Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


నారాయణ మహత్వం
గన్నాటక సూత్రధారి, జగదాధారుడు, జగన్నాయకుడు అయిన నారాయణుడి మహత్వాన్ని తెలిపే కథా సందర్భం ఇది. వరాహపురాణం పదిహేడో అధ్యాయంలో ఉన్న కథ ఇది. సకల చరాచర జగత్తుకు ఆధారభూతుడైన నారాయణుడే గొప్ప అని నిరూపితమైనట్లు ఈ కథాంశం వివరిస్తోంది. ఓ సారి బ్రహ్మాది దేవతలు, పితరులు, బ్రహ్మాండ మధ్యస్తులైన దేవతలంతా ఓ చోట చేరారు. వారిలో అగ్ని, అశ్వినీ దేవతలు, గౌరీ, గజాననుడు, నాగులు, కార్తికేయుడు, ఆదిత్యులు, దుర్గ, మాతృకలు, దిక్కులు, ధనపతి, విష్ణువు, యముడు, రుద్రుడు, శశి, పితరులు ఎవరికి వారే గర్వితులై తాము లేనిదే ఏ దేహమూ మనగలగలేదని తాము గొప్పంటే తాము గొప్పని వారు వాదులాడసాగారు. ముందుగా అగ్నిదేవుడు లేచి తనను అందరూ పూజించాలని, శరీరంలో తాను లేకపోతే అది నశిస్తుందని అన్నాడు. తన గొప్పేంటో నిరూపించటానికి శరీరం నుంచి బయటకు వచ్చాడు. అయినా శరీరం శిథిలం కాలేదు. ఇంతలో ప్రాణవాయువు స్వరూపులైన అశ్వినీదేవతలు లేచి తాము లేకపోతే శరీరం లేదని వారు బయటకు వచ్చారు. అయినా దేహం అలాగే ఉంది. ఇంతలో గౌరీదేవి అందరి కంటే తాను ప్రధానురాలిని కనుక తాను లేకపోతే ఇక శరీరమెక్కడ చూడండంటూ బయటకు వచ్చింది. కానీ ఏమీ జరగలేదు. ఆ వెంటనే ఆకాశ నాయకుడైన గణపతి పైవారిలా పలికి బయటపడ్డాడు. అయినా ఏమీ కాలేదు. శరీర ధాతువుల రూపంలో ఉన్న నాగులు తాము లేనిదే శరీర మేమిటన్నట్లు చూస్తూ బయటకు వచ్చినా అంతకంటే ముందు జరిగిన దానికి భిన్నంగా ఏమీ లేదు. అహంకార రూపుడైన స్కందుడు లేచి నేను లేకపోతే శరీరానికి పుట్టుకే లేదు అంటూ బయటకు వచ్చాడు. శరీరం చెక్కు చెదరలేదు. అది చూసిన తరువాత సూర్యుడు లేచి తాను లేనిదే ఏ శరీరమూ క్షణమైనా ఉండలేదన్నాడు. కానీ ఆయన బయటకు వచ్చినా అది శిథిలం కాలేదు. అనంతరం మాతృకలు అనే కామాదిగణం లేచి మేం లేకపోతే శరీరానికి ఉనికి లేదు సుమా అంటూ వెళ్ళిపోయాయి. అయినా శరీరంలో మార్పేమీ కనిపించలేదు. ఆ తర్వాత దుర్గ అనే మాయ కోపంతో లేచి తానే గొప్ప అంటూ శరీరం నుంచి బయటకు వచ్చింది. అదే పద్ధతిలో దిక్కులు లేచి మేము లేనిదే ఏ కార్యమూ ఉండదు చూడండంటూ క్షణంలో తొలిగాయి. అనంతరం వాయురూపంలో ధనపతి నేను తొలిగితే ఇక ఉండేదేమీ లేదు అంటూ బయటకు వచ్చాడు. ఆ తరువాత మనసు రూపంలో ఉన్న విష్ణువు అలాగే చేశాడు. అనంతరం ధర్ముడు లేచి దీనినంతటినీ పాలించేవాడిని నేను, నేను లేకపోతే శరీరానికి అర్థమే లేదన్నాడు. ఆ తరువాత భూతభావనుడు, అవ్యక్తస్వరూపుడు, మహత్‌తత్వం అనే మహాదేవుడు లేచి అంతకు ముందున్న దేవతల్లాగానే ప్రవర్తించారు. పితృదేవతలు, పంచ తన్మాత్రలు, ముందుకు వచ్చి మేం తొలగితే శరీరం తప్పక నశిస్తుందంటూ దేహాన్ని విడిచిపెట్టి అంతర్థానమయ్యారు. ఇలా అగ్ని, ప్రాణాపానాలు, ఆకాశం, సర్వధాతువులు, అహంకారం, భానుడు, కామాదులు, మాయ వీరంతా శరీరాన్ని విడిచినా అది చెక్కు చెదరకుండా అలానే ఉంది. దానికి కారణం సర్వజ్ఞుడైన తేజోవిరాజత ఏకైక దివ్యమూర్తి అయిన పరమ పురుషుడు నారాయణుడు పాలించటమే. ఆ విషయాన్ని దేవతలంతా చివరికి కానీ తెలుసుకోలేక పోయారు. సర్వజ్ఞుడు పాలిస్తున్న ఆ శరీరం మునుపటిలాగానే ఉండటాన్ని చూసి దేవతలంతా తమ గొప్పేమీలేదని అంతా ఆ నారాయణుడేనని గ్రహించారు. అప్పుడు ఎవరికి వారు మానవ దేహంలో మళ్ళీ తమ తమ స్థానాలను పొందగోరి ఆ నారాయణుడిని స్తుతించారు. అప్పుడాయన ప్రత్యక్షమై దేవతలందరినీ ప్రేమతో చూస్తూ వారందరినీ తాను ఆడే ఆట కోసం సృష్టించినట్లు చెప్పాడు. ఇక మీదట వారికి రెండేసి రూపాల్నిస్తున్నట్లు వరమిచ్చాడు. ఆ క్షేత్ర దేవతలంతా ప్రాణుల శరీరాలలో రూప రహితంగానూ, దేవలోకంలో రూప సహితంగానూ ఉంటారని అన్నాడు. సకల దేహాలకు మూలకారణం తానేనని చెప్పాడు. అప్పటికి కానీ సంపూర్తిగా తమ కంటే ఎవరు గొప్పో దేవతలకు బాగా అర్థమయింది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net