Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


విష్ణు సహస్రనామ విశేషాలు
విష్ణుసహస్ర నామ పారాయణం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉండటం కనిపిస్తుంది. కొందరు సంఘాలుగా ఏర్పడి గృహప్రవేశాది శుభకార్యాలప్పుడు విష్ణుసహస్ర నామాలను పారాయణ చేస్తూ ఉండటం కూడా అన్నిచోట్లా ఈనాడు కనిపిస్తున్న విషయమే. అసలీ విష్ణుసహస్ర నామాలు ఎప్పుడు అవతరించాయి, వీటిని ఎలా జపించాలో తొలిగా ఎవరు ఎవరికి చెప్పారు, ఆ తరువాత మళ్ళీ మానవాళి సంక్షేమం కోసం ఎవరు వీటిని ఇంకెవరికి వివరించారనే విషయాలను తెలియజెబుతోంది ఈ కథా సందర్భం.

మనిషి ఏ నామస్మరణ చేస్తే మనసుకు ఏకాగ్రత కుదురుతుందో, మోక్షపదం కరతలామలకం అవుతుందో విస్పష్టంగా వివరించి చెప్పమన్నాడు ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న గాంగేయుడిని. ఆ మాటలకు మహదానంద సంభరితుడైన దేవవ్రతుడు ధర్మరాజుకు సర్వమంత్రసారమైన విష్ణుమంత్ర ప్రభావాన్ని వివరించి చెప్పటం ప్రారంభించాడు. అది కూడా పూర్వం నారదముని ఒకప్పుడు తనకు సవిస్తారంగా అనుగ్రహించాడని, దానినే తాను చెబుతానని అన్నాడు. నారదుడు ఓసారి శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కరించి నిన్ను ఏ విధంగా మోక్షార్థులైన జనులు కొలుచుకుంటున్నారో, ఏ పవిత్ర మంత్రం జపిస్తున్నారో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు విష్ణుసహస్రనామాల గురించి, వాటి పారాయణ క్రమంలో అనుస్మృతి గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు.

