Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


నందకఖడ్గ జనన వృత్తాంతం
శ్రీ మహావిష్ణువు దగ్గరుండే ఆయుధాల్లో నందకం అనే ఖడ్గం ప్రసిద్ధమైనది. ఆ స్వామి ప్రతి యుగంలోనూ ధర్మోద్ధరణకోసం తాను ఉద్భవిస్తుంటాడు. ధర్మ ప్రచారం కోసం తన ఆయుధాలు, అలంకారాల అంశలతో భూలోకంలో కొంతమందిని సృష్టిస్తుంటాడు. వారు సంకీర్తనల ద్వారా, సద్బోధల ద్వారా ధర్మ ప్రచారం చేస్తూ మానవాళికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంటారు. ఇలా శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే నందకం అనే ఖడ్గం అంశ కూడా భూలోకంలో చాలాసార్లు అవతరించింది. పన్నిద్దరాళ్వార్‌ల లోని పేయాళ్వార్‌, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు లాంటి వారు ఈ నందకాంశతో జన్మించిన వారే. ఆ మహనీయులు మానవాళికి ఉపదేశించిన సన్మార్గం అందరికీ తెలిసిందే. అలాంటి నందక ఖడ్గం ఎప్పుడు అవతరించింది? దాని విశేషాలేమిటి?... అనే విషయాన్ని గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. ఇది విష్ణు ధర్మోత్తర మహాపురాణం ద్వితీయ ఖండం పదిహేడో అధ్యాయంలో ఉన్న విషయం. ఈ విషయాన్నంతటినీ పుష్కరుడు పరశురాముడికి వివరించి చెప్పాడు. ఈ వివరణలోనే భూలోకంలో ఖడ్గాలు రూపొందించటానికి కావాల్సిన లోహం, ఉద్భవించిన తీరు కూడా కనిపిస్తుంది.

ఓ సారి బ్రహ్మదేవుడు సర్వలోక సంక్షేమం కోసం ఓ పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. మేరు పర్వతం మీద స్వర్గ గంగా తీరంలో ఆ యజ్ఞాన్ని చతుర్ముఖుడు ప్రారంభించాడు. అలా ప్రారంభమైన కొన్నాళ్ళకు ఆ యజ్ఞానికి ఏదో ఒక రకమైన విఘ్నం చేసి బ్రహ్మ సంకల్పాన్ని నెరవేరకుండా చేయాలని ఓ రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడి పేరు లోహుడు. లోహాసురుడు ఆకాశంలో ఉండి బ్రహ్మ యజ్ఞానికి విఘ్నం కలిగించే ప్రయత్నంలో ఉన్నాడు. బ్రహ్మ లోహుడిని చూసి అతడిని అరికట్టాలని దృఢంగా సంకల్పించుకొన్నాడు. బ్రహ్మదేవుడలా సంకల్పం చేయగానే యజ్ఞకుండం నుంచి ఓ పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు నల్లకలువ రేకు ఛాయకలిగిన దేహంతో ఉన్నాడు. ఆయన కళ్ళు ఎంతో కాంతివంతంగా ఉన్నాయి. ఎత్తుగా ఉన్నాడు. చూడ చక్కనైన ముఖంతో, బలిష్టమైన శరీరంతో ఉన్న ఆ పురుషుడు యజ్ఞకుండం నుంచి బయటకు వచ్చి బ్రహ్మకు నమస్కరించి ఆజ్ఞ ఏమిటో చెప్పమన్నాడు. ఆ దివ్య పురుషుడిని చూసిన ఇంద్రాది దేవతలు, బ్రహ్మ అంతా ఆనందించారు. అందుకే ఆ దివ్య పురుషుడికి నందకం అనే పేరు స్థిరపడింది. బ్రహ్మదేవుడి ఎదుట ఆ పురుషుడు నమస్కరించి నిలుచున్న కొద్ది క్షణాల్లోనే అతడు చక్కని ఖడ్గ రూపాన్ని ధరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఆ ఖడ్గాన్ని తీసుకొని ధర్మ రక్షణకు ఉపక్రమించమన్నాడు. యజ్ఞానికి విఘ్నాల్ని కలిగిస్తున్న లోహాసురుడిని నందకంతో వధించమని శ్రీమహా విష్ణువును కోరాడు బ్రహ్మదేవుడు. తామర రేకుల వంటి కళ్లు, నల్లకలువ ఛాయ కలిగి, నిర్మలాకాశంలా ప్రకాశిస్తున్న నందక ఖడ్గాన్ని అందుకొన్నాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే బ్రహ్మ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న అసురుడిని అంతం చేయటానికి బయలుదేరాడు. నూరుచేతులు, పెద్ద కడుపుతో భీకరంగా ఉన్న లోహాసురుడు తన గదతో విష్ణువును ఎదుర్కొన్నాడు. శ్రీ మహావిష్ణువు చేతిలోని నందక ఖడ్గం ముందు వాడి బలం ఏమాత్రమూ పనికి రాలేదు. నందక స్పర్శతో ఆ రాక్షసుడి శరీరం తునాతునకలైంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లోహాసురుడి శరీరపు తునకలు యుద్ధాల్లో వినియోగించే ఖడ్గాలు తయారు చేసేందుకు పనికొచ్చే లోహంగా మారుతుందని దేవతలతో చెప్పాడు. అనంతరం బ్రహ్మ లోకక్షేమం కోసం తలపెట్టిన యాగాన్ని పూర్తిచేశాడు. ఆ సందర్భంగా నందకం అనే ఖడ్గం ఎప్పటికీ శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉంటుందని ధర్మ రక్షణ కోసం దాన్ని విష్ణువు ఉపయోగిస్తుంటాడని బ్రహ్మదేవుడు చెప్పాడు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net