Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


రుషి మహిమ
న పూర్వ రుషులకు ఎన్నెన్నో మహిమలు ఉండేవి. అవన్నీ వారికి తపశ్శక్తి వల్ల సంక్రమించాయి. అలాంటి తపశ్శక్తి సంపన్నుల్లో ఒకరైన చ్యవన మహర్షి జీవితంలోని ఓ ఘట్టం మహాభారతం అరణ్య పర్వంలో కనిపిస్తుంది.

మద్యం, స్త్రీ, వేట, పాచికలాటల్ని ఆశ్రయించుకుని ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి మహా భీకరంగా, రాక్షసంగానూ ఉంటుంటాయి. దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు కూడా సమాధానమూ ఇక్కడ కనిపిస్తుంది. పూర్వం భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడు ఒక సరోవర తీరంలో కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. చాలాకాలం పాటు ఆయన తపస్సులో ఉన్న కారణంగా ఆయన చుట్టూ చెట్లు, పుట్టలు మొలిచాయి. ఆ పుట్టల మధ్య నుంచి చ్యవన మహర్షి కళ్ళు తప్ప మరేమీ బయటకు కనిపించని పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో శర్వాతి అనే మహారాజు రాజ్యపాలన చేస్తుండేవాడు. ఓ రోజున ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న సరోవర ప్రాంతానికి విహారానికి వచ్చాడు. ఆ రాజుకు సుకన్య అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె తన చెలికత్తెల్ని వెంట పెట్టుకొని వనంలో అటూ ఇటూ తిరుగుతూ సరోవర తీరానికొచ్చింది. ఆ తీరంలోని పుట్ట మీద రెండు మిణుగురు పురుగులు ఉన్నట్టు ఆమెకు కనిపించింది. వాస్తవానికి అది చ్యవన మహర్షి కళ్ళ నుంచి వెలువడుతున్న కాంతి. ఆమె ఆ విషయాన్ని తెలుసుకోలేక రాజభటుల చేత ఆ మిణుగురు పురుగుల్ని బంధింప చేద్దామని అనుకొంది. ఆ భటులు మూర్ఖంగా ఆ పుట్టను పలుగులతో పడగొట్టి ఆ పురుగులను పట్టుకొందామనుకున్నారు. పలుగుల తాకిడికి పుట్టలోని మహర్షి కళ్ళు మూసుకొన్నాడు. మిణుగురులు కనిపించకపోవటంతో రాకుమారి, భటులు అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ మరుక్షణం నుంచి శర్యాతి సైన్యానికి మూత్ర పురీష విసర్జన క్రియ ఆగిపోయింది. పొట్టలుబ్బి వారంతా బాధపడసాగారు. దానికి కారణమేమై ఉంటుందా అని రాజు ఆలోచిస్తుండగా సుకన్య జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే రాజు పుట్ట దగ్గరకు వెళ్ళి చూశాడు. చ్యవన మహర్షి అక్కడ ఉండటాన్ని గమనించి తన కూతురు చేసిన తప్పును క్షమించి తన సైన్యాన్ని రక్షించమన్నాడు. అప్పుడు చ్యవనుడు ఆమెను ఇచ్చి తనకు వివాహం జరిపిస్తే కరుణిస్తానన్నాడు. శర్యాతి అలాగే చేశాడు. పొట్టలుబ్బి బాధపడుతున్న రాజు సైన్యమంతా మళ్లీ హాయిగా ఆరోగ్యంగా మారారు. వివాహానంతరం సుకన్య చ్యవన ఆశ్రమాన్నికొచ్చింది. తన భర్తను ఎంతగానో పూజిస్తూ, గౌరవిస్తూ ఆయన ప్రేమాభిమానాలను పొందసాగింది. ఆమె పతి భక్తిని అశ్వినీ దేవతలు పరీక్షించాలనుకున్నారు. ఓ రోజున