Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


వ్రతోత్సవ సంరంభం శ్రావణం
మాసాలలో శ్రావణ మాసం కళే వేరు. ప్రకృతంతా పచ్చపచ్చని అందచందాలతో పరుగులెత్తే నదీ జలాలతో మధుర మనోజ్ఞంగా కనిపిస్తుంటుంది. ఈ కళకు తోడు ఇంటింటా పలురకాల సందడి భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ఎన్నో రకాల కామ్యవ్రతాలు జరుపు కోవటానికి శుభఫలితాలు పొందటానికి శ్రావణమాసం తగినదని వ్రత గ్రంథాలు, అనుభవజ్ఞులైన పెద్దల వివరణలో కనిపిస్తుంది. ఈ మాసం విశేషమేమంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండటమే. చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి కనుకనే దీన్ని శ్రావణమాసం అన్నారు. ఈ శ్రావణంలోనే శ్రీకృష్ణభగవానుడు పుట్టిన కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి లాంటి పండుగలు వస్తాయి. ఆండాళ్‌మాత తిరునక్షత్రం ఈ మాసంలోనే. ఆ ఆండాళ్‌మాత తిరునక్షత్రంతోపాటు అళవందార్‌, బదరీనారాయణుల తిరునక్షత్రాలు కూడా వస్తాయి. తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు గరుత్మంతుడు అమృత భాండాన్ని సాధించి తెచ్చుకొన్న గరుడ పంచమి, సర్పదోషాల నుంచి తప్పించుకోవటానికి ఉపకరించే నాగపంచమి వ్రతాలు శ్రావణంలో తారసపడటం ఆస్తిక జనానికి ఆనందాన్ని కలిగించే విషయం. శ్రావణ శనివార వ్రతాలు, మంగళ, శుక్రవారాలు ఈ మాసంలో ఇంటింటా కనిపిస్తాయి.

శ్రావణ మాసంలో శుద్ధపాడ్యమి నాడు ఆరోగ్య, విద్యాప్రాప్తి వ్రతాలు ప్రారంభమవుతాయి. పాడ్యమి నుంచి పూర్ణిమ దాకా పవిత్రారోపణ ఉత్సవాలు చేస్తారు. విదియనాడు చేసే మనోరథ ద్వితీయావ్రతం కోరిన కోర్కెలను తీరుస్తుందన్నది నమ్మకం. శ్రావణ శుద్ధషష్ఠినాడు సూపౌదన వ్రతం చేసి శివపూజ నిర్వహిస్తుంటారు. ఈ వ్రతాచరణ విధానమంతా ఆరోగ్య నేపథ్యంలో సాగుతుంది. శివుడికి నివేదించే పప్పూ, అన్నం వాతావరణ పరంగా ఈ మాసంలో వాడటం ఎంతో శ్రేష్ఠమని దాన్ని తెలియచెప్పేందుకే ఈ వ్రతం ఆవిర్భవించిందని పెద్దలంటున్నారు. శ్రావణ శుద్ధ సప్తమినాడు అవ్యంగ సప్తమీవ్రతం, అష్టమినాడు దుర్గావ్రతం, నవమినాడు కౌమారీ పూజ, దశమి రోజు దధి, వేదవ్రతాలు చేస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశికి మరింత విశేషముంది. దీనికి పుత్ర ఏకాదశి అని పేరు. సంతాన ప్రాప్తి కోసం దీన్ని చేస్తుంటారు. శుద్ధ ద్వాదశినాడు దామోదర ద్వాదశి వ్రతం చేసి విష్ణుప్రతిమను దానమివ్వటం విశేష పుణ్యప్రదం. శ్రావణంలో మన్మధుడికి ప్రీతికరమైన తిథి ఒకటుంది. అదే శుద్ధత్రయోదశి. అందుకే ఈ తిథి రోజున అనంగవ్రతం చేసి రతీమన్మథులను పూజిస్తుంటారు. ఈ వ్రతం దాంపత్య బంధ వృద్ధిని కోరుతూ చేయటం కనిపిస్తుంది. శ్రావణశుద్ధ చతుర్ధశినాడు శివుడికి పవిత్రారోపణ చేస్తారు. శుద్ధ పూర్ణిమనాడు జంధ్యాల పూర్ణిమ, రాఖీ, నార్లీ జయంతి నిర్వహిస్తుంటారు. పూర్ణిమ అనంతరం వచ్చే కృష్ణపాడ్యమినాడు ధనావాప్తివ్రతం, విదియనాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటం కనిపిస్తుంది. ఇదే తిథి నాడు రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి. తదియనాడు తుష్ఠిప్రాప్తి, కజ్జలి తృతీయలను జరుపుతారు. శ్రావణమాసంలో వచ్చే కృష్ణచతుర్ధశినాడు కష్టాలన్నీ తీరటానికి సంకష్టహరణ చతుర్ధివ్రతం జరుపుతుంటారు. పంచమినాడు రక్షాపంచమి, షష్టినాడు హలషష్ఠి, సప్తమినాడు శీతలా సప్తమీ వ్రతాలను జరుపుతారు. శ్రావణ కృష్ణాష్టమి మరింత విశేషమైంది. ఈ తిథినాడు కృష్ణాష్టమి వ్రతం దేశం అంతటా జరుగుతుంటుంది. కృష్ణనవమి నాడు చండికా పూజ, ఏకాదశిన అజైకాదశి జరుపుతారు. ఈ ఏకాదశీ వ్రతం సర్వశుభప్రదాయినిగా పేరొందింది. హరిశ్చంద్రుడు లాంటివారు ఈ వ్రతాన్ని చేసిన తర్వాత కష్టాలన్నిటినీ అధిగమించి శుభాలను పొందినట్లు వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కృష్ణద్వాదశినాడు రోహిణీ ద్వాదశి, కృష్ణత్రయోదశినాడు ద్వాపరయుగాది, చతుర్దశి నాడు అఘోర చతుర్దశి చివరగా శ్రావణకృష్ణ అమావాస్య నాడు పోలామావాస్య వ్రతాలను చేయటం ఎంతో పూర్వకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ వ్రతాలు, వీటి ఆచరణ విధానం, పాటించాల్సిన నియమాలు ఇవన్నీ భక్తితోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాలను కలిగించేవిగా రూపొందాయన్నది పండితులు చెబుతున్నమాట. ఇలా శ్రావణమాసం ప్రారంభ దినం నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ ఏదో ఒక ఉత్సవమో, వ్రతమో జరుగుతూ మాసం అంతా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net