Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వకామ ప్రదాత... ధాత్రి
నిషికి ఉన్న తల్లుల్లో భూమి కూడా ఓ తల్లే. అందుకే భూమిని భూమాత అని అంటారు. భూమాత వల్ల ఒక్క మనుషులే కాదు దేవతలు, రుషులు లాంటి వారు కూడా ఎంతెంతో మేలు పొందుతుంటారు. అంతమందినీ ఆ తల్లి తనకు చేతనైనంతలో ఆదరిస్తూనే ఉంటుంది. కోరుకున్నవారి కోరికలన్నిటినీ ఆ ధరణి తీరుస్తూనే ఉంటుంది. భూమిని నమ్మినవారు చెడిపోరు అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు భూమాత రుజువు చేస్తూనే ఉంటుంది. అలాంటి భూమాత ఎవరెవరికి ఎలాంటి మేలు చేస్తుంది అని తెలిపే కథా సందర్భం భాగవతం నాలుగో స్కంధంలో ఉంది.

పూర్వం ఓసారి యజ్ఞయాగాల్లో హవిర్భాగాలను అందుకొన్నప్పటికీ భూమాత దుర్మార్గులకు భయపడి ఎవరికీ ఏమీ ఇవ్వకుండా స్తబ్దంగా ఉండిపోయింది. అప్పుడు పృథు చక్రవర్తి భూమిని వెంబడించి ఆమెకు వాస్తవాన్నంతటినీ వివరించి చెప్పి భూమిని గోవుగా, మనువును దూడగా చేసి మనుషులకు కావలసిన ఓషధులన్నిటినీ పితికాడు. అలా మానవాళికి కావలసిన ఆహారం లాంటివన్నీ చక్కగా సమకూరాయి. మానవులు తృప్తి చెందిన తర్వాత రుషులు భూమాత నుంచి తమకు కావలసినవి పొందాలను కొన్నారు. వెంటనే వారు బృహస్పతిని దూడగా చేసి గోమాత రూపంలో ఉన్న భూమాత ముందుంచి ఇంద్రియాలు అనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిండుకొన్నారు. రుషులకు అలా వేదాలు గోక్షీర రూపంలో లభించాయి. ఆ తర్వాత ఇంద్రుడిని దూడగా చేశారు దేవతలు. ఆ దూడను ఆవు ముందుంచి ఓ బంగారు పాత్రలో అమృతమయమైన క్షీరాన్ని పిండుకొన్నారు. అనంతరం దైత్యులు, దానవులు ప్రహ్లాదుడిని దూడగా చేసి ఓ ఇనుప పాత్రను తెచ్చుకొని సురతో సమానమైన క్షీరాన్ని పిండుకొన్నారు. అప్సరసలు, గంధర్వులు కలిసి విశ్వావసువును దూడగా చేసి గోమాత రూపంలో ఉన్న భూమాత ముందు నిలిపి పద్మమయమైన పాత్రలో మాధుర్యం, సౌందర్యాలతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని పిండుకొన్నారు. పితృదేవతలు సూర్యుడిని దూడగా చేసి ‘ఆమ’ పాత్రలో కవ్యం అనే క్షీరాన్ని పితుక్కొన్నారు. సిద్ధులంతా కలిసి కపిలుడిని దూడగా, ఆకాశాన్ని పాత్రగా చేసి సంకల్పనా రూపమైన అణిమాదిసిద్ధి అనే క్షీరాన్ని పొందారు. విద్యాధరులు లాంటి వారు కూడా కపిలుడినే దూడగానూ, ఆకాశాన్నే పాత్రగానూ చేసి ఖేచరత్వాది (ఆకాశ గమనం లాంటి) విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుడిని దూడగా చేసి ఆత్మ పాత్రలో సంకల్ప మాత్రప్రభావం, అంతర్థాన రూపం, అద్భుతాత్మకమూ అయిన మాయ అనే క్షీరాన్ని పిండుకొన్నారు. ఆ తర్వాత యక్ష రక్షోభూత పిశాచాలు రుద్రుడిని దూడగానూ, కపాలాన్ని పాత్రగాను చేసుకొని రుధిర స్వరూపమైన క్షీరాన్ని పొందారు. అహి, దంతశూక, సర్ప, నాగాలు తక్షకుడిని దూడగా చేసి బిలం అనే ప్రాతలో విషరూపంలో ఉన్న క్షీరాన్ని పిండుకొన్నారు. పశువులన్నీ కలిసి ఆబోతును దూడగానూ, అరణ్యాన్ని పాత్రగానూ చేసి తృణం (గడ్డి) అనే క్షీరాన్ని పిండుకొన్నారు. క్రూరమృగాలు అన్నీ కలిసి సింహాన్ని దూడగా చేసి స్వకళేబర పాత్రలో మాంసం అనే క్షీరాన్ని పిండుకొన్నారు. పక్షులు గరుత్మంతుడిని దూడగానూ స్వదేహాన్ని పాత్రగాను చేసి కీటకాలు, ఫలాలు తదితరాలను క్షీరంగా పొందాయి. వనస్పతులు వటవృక్షాన్ని దూడగా మలచి పర్వత సాణువులను పాత్రగా చేసి తమకు కావలసిన శక్తి సారాన్ని క్షీరంగా పొందాయి. పర్వతాలు హిమవంతుడిని దూడగా చేసి సాణువులనే పాత్రలో నానా ధాతువులను క్షీరంగా పిండుకొన్నాయి.

ఆనాడు గోరూపిణిగా ఉన్న భూమాత నుంచి ఇలా సమస్త చరాచరజగత్తు తమకు కావలసిన వాటిని గోక్షీరంగా పొందాయి. వారికి సంబంధించిన శ్రేష్ఠులను దూడలుగానూ, తగినవాటిని పాత్రలుగానూ ఎంచుకొని అంతా అలా క్షీర రూపంలో తమకు బలాన్నీ, శక్తిని ఇవ్వగలిగిన వాటిని పొందారు. ఇలా ఈ కథా సందర్భంలో ఉన్న విషయాలను పరిశీలిస్తే ధాత్రి సర్వకామప్రదాత్రి. అది ఒక్క మనుషులకే కాదు సకల చరాచర జగత్తుకు ఎవరు ఏమి కోరుకొంటే అదంతా ఇచ్చేస్తుంటుంది. అందుకే అందరికీ భూమి మాత అని పేరుపొందింది. భూమి విశిష్టత, భూమి వల్ల సమకూరే ప్రయోజనాలు కథా రూపంలో ఇక్కడ వివరించి ఉండటం గమనార్హం.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net