ఆమె ముందుకొచ్చి నిలిచి ముసలివాడు, చర్మం, ఎముకలే మిగిలి అనాకారిగా ఉన్న చ్యవనుడిని విడిచి, మరెవరైనా అందమైన యువకుడిని పెళ్ళాడాలని ఆమెతో అన్నారు. అందుకామె కోపగిస్తూ బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యం ఎంతో గొప్పదని, తన భర్తపై తనకు అసామాన్యమైన ప్రేమ ఉందని, మరోసారి తన దగ్గరకొచ్చి అలా అనవద్దని గట్టిగా చెప్పింది. అంతేకాక జరిగిన సంఘటన గురించి తన భర్తకూ వెంటనే తెలిపింది. అప్పుడు చ్యవనుడు ఈసారి ఆ ఇద్దరూ వచ్చినప్పుడు సుందరాకారుడైన భర్తను ఇవ్వాలని కోరమన్నాడు. ఆ మరునాడు అనుకొన్నట్టుగానే అశ్వనీ దేవతలు మళ్ళీ వచ్చారు. అప్పుడు సుకన్య వారి దగ్గరకు వెళ్ళి తనకు యౌవనవంతుడు, సుందరుడు అయిన భర్తను ఇమ్మని కోరింది. ఆ ఇద్దరు దేవతలూ అలాగేనని చెప్పి సమీపంలోని సరస్సులోకి స్నానం కోసం దిగారు. ఆ విషయాన్ని గమనించిన చ్యవనుడు వెంటనే తానూ సరస్సులోకి దిగాడు. ముగ్గురూ బయటకొచ్చేసరికి చ్యవన మహర్షి అశ్వినీ దేవతల అనుగ్రహంతో నవయౌవనంతో అందంగా తయారై బయటకొచ్చి కనిపించాడు. సుకన్య దేవతల అనుగ్రహానికి ఎంతగానో ఆనందించింది. చ్యవన మహర్షి తనను అనుగ్రహించిన దేవతలకు మేలు చేయాలనుకొన్నాడు. అప్పటికి అశ్వినులు కేవలం దేవతలకు వైద్యులుగా మాత్రమే ఉంటూ ఉండేవారు. దేవతలకు అందే సోమరసం వారికి ఉండేది కాదు. వారు కేవలం దేవతల వైద్యులే కనుక సోమరస పానానికి అర్హులు కారని ఇంద్రుడు దాన్ని అశ్వినులకు అందకుండా చేసేవాడు. చ్యవన మహర్షి ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. వెంటనే తన మామ అయిన శర్వాతి మహారాజుతో ఓ గొప్ప యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞ సమయంలో అందరిలాగానే అశ్వనీ దేవతల్నీ ఆహ్వానించి సోమరసాన్ని ఇవ్వబోయాడు. అందుకు ఇంద్రుడు అడ్డుపడ్డాడు. చ్యవనుడు వెంటనే అక్కడున్న యజ్ఞ కుండం నుంచి ‘మదుడు’ అనే భయంకరమైన రాక్షసుడిని సృష్టించి ఇంద్రుడు ఆ రాక్షసుడిని ఎదుర్కోవటం కోసం వజ్రాయుధాన్ని ఎత్తాడు. చ్యవనుడి శక్తి వల్ల ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే స్తంభించిపోయింది. లోక భీకరుడైన మదుడు తన మీదకు రాబోతుండటంతో ఇంద్రుడు చ్యవన మహర్షిని కాపాడాలని వేడుకొంటూ అశ్వనీ దేవతలకు ఆనాటి నుంచి సోమరసం తాగే అర్హతను, సకల దేవతా శక్తులను అనుగ్రహిస్తున్నట్లు చెప్పాడు. చ్యవనుడు మదుడిని వెనక్కి రప్పించి అతడి రాక్షస శక్తులు ఆ రోజుల నుంచి మద్యం, స్త్రీ, వేట, పాచికలు అనే వాటిని ఆవహించి ఉంటాయని, వాటి విషయంలో జరిగే ఘర్షణలు రాక్షసంగా పరిణమిస్తాయని అన్నాడు. ఆ తర్వాత అశ్వినులు మిగిలిన దేవతలతో సమానంగా సోమపానం చేసి స్వర్గానికి వెళ్ళారు.
ఈ కథా సందర్భంలో పూర్వ రుషుల తపశ్శక్తి ఎలాంటిదో ఉదాహరణ పూర్వకంగా కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net