Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


పట్టు విడుపులుండాలి
భాగవత కథలను చదివినందువల్ల, విన్నందువల్ల ఉపయోగమేమిటి? కేవలం పుణ్య సముపార్జన కోసం మాత్రమే వాటిని చదవటం జరుగుతోందా? లేదంటే మరింకా ఏదైనా ప్రయోజనం సమకూరుతుందా? అని కలిగే సందేహాలకు హరి వంశపురాణం విష్ణుసర్వలోని ముఫ్పై మూడో అధ్యాయం సమాధానాలనిస్తోంది. భగవంతుడి కథలను విన్నందువల్ల పుణ్యం మాత్రమే కాదూ లౌకికంగా సన్మార్గంలో జీవితాన్ని ఎలా గడుపుకోవాలో తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే అనేక సూచనలు అందుతాయి అని ఈ కథా సందర్భం వివరిస్తోంది.

ఉష, అనిరుద్ధుల వివాహం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన వారందరినీ తీసుకొని ద్వారకకు బయలు దేరాడు. శ్రీకృష్ణపరమాత్ముడి దివ్య వాహనమైన గరుత్మంతుడు ముందుకు రాగానే బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు లాంటి వారంతా గరుడ వాహనాన్నెక్కి కూర్చున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఓ విషయం తెలిసింది. బాణాసురుడికి సంబంధించిన కొన్ని గోవులు వరుణుడి ఆధీనంలో ఉన్నాయి. ఆ గోవులు సామాన్యమైనవి కావు. పెద్దపెద్ద కుండలంత పొదుగులతో అమృత తుల్యమైన పాలను అవి ఇస్తాయి. ఆ పాలను తాగినవాళ్ళు బలవంతులవుతారు. వారినెవరూ జయించలేరు కూడా. కృష్ణుడు ఈ అద్భుత విషయాన్ని విని తానెటూ గోపాలకుడే కనుక అంతటి అద్భుతమైన గోవులు తన దగ్గరుంటే బాగుండునని అనుకొన్నాడు. ఇంతలో ఉషా అనిరుద్ధుల వివాహానికి వచ్చి వెనుతిరిగి వెళుతున్న బ్రహ్మ తదితర దేవతలు కృష్ణుడికి అభినందనలు చెప్పి తమలోకానికి తాము బయలు దేరి వెళ్ళారు. కృష్ణుడు కూడా అందరికీ వీడ్కోలు పలికి వరుణలోకానికి వెళ్ళి బాణాసురుడికి సంబంధించిన గోవులను తమ వెంట తీసుకువెళ్ళాలని సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని గ్రహించిన గరుడుడు ఉత్తర దిశగా వేగంగా కదిలాడు. అలా కొద్దిసేపు వెళ్ళగానే కింద సముద్రం కనిపించింది. ఆ సముద్ర ఒడ్డున వేలకొద్దీ ఆవులు తిరుగాడసాగాయి. ఆ ఆవులే వరుణుడి ఆధీనంలో ఉన్న బాణాసురుడి ఆవులు అని కృష్ణుడికి అర్థమైంది. వెంటనే గరుత్మంతుడిని ఆపి తమను దింపి ఆ ఆవులను అన్నింటినీ వీపున ఎక్కించుకొని రమ్మనమని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. కృష్ణుడి ఆజ్ఞను అనుసరించి ఆ ఆవుల సమీపానికి గరుత్మంతుడు వెళుతూ వెళుతూ ఉన్నంతలోనే అవన్నీ సముద్రంలోకి వెళ్ళి పోయాయి. గరుడుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాడు. వెంటనే కృష్ణాదులంతా గరుడిడి మీద ఎక్కి కూర్చున్నారు. కృష్ణుడు గరుడిడిని వరుణలోకానికి బయలు దేరమన్నాడు. క్షణాలలో ఆ పక్షేంద్రుడు బలమైన తన రెక్కలతో సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ వరుణుడు ఉన్న ప్రాంతానికి బయలు దేరాడు. అలా శ్రీకృష్ణాదులు రావటాన్ని చూసిన వరుణదేవుడి సేన యుద్ధానికొచ్చింది. ఆ సేననంతటినీ కృష్ణుడు చెల్లాచెదురు చేశాడు. చివరకు వరుణుడే స్వయంగా కృష్ణుడిని ఎదుర్కోవటానికి బయలుదేరాడు. రుషులు, దేవతలు, గంధర్వులు ఆయన వెంట నడిచారు. ఆయన శిరస్సు మీద నీటి ధారలను వర్షించే తెల్లని గొడుగు, చేతిలో గొప్ప విల్లు ఉన్నాయి. వరుణ, కృష్ణులిద్దరూ భీకరంగా తలపడ్డారు. కృష్ణుడి వైష్ణవాస్త్రం ముందు వరుణుడి వారణాస్త్రం ఓడిపోయింది. సాక్షాత్తూ వైకుంఠ వాసుడే కృష్ణుడి రూపంలో వచ్చాడని అప్పుడు తెలుసుకొన్నాడు వరుణుడు. వెంటనే కృష్ణుడికి నమస్కరించి ఆ గోవులను గతంలో తాను బాణాసురుడికి ఇచ్చినట్లు చెప్పాడు. వాటినే మళ్ళీ కృష్ణుడికి తానివ్వటమంటే తాను మాట తప్పినట్టవుతుందని ప్రతిజ్ఞా భంగం చేసినట్టవుతుందని అన్నాడు. ఒకవేళ తన దగ్గర నుంచి ఆ గోవులను తీసుకు వెళ్ళదలిస్తే తన ప్రాణాలను తీసి ఆ తర్వాత వాటిని వెంటబెట్టుకెళ్ళమన్నాడు వరుణుడు. వరుణుడిలోని ప్రతిజ్ఞాపాలన, సత్య సంధత కృష్ణుడికి బాగానచ్చాయి. ఆ గోవులు తనకు కావాలని అనిపిస్తున్నా వాటి కోసం పట్టుపట్టి వరుణుడి ప్రతిజ్ఞ భంగం చేయటం అధర్మమనిపించింది కృష్ణుడికి. అందుకే ధర్మ రక్షణకోసం తన కోరికను పక్కనపెట్టాడు. తన పట్టుదలను విడిచిపెట్టి ఉచిత అనుచితాలను సమీక్షించుకొని వరుణుడిని ఆశీర్వదించి ద్వారకకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు.

కృష్ణభగవానుడు తానిష్టపడుతున్న గోవుల విషయంలో ధర్మాధర్మాలను విచారించాడు. ఉచితానుచితాలను పరిశీలించాడు. ఇష్టమైన వాటికోసం మూర్ఖంగా పట్టుపట్టి కూర్చోలేదు. ధర్మ పరిరక్షణ కోసం గోవులను అక్కడే విడిచి పెట్టాడు. ఇలాంటి పట్టువిడుపు తత్వాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. అలాకాక అది నాకు నచ్చింది, నాకే సొంతం కావాలి అని మూర్ఖంగా పట్టుపట్టి కూర్చోకూడదు. ధర్మమేదైతే దాన్నే అనుసరించాలి అనే ఓ చక్కటి సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net