Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


సంతానం కోసం అంజన తపస్సు
అంజనాకేసరుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లై చాలాకాలం గడిచినా ఆ దంపతులకు సంతానం కలుగలేదు. అప్పుడు అంజన చేసిన తపస్సును గురించి, ఆంజనేయుడి జననాన్ని గురించిన విశేషాల్ని పుష్పగిరి తిమ్మనార్యుడు రచించిన ‘సమీర కుమారవిజయం (సంపూర్ణ హనుమత్‌ చరిత్రం)’ ఇలా వివరిస్తోంది.

కుంజరుడు, వింధ్యావళి దంపతులు తమ పెంపుడు కుమార్తె అయిన అంజనను వానరరాజు కేసరికిచ్చి వైభవంగా వివాహం జరిపించారు. కేసరి దంపతులకు వివాహమై చాలా కాలమైనా సంతానం కలుగలేదు. అంజన అనేక వ్రతాలు, పూజలు చేసింది. ఫలితం కనిపించలేదు. సంతానం కలుగలేదని ఆమె కలత చెందుతున్న రోజుల్లో ఓ రోజున సాక్షాత్తూ ధర్మదేవత ఒక ఎరుకలసాని వేషంలో వచ్చింది. కేసరి అనుమతితో తపస్సు చేయాలని, అలా చేస్తే సంతానం ప్రాప్తిస్తుందని చెప్పి ఎరుకలసాని రూపంలో ఉన్న ధర్మదేవత అంతర్థానమైంది. అంజన ఆ విషయాన్ని కేసరికి చెప్పింది. తమకు సంతానం కలిగి తీరుతుందని భరద్వాజ మహర్షి గతంలో చెప్పిన విషయాన్ని అంజనకు కేసరి వివరించాడు.

పూర్వం ఓ రోజున భరద్వాజ మహర్షి ఆశ్రమం సమీపంలో తానున్నప్పుడు శంబసాధనుడి కుమారుడైన శంఖశబళుడు ఒక మదగజ రూపంలో వచ్చి ఆశ్రమ వాసులందరినీ భయపెడుతున్నాడు. అప్పుడు అతడిని తాను సంహరించి వారి భయాన్ని తీర్చానని కేసరి చెప్పాడు. అనంతరం తనను భరద్వాజుడు ఆశీర్వదిస్తూ త్వరగా వివాహం చేసుకోవాలని, అనంతరం సద్గుణనిధి, శౌర్యవంతుడైన కుమారుడు కలుగుతాడని ఆశీర్వదించాడని అంజనకు వివరించాడు. ఆ రుషి ఆశీస్సులకు తోడు సర్వచైతన్యసాక్షి అయిన వాయుదేవుడి అనుగ్రహం ఉంటే త్వరగా సంతానం కలుగుతుందని, కనుక ఆ దేవుడిని గురించి తపస్సు చేయమని అంజనకు సలహా ఇచ్చాడు కేసరి. అంజన అలా తన భర్త అనుమతితో కుంజకస్థల అనే పవిత్ర ప్రదేశంలో వాయుదేవుడిని గురించి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. చాలా కాలంపాటు సాగిన ఆ తపస్సుకు వాయుదేవుడు సంతోషించాడు. ఆమె సంతానాన్ని కోరి తపస్సు చేస్తోంది కనుక ఆ కోర్కెను ఫలింప చేయాలనుకొన్నాడు. వెంటనే చాలా కాలం నుంచి తాను మోస్తున్న శివతేజాన్ని ఒక మంచి పండులా చేసి ఆమె ముందుంచాడు. అంజన ఫలరూపంలో ఉన్న రుద్రతేజాన్ని ఆరగించింది. ఆ కారణంగా ఆమె గర్భాన్ని దాల్చింది. కొన్నాళ్ళకు తన శరీరంలో కలుగుతున్న మార్పుల్ని గమనించిన అంజన తపోదీక్షలో ఉన్న తాను గర్భాన్ని ధరించటమేమిటని చింతిస్తూ ఉంది. అదంతా దైవ సంకల్పమని, దానికి సంబంధించిన విషయాలను ఇలా చెప్పింది అశరీరవాణి...

పూర్వం శివపార్వతులు వనంలో మర్కట రూపంలో సంచరించినప్పుడు రుద్రతేజానికి పార్వతి తట్టుకోలేక పోయిందని, అప్పుడు ఆ తేజాన్ని భూమి, అగ్ని కొన్నాళ్ళపాటు భరించాయని, వారు కూడా తట్టుకోలేక ఆ తేజాన్ని వాయువులో నిక్షిప్తం చేశారని, ఆ వాయువు ఆ రుద్ర తేజాన్ని అంజనలోకి చేర్చాడని దానివల్ల ఆమెకు రుద్రుడి అంశతో శ్రీరామ పాదసేవానురక్తితో ఒక పుత్రుడు కలుగబోతున్నాడని చెప్పింది అశరీరవాణి. అంజన తన భర్త కేసరికి జరిగిన విషయమంతా తెలిపింది. కేసరి, అంజనలు రుద్రాంశతో వాయుదేవుడి కృపతో తమకు కలుగబోయే సంతానం కోసం ఎదురు చూడసాగారు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక శుభముహుర్తాన అంజన ఒక మగబిడ్డను ప్రసవించింది. పుడుతూనే ఆ బిడ్డ బాలబ్రహ్మచారిలా కనిపించాడు. పొడవైన వాలం, శంకరుడితో సమానమైన తేజం, చక్కని చూపులు, పగడపు మేనిఛాయ, యజ్ఞోపవీతం, దానికి బంగారు మౌంజీ, చెవులకు కాంతులీనే కుండలాలు, చక్కటి పట్టువస్త్రాల్ని ధరించి బాలబ్రహ్మచారిలా ఆ బిడ్డ ఉన్నాడు. అంజనాకేసరులు తమ పుత్రుడిని చూసి ఎంతో ఆనందించారు. ఆ తరువాత ఆ బాలుడికి ఆంజనేయుడు అని నామకరణం చేశారు. అలా ఆంజనేయస్వామి జనన వృత్తాంతాన్ని, దానికి సంబంధించిన అంజనా కేసరుల తపస్సుల్ని గురించి ‘సమీర కుమార విజయం’ వివరిస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net