Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


మనుషుల్లో దేవుడు
ర్మ రక్షణ కోసం శ్రీకృష్ణ భగవానుడు అవసరమైనప్పుడల్లా ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటానని చెప్పాడు. కృష్ణుడి జీవితంలోని ఏ విషయాన్ని చూసినా ఆయన మనుషుల్లో దేవుడిగా ఉండి ఎలా అందరినీ కాపాడింది అవగతమవుతూ ఉంటుంది. పసితనంలోనే అలాంటి మహాత్మ్యాలను ఆయన ఎన్నిటినో చూపగలిగాడు. ఇంద్రాది దేవతలు సహితం ఆ బాలకృష్ణుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని అంత త్వరగా కనుక్కోలేకపోయేవారు. అలాంటి భక్తి ప్రపూరిత ఘట్టాలలో భాగవతంలోని గోవర్ధనోద్ధరణం అనే ఘట్టం కూడా ఒకటి. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, కారణజన్ముడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడిని భగవంతుడిగా ఇంద్రుడు కూడా ఒక సందర్భంలో గుర్తించలేకపోయాడు. మానవ లోకకల్యాణానికి అలా మామూలు మనిషిలాగా ఆయన జన్మించటం విశేషం. ‘ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని ఆయన చెప్పుకొన్నాడు. గోపకులంలో జన్మించిన శ్రీకృష్ణుణ్ణి గోపాలకులు దేవుడిగా గుర్తించలేకపోయారు. కనుక తానే అసలైన దైవమని, తనను మించినవారు వేరొకరు లేరని గోకులమంతా తెలుసుకొనేందుకు తన ఏడో ఏటనే మహిమ చూపించాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలు మీద ఏడు రోజులపాటు నిలబెట్టి గోపాలకులనూ, గోవులనూ రక్షించి తన మహత్తును ప్రదర్శించాడు. గోవర్ధనోద్ధరణం కథ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. మేఘాలకు అధిపతి ఇంద్రుడు. కనుకనే ప్రజలు ప్రాచీన కాలం నుంచి వర్షాలు కురవటానికి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. ఇంద్రుడితోపాటు వరుణుడు, అగ్ని తదితర దేవతలను పూజించి వారి అనుగ్రహంతో ఎన్నో కోర్కెలు తీర్చుకొంటూ ఉండేవారు. కృష్ణుడు జన్మించిన తర్వాత కూడా యాదవులు వర్షం కోసం ఇంద్రుడికి పూజలు చేస్తుండేవారు. ఒక సంవత్సరం గోపాలకులంతా ఇంద్రుడిని తృప్తిపరచటం కోసం యాగాన్ని తలపెట్టినప్పుడు ఆ హడావిడినంతటినీ గమనించిన శ్రీకృష్ణుడు అదేమిటని వారందరినీ ప్రశ్నించాడు. వర్షాల కోసం ఇంద్రుడికి యాగం చేస్తున్నట్లు గోకులంలోని పెద్దలు చెప్పారు. అప్పుడు కృష్ణుడు ఆ మాటలు విని నవ్వి తనెవరో, తన మహత్తు ఏమిటో గోపాలకులకు తెలియజెప్పేందుకు ప్రజలందరిచేత యజ్ఞయాగాది క్రతువులను చేయించుకొంటూ గర్వించి ఉన్న ఇంద్రుడికి గర్వభంగం కలిగించేందుకు నిర్ణయించుకొన్నాడు. వెంటనే యదుకుల శ్రేష్ఠులందరినీ సమావేశపరిచి ఇంద్రుడికి యాగం చేయాల్సిన అవసరం లేదని, వర్షాలు కురవటం కర్మ వశం వల్ల జరుగుతుందని, ఆ కర్మ భగవంతుడి ఆధీనంలో ఉంటుందని వివరించి చెప్పాడు. ఇంద్రుడికి యాగం చేసే బదులు యాదవులందరికీ ఎంతో ఉపయోగకారిగా ఉన్న గోవర్ధనగిరి పర్వతానికి పూజలు జరిపించమని చెప్పాడు. బ్రాహ్మణులను పిలిపించి పర్వతం వద్ద