Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


భారతకాలంనాటి పిండివంటలు
పిండివంటలు ఈనాడు ఒకరకమైనవి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు తరాలలో మరికొన్ని రకాలు ఉండేవి. ఇంకా పూర్వం అంటే మహాభారతకాలం నాడు ఎలాంటి పిండి వంటలు ఉండేవి? వాటికోసం ఏయే పదార్థాలను వినియోగిస్తుండేవారు అనే విషయాన్ని తెలియజెప్తోంది ఈ కథా సందర్భం. ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధయాగం విజయవంతమైంది. ఆ యాగ పరిసమాప్తి సందర్భంగా ఎందరెందరికో విందు ఏర్పాటు చేశారు. జగత్తులో భోజన పదార్థాలను రుచికరంగా వండటంలో ప్రసిద్ధుడైన భీమసేనుడికే ఆ విందు ఏర్పాట్లు అప్పగించాడు ధర్మరాజు. మంచి తిండిపుష్టి కలిగినవాడు, అందులోనూ వంట బాగా చెయ్యగలిగిన వాడు అయిన భీమసేనుడు విందు ఏర్పాటు చేస్తే ఎలాగుంటుందో తెలియచెప్పే ఈ కథాంశం జైమిని భారతం అరవై అయిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. స్వర్ణమయమైన అందాల రత్నాల మండపంలో యాగానికి వచ్చిన అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. గంధపు చెక్కలతో చేసిన పీటలపై రత్నాల కంబళ్లను పరిచారు. వాటిపై ముందు పువ్వులు చల్లారు. బంగారు పళ్ళెరాలను తెచ్చి ఒక్కో పళ్ళెంలో ఇటూ అటూ ఉండేలా అరవై నాలుగు చిన్న గిన్నెలు ఉంచారు. ఒక్కొక్కచోట రెండేసి రత్నదీపాలను అలంకరించారు. ఆ మండపమంతా అగరుధూపం వేశారు. పైన అందాల పందిరిని కట్టారు. పూల తెరలను వేలాడదీశారు. అక్కడ ఉన్న పాత్రలన్నింటినీ సుగంధ జలంతో కడిగి అతిథులు వాడటానికి సిద్ధం చేశారు. ప్రతి సువర్ణపళ్ళెం వద్ద ఒక్కొక్క రత్న కమండలం లాంటి జలపాత్రను ఉంచారు. అన్నీ సిద్ధం కాగానే భీముడు వడ్డించే వారిని పిలిచి తొలుత పాయసాన్ని తెమ్మన్నాడు. బంగారుపళ్ళెంలో పోసిన పాయసం ఉదయిస్తున్న చంద్రబింబంలా కనిపించింది. సన్నజాజి మొగ్గలాగా మిలిమిలలాడే అన్నం, దాంతోపాటు పువ్వులు, ఆకులు, పళ్ళు, దుంపలు, చెక్కలు, బెరడులు, పెద్ద పెద్ద ఆకులు, కారం, చేదు, ముడి పంచదార కలిపి తయారు చేసిన వివిధ రకాల కూరలను వడ్డించారు. ఈ భోజన పదార్థాలను నిత్యం తినేవారు ఎంతో ఆనందంగా తింటూ ఉంటే అలాంటి భోజన పదార్థాలను ఇంతకు ముందు ఎన్నడూ చూడని వారూ, అడవులలో, ఆశ్రమాలలో ఉండేవారైన మునులు చూసి ఎంతో ఆశ్చర్య చకితులయ్యారు. ఒకరు పూతం అనే పిండివంటను తన పక్కనున్న వ్యక్తికి చూపి అడవిలో ఉన్నందువల్ల అదేమిటో తనకు తెలియదని, కాస్త దానిపేరు వివరించి చెప్పమన్నాడు. ఆ రెండో వ్యక్తి కూడా ఆశ్రమవాసే కావటం వల్ల ఆ.. చంద్రబింబంలోని ముక్కలు అయి ఉంటాయిలే అన్నాడు. ఆ ఇద్దరూ అలా అనుకుంటూ ఉండగానే ఫేణీలు (కజ్జికాయల లాంటి పిండి వంటలు) వచ్చాయి. వాటిని చూసిన వ్యక్తి ధర్మరాజు చేస్తున్న యాగానికి తెల్లరెక్కలతో ఉన్న హంసలు కూడా వచ్చినట్లున్నాయే అని అనుకొన్నాడు. వడ్డనకు వచ్చిన లడ్డూలను చూసి మేడిపళ్ళు అని మరో ముని అనుకొన్నాడు. అన్నం వడ్డిస్తుండగానే కొండ మల్లెపువ్వులని ఒకరు, కరంజిక అనే పదార్థాన్ని చూసి కొండ గోగుపువ్వులని మరొకరు అనుకొన్నారు. బాగా బంగారు రంగు వచ్చేలా నూనెలో వేయించి తెచ్చిన గారెలను చూసి సూర్యరథ చక్రం తన ముందు పడిందేమిటబ్బా అని మరొక వనాశ్రమవాసి అనుకొన్నాడు. కొందరు ద్రాక్షరసాన్ని ఇష్టపడి తాగితే మరికొందరు మామిడిపండ్ల రసాన్ని తాగారు. ఒలిచి నేతిలో ముంచి పంచదారతో అద్దిన అరటిపండు మొత్తం నోట్లో కుక్కుకొన్నాడు మరొక మునీశ్వరుడు. పంచదార, నెయ్యి కలిపి తయారుచేసిన మండకం అనే తీపి పదార్థాన్ని నోట్లో వేసుకొని అంతటి ఉత్తమ సౌఖ్యం తనకు ఎప్పుడూ లభించలేదని మరొక వనవాసి అనుకొన్నాడు. ఈ రోజుల్లో చూస్తున్న సన్నబూందీ లాంటి పిండివంటలు తింటూ మోక్షం కన్నా తనకు ఆ బూందీమీదే ఎక్కువ ఇష్టాన్ని పెంచుకొన్నాడు మరొకడు. ఇంతటి రుచికరమైన, అపూర్వమైన పిండివంటలతో కూడిన ఉత్తమ భోజనాన్ని ఎంతో ప్రేమగా భీమసేనుడు అందరికీ దగ్గర ఉండి వడ్డన చేయించాడు. ఈ కథాంశంలో ఎప్పుడో రాజుగారి కొలువుకు ఒకటి, రెండు సార్లు మాత్రమే వచ్చే మునులు అరుదైన ఆ నాటి పిండివంటలను చూసి ఆశ్చర్యపడుతూ తృప్తిగా భోజనం చేశారు. ఆ పదార్థాలను వారి వారి ­హలకు అనుగుణంగా పోల్చుకోవటంలో కొంత వర్ణనాత్మకత కనిపిస్తుంది. భీమసేనుడంతటి వాడు స్వయంగా అంతటి గొప్ప విందును అశ్వమేథయాగం చేయించిన మునులు, రుషులకు వారితోపాటు యాగానికి వచ్చిన అందరికీ వడ్డించినట్లు, వారంతా ఎంతో తృప్తితో భోజనం చేసినట్టు ఈ కథాంశం వల్ల తెలుస్తుంది. భారతకాలం నాటి రుచికరమైన పిండివంటల సమాచారం ఇలా ఇక్కడ లభిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net