను ధరించి ఉంటారు. వర్ష రుతువుకు విశ్వ దేవతలు అధి దేవతలు. ఇంద్రుడు, వివశ్వంతుడు అనే ఇద్దరు ఆదిత్యులుంటారు. అనేక వర్ణాలతో శోభిల్లే ఈ రుతువులో అనేక వర్ణాలు కలిగిన వస్త్రాలను ఆ రుతువుకు సంబంధించిన అధిదేవతలు ధరించి ఉంటారు. శరదృతువుకు మిత్రా వరుణులు అధిదేవతలు. త్వష్ట, విష్ణువు అనే ఆదిత్యులుంటారు. ఈ రుతువు బంగారు వర్ణంతో ఉంటుంది. దీనికి సంబంధించిన దేవతలు బంగారు రంగు వస్త్రాలను ధరించి ఉంటారు. హేమంత రుతువుకు బృహస్పతి అధిదేవత. తర్యముడు, భగుడు అనే ఆదిత్యులుంటారు. ముదురాకు పచ్చరంగుతో ఉండే ఈ రుతువుకు సంబంధించిన దేవతలు ఆ రంగువస్త్రాలనే ధరిస్తారు. రుతువులలో చివరిది శిశిరం బృహస్పతి, విశ్వదేవతలు దీనికి అధిదేవతలు. పూష, క్రతువు అనే ఆదిత్యులుంటారు. చిలుకాకుపచ్చ రంగుతో ఉండే ఈ రుతువులో దానికి సంబంధించిన అధిదేవతలు ఆ రంగు వస్త్రాలనే ధరించి ఉంటారు. ఇలా ఆరు రుతువులకు సంబంధించిన దేవతా విశేషాలను వివరిస్తోంది తైత్తిరీయం.

రుతువులన్నిటిలోనూ క్రమ సంఖ్యలోనే మొదటిది కాక మిగిలిన అన్ని విషయాలలోనూ అగ్రస్థానంలో ఉన్నట్టు కనిపించేది వసంత రుతువు. పుణ్యసంపాదనకు ఈ రుతువు అనువైనది. దీన్నే కుసుమాకరం అని కూడా అంటారు. ఈ కుసుమాకర రుతువంటేనేతానని భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు వివరించి చెప్పాడు. ప్రకృతంతా రమణీయంగా శోభాయామానంగా ఉంటుంది. కోయిల పాటలు, తేనెలు చిలికే పువ్వులు, తుమ్మెదల ఝంకారాలు ఇలాంటివి ఈ రుతు శోభను వివరించి చెప్పే కొన్ని ఉదాహరణలు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందటమే కాకుండా మరికొన్ని ఆనందాలు కూడా ఈ కాలంలోనే జరుగుతాయి. యజ్ఞాలు, వివాహాలు, వేడుకలు, ఉపనయనాల్లాంటి శుభకార్యాలు ఎక్కువగా ఈ కాలంలో జరుగుతూ, ఇళ్ళు, లోగిళ్ళు అన్నీ ఆత్మీయులతో చుట్టు పక్కాలతో కళకళలాడుతుంటాయి. అసలు ఈ వసంత రుతువు భగవంతుడు నిర్వహించే సృష్టి యజ్ఞానికి ఆద్యం లాంటింది. భగవంతుడికి సంబంధించిన కార్యాలన్నిటి వృద్ధికి ఇది బాగా ఉపకరిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా కావటంతో ఎవరికి నిర్ధేశించిన యజ్ఞయాగాల్లాంటి సకల శుభకర్మలనూ వారు నిర్వర్తించి తీరాలని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. దానధర్మాలు, సంతర్పణలు లాంటివి చేయాలి. అతిథులను ఆహ్వానించి గౌరవిస్తూ ఉండాలి. అలా ధర్మబద్ధంగా ఈ రుతువుల్లో ప్రవర్తించిన ఇంటి యజమానికి సర్వ సుఖాలు, సర్వ శుభాలు సమకూరతాయి. వసంత రుతువులో కనిపించే రుతు శోభ అంతా పరమాత్మ స్వరూపమే అని, అందుకే పరమాత్మను ఆరాధించినట్టుగానీ వసంత రుతువును, వసంత రుతు శోభను ఆరాధించి తీరాలని, ఆ రుతువులో చేయాల్సిన పనులన్నిటినీ చేసి తీరాలని పలు పురాణాలు కూడా పేర్కొంటున్నాయి.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net