ఇంద్రియ నిగ్రహం, నిర్మల శ్రద్ధ, ప్రగాఢభక్తి తన (శ్రీమహావిష్ణువు) మీద ధ్యాస నిలపటానికి అత్యంత అవసరాలని అన్నాడు. పుణ్యాత్ములకు అవి అనాయాసంగా అలవాటవుతాయని చెప్పాడు. దీనివల్ల మనిషి మున్ముందుగా పాపాలను తొలగించుకొని ఎడతెగని మంత్రజప సాధనతో అనుస్మృతి అనే శ్రీమహావిష్ణువు స్తోత్రాన్ని పఠించాలన్నాడు. ఓంకార పూర్వకమైన నమః పదంతో షడ్గుణైశ్వర వాచకం, సర్వవ్యాపకత్వ వాచకం అయిన పదాల జంటను చతుర్ధి విభక్తితో (కొరకు) చేర్చి జపించాలన్నాడు. అదే శ్రీమహావిష్ణువు మంత్రమని, ముందుగా ఆ మంత్రాన్ని నిశ్చల చిత్తంతో ప్రశాంతుడైన తర్వాత అనుస్మృతి పారాయణకు ఉపక్రమించాలని స్వయంగా శ్రీమహావిష్ణువే తన మంత్ర జప విధానాన్ని వివరించాడు. అలా చేస్తే ధర్మార్ధకామమోక్షాలు అనతికాలంలోనే పొందవచ్చని చెప్పాడు. మంత్రజపమైన తర్వాత అనుస్మృతి ఉపదేశాన్ని కూడా విష్ణువు నారదుడికి వివరించాడు. ‘అవ్యక్తుడు, శాశ్వతుడు, సర్వప్రపంచకోటి హేతుభూతుడు, భక్తవత్సలుడు, పరమ పురుషుడైన శ్రీమహావిష్ణు దేవునికి అంజలి ఘటించి ఆయన పవిత్ర పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను. స్థావర జంగమాలు, బ్రహ్మతో సహా ఈ విశ్వం సర్వమూ ప్రళయకాలంలో నశించినప్పుడు తానొక్కడు మాత్రమే నశించకుండా నిలిచి ఉండే దేవాదిదేవుడికి ఇవే నా నమస్సులు. సూర్యచంద్రాది తారకాస్వరూపుడై సుస్థిర తేజోమయుడై ప్రకాశిస్తున్న ఆ శ్రీమన్నారాయణుడు నన్నాదుకొని సంరక్షించాలి. దేవతాధీశ్వరా నీస్వరూపం బాగా గ్రహించినప్పుడు కానీ సంసారం బాధలు నశించిపోవు. చరాచర ప్రపంచంలో సర్వత్రా అంతర్లీనంగా నువ్వు ఉంటూ ప్రకాశిస్తుంటావు. నిన్ను నిరంతరం నేను ధ్యానిస్తున్నాను. ఓ జలధిశయనా ప్రాణసహితమై నా బుద్ధి నిన్ను ఎల్లవేళలా సేవించునట్లుగా నిశ్చలమైన, ప్రగాఢమైన భక్తి నాకు అనుగ్రహించు. పూర్వజన్మ కర్మ ఫలితాలు ఎలా ఉన్నా, వాటి వల్ల నేను ఎన్నెన్నో బాధలు అనుభవిస్తున్నా వాటన్నిటినీ నశింపజేసి నాకు ఆనందాన్ని అనుగ్రహించు. ఓ దేవదేవా! నా హృదయంలో నిన్ను ఎప్పుడూ సంస్మరించుకుంటూ ఉంటాను. అపార వాత్సల్యంతో వీడు నా వాడు అనే భావనతో కరుణాపూరతరంగిత కటాక్షవీక్షణం నీవు నామీద ప్రసరింపజేయి’ అని జపించిన వారికి అవ్యయమైన శాంతి అతి తక్కువ కాలంలోనే లభిస్తుందని చెప్పాడు. యజ్ఞయాగ సమయాల్లో ఈ అనుస్మృతి పఠిస్తే ఎంతో గొప్ప ఫలితం లభిస్తుంది. దేవత, పితృపూజలలో కానీ, అగ్నిహోత్రార్చన వేళలలో కానీ అనుస్మృతి జపం వల్ల మనిషికి మహోత్తమమైన పుణ్యగతి ప్రాప్తిస్తుంది. అశ్వమేధయాగాలు వెయ్యి చేసినా లభించని పుణ్యం శ్రీమహావిష్ణువు మీద భక్తిని నిలిపి నడుచుకున్న వారు అవలీలగా సాధించవచ్చని శ్రీమహావిష్ణువు తన విష్ణు సహస్ర నామాల ప్రభావాన్ని దేవముని అయిన నారదుడికి వివరించి చెప్పాడు. విశ్వమంతా శాంతి నిండేందుకు ముందుగా వ్యక్తిపరంగా మనశ్శాంతి ఉండి తీరాలి. ఇలాంటి మనశ్శాంతిని పొందేందుకు విష్ణు సహస్రనామ పారాయణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. ఈ నాటికీ నిత్యం ఎందరో స్వానుభవం మీద ఈ విషయాన్ని వివరిస్తున్నారు. ఈ విష్ణు సహస్రనామాల పారాయణను పరిశీలిస్తే స్వయంగా శ్రీమహావిష్ణువే వీటి గొప్పతనాన్ని వివరించటమనేది ఇక్కడ విశేషం. ఈ నామాలలో ఎవరీకి అర్థంకాని విషయాలు ఏవీ ఉండవు. అన్నీ ఆ దేవాదిదేవుడు మానవాళికి చూపిన మహోన్నత మార్గదర్శకాలే వాటిలో ఉంటాయి. తన అవతార విశేషాలను వివరిస్తూ ఆ అవతారాన్ని ఎప్పుడు ఎలా దుష్టశిక్షణ కోసం, శిష్టరక్షణ కోసం వినియోగించింది కూడా వాటిలో వివరంగా కనిపిస్తుంది. అందుకే సర్వమంత్ర సారాలుగా విష్ణుసహస్రనామాలు భాసిల్లుతున్నాయి. మనసు ఏకాగ్రం కావటానికి, మనోభీష్టాలు సిద్ధించటానికి ధర్మరాజుకు మహాభారతం శాంతిపర్వంలో భీష్మాచార్యుడు ఈ విషయాలను వివరించాడు.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net