హోమాలు చేసి, గోవులకు మంచి పచ్చికను ఆహారంగా పెట్టి ఎన్నెన్నో ఓషధులను ఇస్తున్న గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించి ఉత్సవాన్ని జరిపించమని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గోపాలకులకు బాగా నచ్చాయి. యాదవులంతా ఎంతో సంబరంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తీసుకుని రకరకాల భోజన పదార్థాలు, పూజాద్రవ్యాలు తీసుకుని మంగళ వాద్యఘోషల నడుమ పర్వతం వద్దకు చేరారు. బ్రాహ్మణులను పూజించి, దక్షిణలిచ్చి గోపూజ చేసిన తరువాత గోవర్ధన గిరిని పూజించారు. కుంకుమ బండ్లు కట్టుకొని గిరి ప్రదక్షిణం చేశారు. ఈ పూజా కార్యక్రమాలన్నీ జరుగుతుండగా ఇంద్రుడు ప్రతి సంవత్సరం తనకు యాగాలు చేసి గౌరవించినట్లుగా యాదవులు ఆ సంవత్సరం తనను గౌరవించనందుకు కోపోద్రిక్తుడయ్యాడు. శ్రీమహావిష్ణువు యదుకులంలో కృష్ణుడిగా జన్మించాడన్న విషయాన్ని మర్చిపోయి గోపాలకుల మీద పగ పెంచుకున్నాడు. ప్రళయకాలంలో మాత్రమే వర్షించి ప్రపంచాన్నంతటినీ అల్లకల్లోలం చేసే సంవర్తక మేఘాలు ఇంద్రుడి ఆధీనంలో ఉంటాయి. ప్రళయకాలంలో మాత్రమే వాటి బంధనాలను విడదీస్తారు. కానీ ఇంద్రుడు గోపాలకులను మట్టుపెట్టాలని భావించి ఆ సంవర్తక మేఘాలను విడిపించి గొల్లపల్లెలన్నింటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడి ఆజ్ఞను మేఘాలు శిరసావహించాయి. ప్రళయకాలంలో కురిసినట్లుగా ఎడతెగక వర్షాలు కురుస్తుండటంతో యాదవులంతా భీతి చెందారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరికీ అభయాన్నిచ్చి తన చేత్తో గోవర్ధన గిరిని పైకెత్తి అవలీలగా చిటికిన వేలు మీద దానిని నిలిపి గొడుగులా పట్టుకున్నాడు. ఆ పర్వతం కిందకు గోపాలకులందరినీ వచ్చి చేరమని చెప్పాడు. గోవులను తోలుకొని స్త్రీలు, పిల్లలతో సహా అంతా పర్వతం కిందకి చేరారు. ఏడు రోజుల పాటు కృష్ణుడు కదలకుండా కొండను పైకెత్తి పట్టుకొని అలాగే నిలుచున్నాడు. ఇంద్రుడికి కోపం పెరిగి రాళ్ళ వర్షం కూడా కురిపించాడు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు చేసేది లేక ఎంత చేసినా గోపాలకులంతా రక్షణ పొందుతున్నారంటే వారిని రక్షిస్తున్నది శ్రీమహావిష్ణువే అయిఉంటాడని ఇంద్రుడు తెలుసుకొన్నాడు. దీంతో ఇంద్రుడి గర్వం అణిగింది. వెంటనే వర్షాన్ని ఆపి వేశాడు. శ్రీకృష్ణుడు యాదవులందరినీ ఎవరి ఇళ్ళకు వారిని చేరమని, అందరినీ భద్రంగా పంపించి పర్వతాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు. కృష్ణుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి తనను క్షమించమని దేవేంద్రుడు వేడుకొన్నాడు. తనతో తెచ్చిన కామధేనువు పాలను ఇచ్చి, ఐరావతం తొండంతో పీల్చి పట్టుకొచ్చిన గంగాజలంతో కృష్ణుడిని అభిషేకించాడు. ఇలా శ్రీకృష్ణుడు తన మహాత్మ్యాన్ని గోవర్ధనోద్ధరణం సన్నివేశంలో ప్రదర్శించాడు.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net