Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


పాలు నీళ్ళ లాగా...
భార్యాభర్తలు పాలు, నీళ్ళలాగా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. వారి మనసులలో అపనమ్మకం అనేది ఏనాడూ చోటు చేసుకోకూడదు. పాలతో నీళ్ళు కలిసి ఉన్నప్పుడు పాలకున్న విలువే నీళ్ళకు కూడా ఉండి పాలు, నీళ్ళు రెండిటికీ సమాన గౌరవం, విలువ ఉంటాయి. కానీ పొరపాటున ఎప్పుడైనా అపనమ్మకం అన్న కొద్దిపాటి ఉప్పు పాలల్లో పడిందా ఇంతే సంగతులు. పాలు విరిగిపోతాయి. పాలు, నీళ్ళు విడిపోతాయి. అప్పటిదాకా పాలకున్న రుచి పూర్తిగా మారిపోతుంది. భార్యాభర్తల నడుమ పాలలాంటి ప్రేమ కూడా ఎప్పుడైనా కపటత్వమన్నది సోకితే విరిగిపోవటం ఖాయం. ప్రేమ రుచే మారిపోతుంది. ఇవి మానవ జీవితానికి సంబంధించిన నిత్య నూతన సత్యాలు. వీటిని మనసులో భావించుకొని నిర్ధరించి చెప్పింది ఎవరో కాదూ సాక్షాత్తూ శివుడి ఇల్లాలు సతీదేవే. ఆమె తన స్వానుభవాన్ని మననం చేసుకొంటూ ఇదంతా ఆలోచించింది. శ్రీరామచరిత మానసం బాలకాండలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. దక్షయజ్ఞంలో సతీదేవి తన దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకోవటానికి కారణం ఓసారి శివుడు చెప్పిన మాటలను ఆమె నమ్మక పోవటమేనని, కపటంగా ఆమె ప్రవర్తించటమేనని ఆ విషయాలన్నిటినీ తులసీదాసు ఇలా వివరించాడు. శ్రీహరి శ్రీరాముడిగా అవతరించి సీతాలక్ష్మణులను వెంటపెట్టుకొని పితృవాక్యపాలన కోసం వనాలలో సంచరిస్తున్నాడు. ఇంతలో సీతాపహరణం జరిగింది. భోరున విలపించసాగాడు శ్రీరాముడు. ఆ రామలక్ష్మణులను చూసి వన సంచారానికొచ్చిన సతీదేవి ఆ విలపిస్తున్నది ఎవరు? అని పక్కనే ఉన్న శివుడిని అడిగింది. శివుడు శ్రీహరే అలా రాముడుగా అవతరించి పాత్రోచితంగా ప్రవర్తిస్తూ విలపిస్తున్నాడని చెప్పాడు శివుడు. సతీదేవికి తన భర్త మాట మీద నమ్మకం ఎందుకో కుదరలేదు. ఆమె తాను రాముడిని పరీక్షించాలనుకొంటున్నట్లు శివుడికి చెప్పి వెళ్ళింది. తన మాట మీద నమ్మకం లేకపోవటం రాముడి అవతారంలో ఉన్న శ్రీహరినే ఆమె పరీక్షించాలను కోవటం శివుడికి అంతగా నచ్చలేదు. ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. సతీదేవి సీతలాగా రూపం మార్చుకొని రాముడి ముందు నిలుచుంది. రాముడు ఆమెకు నమస్కరించి పరమేశ్వరుడెక్కడ? అని పలుకరించి వెళ్ళిపోయాడు. సతీదేవి తన భర్త చెప్పింది నిజమేనని అప్పటికి తెలుసుకొని తిరిగి ఆయన దగ్గరకొచ్చింది. శివుడు సాక్షాత్తూ సీతాదేవిగా ఇంతకు ముందు రూపం ధరించిన సతీదేవితో తాను భర్తగా వ్యవహరించేది ఎలాగా? అది ధర్మం కాదు, ఈమెకు మెల్లమెల్లగా దూరంగా ఉండాలి అని మనసులో నిర్ణయించుకొన్నాడు. దానికి తగ్గట్టుగా విష్ణుమాయా ప్రభావంతో సతీదేవి శ్రీరాముడి ముందు జరిగిన విషయాలన్నీ కూడా కపటంగానే చెప్పింది. తాను కేవలం శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి వచ్చానని, అంతకంటే ఏమీ జరగలేదని సతీదేవి శివుడితో అన్నది. ఆమె అలా కపటంగా మాట్లాడటం శివుడికి నచ్చక అప్పటికీ మౌనంగా ఉండి కైలాసానికి బయలుదేరాడు. సతీహృదయం నానాటికీ విచారంతో బరువెక్కసాగింది. తన భర్త మాటలను అసత్యాలుగా భావించటం, సీతలాగా రూపం ధరించి రాముడిని అవమానించటం అనేవి తాను చెయ్యతగ్గ పనులుగా ఆమెకు కనిపించలేదు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. అందుకు విధాత తగిన శిక్షే విధించాడని, ఆ విచారం అంతా ఆ శిక్షలో భాగమేనని ఆమెకు అనిపించింది. కొంత కాలంపాటు సతీశివులు కైలాసంలో అలానే కాలం గడిపారు. శివుడు తపోదీక్షలో ఉండిపోయాడు. సతీదేవి విచారంతో కాలం గడుపుతోంది. అలా ఎనభైఏడు వేల సంవత్సరాల కాలం గడిచింది. శివుడు ధ్యానాన్ని చాలించాడు. సతీదేవి ధ్యానాన్ని విరమించిన శివుడికి మొక్కింది. శివుడు ఆమెకు అనేక విషయాలను వివరించి చెప్పాడు. ఇంతలో సతీదేవి తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి ఆకాశమార్గాన దేవతలంతా తరలివెళ్ళటాన్ని సతీదేవి చూసింది. తానూ వెళ్తానని శివుడితో అంది. ఆహ్వానించకుండా వెళితే ఆత్మగౌరవం, ఆదరాభిమానాలు దెబ్బతింటాయని శివుడు ఎంతగా చెప్పినా సతీదేవి వినలేదు. ఆమె పుట్టింటికి వెళ్ళటం, అవమానాలను ఎదుర్కోవటం, ఆ తర్వాత యోగాగ్నిలో ఆమె దేహత్యాగం చేయటం ఇవన్నీ జరిగిపోయాయి. తులసీదాసు వివరణననుసరించి సతీదేవి దేహత్యాగం జరగటానికి కారణం గతంలో ఆమె రాముడి విషయంలో తన భర్త శివుడు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచకపోవటమే. ఆ తర్వాత తన భర్త చెప్పిన మాటలు సత్యాలే అని గ్రహించి అప్పటి నుంచి సతీదేవి దేహాన్ని త్యాగం చేయాలన్న ఆలోచనలో ఉండిపోయింది. భార్యాభర్తల నడుమ ఉండే పాలలాంటి ప్రేమలో అపనమ్మకమనే ఉప్పు పడ్డప్పుడు ఆ తర్వాత ఆ ప్రేమ రుచి తగ్గిపోతుందని, ఆ దంపతుల జీవితంలో కష్టాలు ఎదురవుతుంటాయని సతీదేవి మాటల్లో సమాజానికి సందేశం ఇప్పించాడు రామచరితమానస కర్త తులసీదాసు.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net