Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


ప్రజారంజక పాలనకు మంత్రులే కీలకం
శ్రీరామచంద్రుడు చక్కటి పరిపాలనా దక్షుడు అని అందరికీ తెలిసిందే. దశరథ మహారాజూ చాలా కాలంపాటు సమర్థంగానే రాజ్యపాలన చేసి అందరి మెప్పులూ పొందాడు. అలా ఆనాడు దశరథుడు, శ్రీరాముడు ప్రజారంజక పాలకులు అని పేరుతెచ్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఆనాటి మంత్రులే. పాలన సవ్యంగా సాగాలంటే సమర్థులైన మంత్రులు ఉండి తీరాల్సిందే. ఆనాటి మంత్రులకు ఎలాంటి లక్షణాలు ఉండేవి? అనే ప్రశ్న ఉదయించినప్పుడు తగిన సమాధానాన్ని చూపుతుంది వాల్మీకి రామాయణం ఏడో సర్గ. ఈ సర్గలో దశరథుడి పాలనలో ఉన్న మంత్రులు వారి గుణగుణాల తీరు ఇలా కనిపిస్తుంది.

దశరథ మహారాజు దగ్గర ఉండే అమాత్యులంతా కార్యదక్షులు. ఎదుటి వారి అభిప్రాయాల్ని గుర్తించటంలో సమర్థులు. నిరంతరం రాజు క్షేమాన్ని కాంక్షిస్తూ వారంతా ప్రవర్తిస్తుండేవారు. దశరథుడి ఆస్థానంలో ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. వారంతా దోష రహితులు. నిరంతరం రాచకార్య నిర్వహణ మీదే వారి మనస్సు ఉండేది. దృష్టి, జయంతుడు, విజయంతుడు, సిద్ధార్థుడు, అర్ధ సాధకుడు, అశోకుడు, మంత్ర పాలుడు, సుమంత్రుడు... అనేవి ఆ ఎనిమిది మంత్రుల పేర్లు. వశిష్టుడు, వామదేవుడు అనే ఇద్దరు మహర్షులు ప్రధాన పురోహితులుగా ఉండేవారు. ఆ ఇద్దరితోపాటు ఇంకా జాబాలి లాంటి పురోహితులు, మరి కొందరు మంత్రులూ రాజ్య నిర్వహణలో దశరథుడికి సాయ పడుతుండేవారు. వీరందరికీ న్యాయశాస్త్రం, దండనీతి, సకల రాజవిద్యలు సంపూర్ణంగా తెలుసు. ఎవరికి నిర్దేశించిన పనుల్ని వారు మాత్రమే చేసేవారు. ఈ మంత్రులంతా ఎంతో సంపన్నులు. క్షమాగుణంలోనూ, కీర్తి ప్రతిష్ఠల్లోనూ వీరికి మంచి పేరు ఉండేది. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండటమే కానీ వారి ముఖాల్లో కోపం, క్రోధం లాంటివి వారి ప్రవర్తనలో స్వార్థ బుద్ధిని నాటి ప్రజలు ఏనాడూ చూసి ఉండలేదు. అపరాధం చేసిన వారు తమ సొంత పిల్లలే అయినా నిష్పక్షపాతంగా దండిస్తుండేవారు. కోశాగారాన్ని నింపటం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. యోగ్యతల్ని బట్టి వేతనాల్ని ఇస్తూ చతురంగ బలాల్ని సంరక్షించటంలో జాగ్రత్త వహిస్తుండేవారు. శుత్రువైనా నిరపరాధి అయితే దండించే వారు కాదు. సాధువుల్ని రక్షిస్తూ దుర్మార్గుల్ని శిక్షిస్తూ ప్రజలెవరికీ బాధ అనిపించని తీరులో పన్నుల్ని విధిస్తూ, ధనాగారాన్ని నింపుతూ ఉండేవారు. అపరాధుల దోషాల తారతమ్యాన్ని బట్టి ఆ అపరాధుల శక్తి సామర్థ్యాల్ని అనుసరించి అపరాధ రుసుం వసూలు చేయటం, అపరాధుల్ని శిక్షించటం జరుగుతుండేది. అయోధ్యా పురంలోకానీ, కోసల దేశంలోకానీ ఎవరూ అబద్ధం చెప్పేవారు కారు. వంచన, పరస్త్రీ వ్యామోహం అనేవి లేవు. మంత్రులంతా ఎప్పుడూ తగిన విధంగా వేష భూషణాల్ని ధరిస్తూ చూడగానే గౌరవించాలన్న ఆలోచన కలిగేలా ప్రవర్తించేవారు ఆ మంత్రులైనా ఆనాటి ప్రజలైనా తల్లిదండ్రులు, గురువులు లాంటి పెద్దలలో తప్పులు వెతక్కుండా, వారి మంచి గుణాల్ని ఆదర్శంగా తీసుకుంటూ జీవిస్తుండేవారు. ఉన్నంతలో సంతృప్తి చెందటం, మంత్రాలోచనలను రహస్యంగా ఉంచటం, సూక్ష్మబుద్ధితో ఆలోచిస్తూ రాజనీతి శాస్త్ర లోతులను అనుసరించి కార్యనిర్వహణ చేయటం నాటి మంత్రుల లక్షణంగా ఉండేది. ఆనాటి మంత్రుల్లో వేట, జూదం, పగలు నిద్రించటం, ఇతరులను నిందించటం, స్త్రీ లౌల్యం, గర్వపడటం, నృత్య గీత వాద్యాదులతో విపరీతమైన ఆసక్తి కలిగి ఉండటం, వ్యర్థంగా తిరగటం అనే వ్యసనాలు ఉండేవి కావు. వీటితోపాటుగా చాడీలు చెప్పటం, దుస్సాహసం చేయటం, ద్రోహచింతన, అసహనం, ఎదుటివారి మీద తప్పులను ఆరోపించటం, ధనంకోసం నీచంగా మాట్లాడటం, తిట్టడం, కఠినంగా మాట్లాడటం అనే వ్యసనాలూ మచ్చుకు కూడా ఉండేవి కావు. ఇలాంటి సద్గుణాలు ఉన్న మంత్రులు ఉన్నందువల్లనే ఆనాటి రాజ్యపాలన సక్రమంగా సాగింది. ఈనాడు ఉత్తమమైన పాలన ప్రజలకు అందాలంటే ఇప్పుడున్న మంత్రులూ అలాంటి గుణగణాల్ని అలవరచుకుంటే సరిపోతుంది అనే ఆలోచనను పాఠకులకు కలిగిస్తుంది ఈ కథా సందర్భం.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net