Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


ప్రజాపాలన ఇలా ఉండాలి...
పూర్వ కాలంలో రాజులు ప్రజలను ఎంతో ప్రేమ పూర్వకంగా పాలిస్తూ ఉండేవారు. నాటి ప్రభువులకు ప్రజలపై కన్నబిడ్డల కంటే ఎక్కవ ప్రేమ ఉండేది. వారి కష్టాన్ని పోగొట్టడానికే ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. ఆ కష్టం ఎవరివల్ల వచ్చింది? అది తొలగి పోవాలంటే ఏం చేయాలి? అనే విషయాన్ని సంపూర్ణంగా ఆలోచించి పథకం ప్రకారం ప్రజలకు మేలు చేసి పెడుతుండేవారు. అలాంటి వారిలో పృథు చక్రవర్తి ఒకడు. ఆయన రాజ్యపాలనకు వచ్చిన రోజుల్లో భూమి సరిగా పండేది కాదు. కరవుకాటకాలు ముంచుకొచ్చి ప్రజలు మితిమీరిన ఆకలి బాధకు లోనయ్యారు. ఎంతోకాలం ఓపిక పట్టినా భూమి సరిగా పండటం కానీ, కరవు పోయి అంతా హాయిగా ఉండటం కానీ జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రజలిక తప్పదనుకొని పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి తమ బాధ వెళ్ళబోసుకొన్నారు. చక్రవర్తి అంతా జాగ్రత్తగా విని తప్పు ఎక్కడ ఉంది? అని క్షణకాలం పాటు ఆలోచించాడు. మిగతా పరిస్థితులన్నీ బాగానే ఉన్నా భూమి మాత్రం పండటం లేదు. కనుక ప్రజలు అనుభవిస్తున్న బాధలకు భూమిదే బాధ్యత అని, దాన్ని శిక్షించి ప్రజలకు మేలు చేయాలని సంకల్పించాడు చక్రవర్తి. వెంటనే తన ధనుస్సుకు బాణాన్ని సంధించి భూమిని శిక్షించేందుకు ముందుకు ఉరికాడు. ఈ విషయాన్ని గ్రహించిన భూమి ఒక ఆవులా రూపాన్ని మార్చుకొని పరుగెత్తసాగింది. అయినా విడిచిపెట్టలేదు చక్రవర్తి. చివరకు ఓ చోట ఆగి పృథువుకు నమస్కరిస్తూ తాను ఏ తప్పూ చేయని స్త్రీనని, ప్రస్తుతం గోరూపాన్ని ధరించి, భయపడుతూ పారిపోతున్నానని, తనను వధించటం వీరధర్మం కాదని మొరపెట్టుకుంది భూమి. అప్పుడా చక్రవర్తి భూమితో ఇలా అన్నాడు... అధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను ఇబ్బందిపెట్టే ఎవరినైనాసరే రాజు శిక్షించవచ్చని అందుకే తాను భూమిని శిక్షించాలని అనుకొంటున్నట్లు చెప్పాడు. భూమి తానేమీ అధర్మం చేయలేదని అంది. ‘నీవు అధర్మం చేశావు. చాలా కాలంపాటు దేవతలందరితోనూ కలసి అనేక యజ్ఞాల్లో హవిర్భాగాలను అందుకొన్నావు. అలా హవిర్భాగాల్ని అందుకొన్న ఇతర దేవతలంతా వారి వారికి తగినట్లుగా ప్రజలకు ఏదో ఒక మేలు చేస్తున్నారు. నీవు మాత్రం ఏమీ చేయలేదు. ధాన్యం లాంటి వాటన్నింటినీ వృద్ధిచేసి ప్రజలకు అందించాలి నీవు. కానీ ఆ ధాన్యాన్నంతటినీ నీలోనే దాచుకొంటున్నావు. ఇప్పుడు కూడా గో రూపాన్ని ధరించి తృణ భక్షణం చేస్తూ ప్రతిఫలంగా పాలను ఇవ్వటం లేదు. గతంలో బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధీ బీజాలను నీ దేహంలోనే ఉంచుకుంటున్నావు తప్ప బయటపెట్టడం లేదు. ఇదంతా నీవల్ల జరుగుతున్న తప్పు. దీంతో ప్రజలంతా ఆకలితో మలమల మాడుతున్నారు. అందుకే నీవు శిక్షార్హురాలివి’ అని పృథు చక్రవర్తి భూమాతతో అన్నాడు. అప్పుడా భూమాత కొందరు అధర్మాత్ములు విలువైన ఓషధులను, ఆహార ధాన్యాలను అన్యాయంగా గ్రహిస్తున్నారని, వారికి ఆ అర్హత లేదని కనుక ఆ ధాన్యాల్ని కాపాడటానికే తానలా చేస్తున్నానని చెప్పింది. అలా భూమి మీద ఉన్న విలువైనవన్నీ అనర్హుల చేతికి వెళ్ళటానికి కొందరు అసమర్థ పాలకులు కారకులని అందుకే తాను ఆహారాన్నంతటినీ దాచేశానని చెప్పింది. ప్రస్తుతం పృథువు ద్వారా అవన్నీ ప్రజలకు సక్రమంగా అందుతాయన్న నమ్మకం తనకుందని అంది గోరూపంలో ఉన్న భూమాత. తనకు తగిన దూడను చూపి మంచి పాత్ర తెచ్చి పితికితే మళ్ళీ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఓషధులను క్షీర రూపంలో తానిస్తానంది. వెంటనే పృథు చక్రవర్తి మనువును దూడగా చేసి తన ఒక చెయ్యిని పాత్రగా చేసి తానే స్వయంగా పితికాడు. అలా మళ్ళీ ఓషధులు పెల్లుబికి వచ్చి ప్రజలకు కరవు తీరి సుఖభోగాలు ప్రాప్తించాయి. ఈ కథ భాగవతం నాలుగో స్కంధంలోనిది. ఒక ప్రజాపాలకుడు ప్రజల కోసం ఎలా కృషి చేయాలనే సూచనతో పాటు భూమ్మీద అధర్మం పెరిగితే కరవులాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయని కనుక అధర్మం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందన్న ఓ సందేశమూ ఇక్కడ కనిపిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net