Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


తోబుట్టువు మీది మమకారం...
క్తుల్ని అనుగ్రహించటం, వారి కోరికలు స్వయంగా తీర్చటం కోసం శ్రీ మహావిష్ణువు నిరంతరం కార్యదీక్షతో ఉంటాడని వివరించే ఈ కథ దేవీ భాగవతం ఆరో స్కంధంలో ఉంది. ఇదే కథలో శివుడికి, విష్ణువుకు భేదం లేదని ఇద్దరూ సమానులేనని స్వయంగా విష్ణువు, శివుడు తెలిపినట్లు కనిపిస్తుంది.

పూర్వం యయాతి వంశంలో తుర్వసుడు అనేరాజు ఉండేవాడు. అతడినే అందరూ హరివర్మ అని పిలుస్తుండేవారు. తుర్వసుడికి ఎంత కాలానికీ సంతానం కలుగలేదు. హరిభక్తి పరాయణుడైన ఆ రాజు శ్రీ మహావిష్ణువు గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. విష్ణువు ఎలాగైనా తన భక్తుడిని అనుగ్రహించాలని అనుకొన్నాడు. ఇంతలో వైకుంఠంలో ఓ విచిత్రం జరిగింది. సూర్యభగవానుడి కుమారుడు రేవంతుడు అనేవాడు ఉండేవాడు. రేవంతుడు మహా అందగాడు. దానికితోడు ఒక రోజు అతడు క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన ఉచ్పైఃశ్రవం అనే గుర్రాన్ని ఎక్కి ఆకాశమార్గాన విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పక్కనే నిలుచుని ఉంది. కనుచూపు మేరలో రేవంతుడు ఎక్కివస్తున్న గుర్రం ఆమె కంటపడింది. క్షీరసాగర మథనంలో తనతో పాటు పుట్టిన తన తోబుట్టువైన ఆ గుర్రాన్ని చూసేసరికి లక్ష్మీదేవి మనసు ఉక్కిరిబిక్కిరై నిశ్చేష్టురాలై నిలుచుండిపోయింది. ఆమె అలా ఏకాగ్రతతో చూస్తుండటం విష్ణుమూర్తికి విచిత్రం అనిపించింది. ఆమెను ఒకటికి రెండు సార్లు పిలిచాడు. ఉలుకూ పలుకూ లేకుండా గుర్రం వంకే చూస్తుండటానికి కారణమేమిటని అడిగాడు. లక్ష్మి జవాబు చెప్పకపోవడంతో విష్ణువుకు కోపం వచ్చి నీవు బడబ (గుర్రం)గా మారి భూలోకంలో ఉద్భవించు అని శాపం ఇచ్చాడు. లక్ష్మీదేవికి అప్పటికి తెలివి వచ్చి తాను తోబుట్టువును ఇంతకాలానికి చూస్తున్నందుకు ఆనందం వేసి అలా చేష్టలుడిగినట్లు అయిపోయానని చెప్పింది. శ్రీ మహావిష్ణువు తనకు ఇచ్చిన శాపం ఎప్పుడు తీరిపోతుందో చెప్పాలని అడిగింది. అప్పుడు విష్ణువు భూలోకంలో ఆడ గుర్రం రూపంలో ఉన్న నీకు ఒక పుత్రుడు కలుగుతాడని, తర్వాత శాపం తీరిపోయి అప్పుడు వైకుంఠానికి వస్తావని అన్నాడు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇలా సంభాషించుకోవటం చూసి ఉచ్పైఃశ్రవం మీదు ఉన్న రేవంతుడు భయపడి వారికి నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్నంతా తండ్రి సూర్యభగవానుడికి చెప్పాడు. విష్ణుమూర్తి శాపాన్ని అనుసరించి లక్ష్మీదేవి భూలోకంలో కాళిందీ, తమసానది సంగమ ప్రదేశంలో పరమేశ్వరుడి గురించి తీవ్రంగా తపస్సు చేయటం విచిత్రం అనిపించి విషయమేమిటో కనుక్కోవటానికి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. జగద్రక్షకుడైన విష్ణువు భార్య అయి ఉండి అలా తన గురించి తపస్సు చేయటానికి కారణమేమిటని అడిగాడు. అప్పుడామె జరిగిన విషయాన్నంతా వివరించింది. వైకుంఠంలో ఓ నాడు శ్రీ మహావిష్ణువు ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ కనిపించాడని, అప్పుడు తాను ఎవరి గురించి ధ్యానిస్తున్నాడో తెలుసుకోవాలని కుతూహలపడి ఆయననే అడిగినట్లు, అప్పుడు తాను శివుడి గురించి ధ్యానిస్తున్నట్లు తనకు చెప్పాడని, ఆ కారణం చేతనే తానుకూడా శివుడి గురించే తపస్సు చేసినట్లు లక్ష్మీదేవి బదులిచ్చింది. ఆ మాటలకు పరమేశ్వరుడెంతో ఆనందించి, త్వరలో లక్ష్మీదేవి శాపం తీరిపోయేలాగా అనుగ్రహిస్తానని చెప్పి అంతర్ధానమైపోయాడు. పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళగా చిత్రరూపుడు అనే ఒక ప్రమధుడుని పిలిచి, వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించి లక్ష్మీదేవి విరహాన్ని పోగొట్టమని తనమాటగా చెప్పాలని ఆదేశించాడు. చిత్రరూపుడు ఈశ్వరాజ్ఞను శిరసావహించి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకు నమస్కరించి వినయంతో అంతా వివరించాడు. విష్ణువు కూడా శివుడి సూచన మేరకు వెంటనే ఒకమగ గుర్రంలా మారి లక్ష్మీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశం దగ్గరకు వెళ్ళాడు. ధ్యానంలో ఉండి అప్పుడే కళ్ళు తెరిచిన లక్ష్మీదేవి తన ఎదురుగా ఉన్న మగ గుర్రం తన భర్త నారాయణుడేనని గ్రహించింది. దీర్ఘకాల విరహం ఆమెను బాధించసాగింది. విష్ణువు కనిపించగానే ఆయన మీద ఎంతో ప్రేమ కలిగింది. విష్ణువు కూడా అదే స్థితికి లోనయ్యాడు. గుర్రాల రూపంలో ఉన్న ఆ ఇద్దరి సంగమంతో అప్పుడొక పుత్రుడు ఉద్భవించాడు. దాంతో లక్ష్మీదేవికి శాపం విమోచనం కలిగింది. ఆ పుత్రుడు అలా జన్మించటం తన సంకల్పమేనని, తన భక్తుడైన తుర్వసుడికి ఆ బిడ్డ దక్కాలని నారాయణుడు లక్ష్మికి నచ్చజెప్పి, ఆమెను తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాళిందీ, తమస సంగమ ప్రదేశంలో ఆ బాలుడు అలా కేరింతలు కొడుతూ ఉండటాన్ని కొద్ది సమయం తరువాత ఆకాశంలో విమాన విహారం చేస్తున్న విద్యాధర దంపతులైన చంపాఖ్యుడు, మదనాలసల కంట పడింది. వెంటనే వారు భూమి మీదకు దిగి ఆ బాలుడిని ప్రేమతో లాలించి విమానంలో తమ లోకానికి తీసుకెళ్ళారు. ఆ బాలుడెవరో, ఆక్కడెందుకున్నాడో వారికి తెలుసుకోవాలనిపించింది. వెంటనే దేవేంద్రుడి వద్దకు వెళ్ళి బాలుడిని చూపించి, విషయమంతా చెప్పారు. అప్పుడు దేవేంద్రుడు ఆ బాలుడు లక్ష్మీనారాయణులకు జన్మించిన వాడని, ఒక కారణాన్ని అనుసరించి ఆ బాలుడి జననం జరిగిందని చెప్పాడు. ఆ బాలుడిని తీసుకెళ్ళి దొరికిన చోటనే వదలి రమ్మనమని సూచించాడు. వారు అలానే చేశారు. తుర్వసుడు తనకు సంతానం కలగాలని తీవ్రంగా తపస్సు చేస్తుండటానికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై కాళిందీ, తమసా సంగమ ప్రదేశానికి వెళ్లాలని, అక్కడ తనకు, లక్ష్మీదేవికి జన్మించిన శిశువును ఉంచానని, ఆ బిడ్డను పెంచుకోవాలని చెప్పి అంతర్ధానమయ్యాడు. హరివర్మ (తుర్వసుడు) ఆ బిడ్డని తెచ్చుకొని ఏకవీరుడు అని పేరుపెట్టి పెంచుకోసాగాడు. అనంతర కాలంలో ఏకవీరుడు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలన చేసి మంచి రాజుగా కీర్తి గడించాడు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net