Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


వృత్తి కాదు.. ధర్మవర్తనే ప్రధానం
హాభారత కథలో కొన్ని పాత్రలు చిత్రాతిచిత్రంగా కనిపిస్తాయి. వాటి పేర్లేమిటో తెలియదు కానీ ఆ పాత్రల ద్వారా మానవాళికి అందే సందేశం మాత్రం ఎంతో మహత్తరమైనది. అలాంటి పాత్రలో ఒకటి ధర్మవ్యాధుడు. ఈ ధర్మవ్యాధుడి అసలు పేరు తెలియదు. వృత్తి మాత్రం మాంసం అమ్ముకొని జీవించటం. అలాంటి జీవనం గడుపుతున్నా ధర్మతత్పరుడు కనుక ధర్మవ్యాధుడు అనే పేరు సార్థకమైంది. మాంసం అమ్ముతున్నాడు కదా అని అతడి నడవడిక క్రూరంగా ఉంటుందేమోనని అనుకుంటే అది పొరపాటే. ధర్మవ్యాధుడు జితేంద్రియుడు, సత్యవాది, మాతాపితృ తత్పరుడు. అన్నింటినీ మించి వినయశీలి. ఈయన పెద్దలను, వృద్ధులను, అతిథులను, పండితులను సేవిస్తుంటాడు. దానంతోనే కాకుండా మన్ననతోటీ తన దగ్గరకు వచ్చిన యాచకులను సంతృప్తి పరుస్తూ ఉండేవాడు. ఇతరులను నిందించటం కానీ, తననెవరైనా నిందిస్తే కుంగిపోవటం కానీ ఈ ధర్మవ్యాధుడికి చేతకాదు. ఇన్ని కారణాలు ఉన్నందువల్లనే ఈ ధర్మవ్యాధుడి జీవితంలో ఒక మహత్తరమైన సన్నివేశం సంభవించింది. కౌశికుడు అనే ఒక ముని ఓ రోజున చెట్టుకింద కూర్చొని ఉన్నప్పుడు పైన ఉన్న పక్షి ఒకటి అతడి నెత్తిమీద రెట్ట వేసింది. అందుకు కోపించి కౌశికుడు దానివంక తీక్షణంగా చూశాడు. ఆ కోపాగ్నికి పక్షి మాడి చచ్చి కింద పడింది. తనకు అంతటి గొప్ప తపశ్శక్తి ఉన్నదని అతడికో నమ్మకం ఏర్పడింది. తరువాత మధ్యాహ్నం వేళకు కౌశికుడు ఓ ఇంటికి భిక్షం కోసం వెళ్ళాడు. ఆ ఇల్లాలు కౌశికుడిని చూసి కూడా పతిసేవలో నిమగ్నమైంది. ఆమె తన భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చి అప్పుడు భిక్ష తీసుకొని కౌశికుడికి ఇవ్వటానికి వచ్చింది. అలా ఆలస్యం జరగటానికి తట్టుకోలేకపోయాడు కౌశికుడు. తనను అవమానించటానికి కారణమేమిటో చెప్పమన్నాడు. ఆమె తానేమీ అవమానించలేదని, ఒకవేళ తనవంక కోపంగా చూస్తే మాడి చచ్చిపోవటానికి తానేమీ అడవిలోని పక్షిని కాను అని, పతివ్రతకు పతిసేవ తరువాతనే మిగిలినవేమైనా అని, కనుకనే తాను ఆలస్యంగా రావాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాక ఇటువంటి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవటానికి ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చింది. కౌశికుడు ఆ పతివ్రత మాటల్ని ఆలకించి ఆమె చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ధర్మవ్యాధుడి దగ్గరకు వచ్చాడు. మిథిలానగరంలో అల్లంత దూరంగానే కౌశికుడిని ధర్మవ్యాధుడు చూసి పతివ్రత పంపినందువల్లే కౌశికుడు వస్తున్నట్లుగా తనకు తెలుసునని, కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్పాడు. అలా చెప్పటంతో ఆ ముని ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతిథి పూజలు చేసి సత్కరించాడు. అప్పుడు ఆ ముని ‘అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీవు జీవహింస చేసి బతుకుతున్నప్పుడు ఉత్తమ ధర్మవేత్తగా ఎలా పేరు తెచ్చుకుంటున్నావు?’ అని అడిగాడు. దానికి సమాధానంగా ధర్మవ్యాధుడు తన వృత్తి తనకు వంశపారంపర్యంగా వస్తోందని, కులవృత్తిని నమ్మి జీవించటమే పరమ ధర్మమని పెద్దలు చెబుతున్నారని వివరించాడు. అయినా తాను మాంసాన్ని విక్రయిస్తున్నానని, అంతేకానీ జంతువులను చంపి తెచ్చి అమ్మటం లేదని అన్నాడు. పైగా తాను మాంసాహారిని కాదని వివరించి చెప్పాడు. దీంతోపాటుగా హింస ఏదో, అహింస ఏదో విడమరచి ధర్మసూక్ష్మాల స్థితిని తెలియచెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికుడికి. ఆ తరువాత వృద్ధులైన తన తల్లిదండ్రులను పరిచయం చేసి జన్మనిచ్చిన వారిని పూజించటం వల్ల కలిగే ఉత్తమ ఫలితాన్ని తెలియచెప్పాడు. ఇలా ధర్మవ్యాధుడు పైకి ఏదో క్రూరవర్తనం కలవాడిగా కనిపించినా నిశితంగా పరిశీలించి చూస్తే పేరుకు తగ్గట్టుగా ఉన్న ఉత్తముడని తెలుస్తుంది. భారతంలో ఈ పాత్రవల్ల అన్నిటికంటే మించింది ధర్మాచరణమేనని, అందులోనూ స్వధర్మాన్ని అనుసరించినంత ఉత్తమమైన పని మరొకటి ఉండబోదని, తల్లిదండ్రులను గౌరవించి పూజించాల్సిన బాధ్యత పిల్లల మీద ఉందని తెలుస్తుంది. ఇలాంటి సర్వకాల ఆమోదయోగ్యమైన సందేశాలు ఈ పాత్ర ద్వారా అందుతుండటం వల్లనే ఈ పాత్రకు అంతటి గౌరవం వచ్చింది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net