Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'


కథ నిజమైందిలా...
కమ్మని డిస్నీ కథలు చెప్పి ఆరేళ్ల కూతురు లియాను రాత్రిళ్లు నిద్రపుచ్చేవాడు తండ్రి రాబ్‌ ఆడమ్స్‌. ఆ కథల్లో ఉన్నట్టే తన పడకగదిలోనూ పెద్ద చెట్టును ఏర్పాటుచేయమంది లియా. ఆమె కోరికను తీర్చడం కోసం పదిహేనురోజులపాటు కష్టపడి బెడ్‌రూమ్‌లోనే కథలో మాదిరిగా తొర్రతో ఉన్న పెద్ద చెట్టును ఏర్పాటుచేశాడు. ఆ చెట్టు తొర్రలోనే లియా కూర్చుని చదువుకుంటోంది. అంతేకాదు స్నేహితులందరినీ పిలిచి తన గదిని చూపించి ఎంతో మురిసిపోతోందట. కథలోని అడవి అందాలను తన సృజనతో కూతురి పడకగదిలోకి తీసుకొచ్చిన తండ్రి ఆడమ్స్‌ కూడా లియా సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నాడు.

పశ్చాత్తాపం
డవిలో ఒక నెమలి ఉండేది. పక్షులూ, జంతువులూ అన్నిటికంటే తనే గొప్ప అందగత్తెనని ఎప్పుడూ మిడిసిపడేది. ‘నల్లగా, అందవిహీనంగా ఉన్నావ’ని కాకిని గేలిచేసేది. ‘తెల్లగా పాలిపోయి ఉన్నావ’ంటూ పావురాన్నీ వెక్కిరించేది. కమ్మగా పాడే కోయిలనూ... గొంతు విప్పకపోతే నీకూ కాకికీ తేడానే ఉండదని దెప్పిపొడిచేది. చిన్న శబ్దం వినిపిస్తేచాలు పారిపోయే పిరికిపంద కుందేలని విమర్శించేది. అలా ప్రతి జీవినీ చులకన చేస్తూ మాట్లాడేది.

ఒకరోజు పక్షులన్నీ కలసి ఒకచోట కూర్చుని కష్టసుఖాలు పంచుకుంటున్నాయి. అక్కడకు వచ్చిన నెమలి ‘ఎలాగూ అందరూ ఒక్కచోటే ఉన్నారు కాబట్టి అద్భుతమైన నా నాట్యాన్ని చూసి ఆనందించండి’ అంటూ నాట్యం చేయడం మొదలుపెట్టింది. నాట్యంలో మునిగిపోయి అటుగా వచ్చిన వేటగాడిని అది చూడలేదు. మిగతా పక్షులన్నీ వేటగాడు రావడాన్ని గమనించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాయి. వేటగాడు వెంటనే వల వేసి నెమలిని పట్టుకుని ఆ వలను చెట్టు కింద ఉంచి దాహం తీర్చుకోడానికి వెళ్లాడు. ‘అందరినీ చులకన చేసి మాట్లాడినందుకు నాకు తగినశాస్తే జరిగింది’ అని నెమలి కన్నీరుమున్నీరైంది. దాని పశ్చాత్తాపాన్ని గమనించిన ఓ కాకి వెంటనే ఎగురుకుంటూ వెళ్లి కుందేలుకు విషయం చెప్పి నెమలిని కాపాడదామని చెప్పింది. కుందేలు పరుగు పరుగున వచ్చి నెమలిని బంధించిన వలను తన పదునైన పళ్లతో కొరికేసింది. అలా ప్రాణాలతో బయటపడిన నెమలి... చులకన చేసి మాట్లాడినా పట్టించుకోకుండా తన ప్రాణాలు కాపాడిన కుందేలుకూ కాకికీ ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంది.


ఆధారాలు
అడ్డం:
1. తెలుగు సంవత్సరాల్లో మొదటిది? (3)
3. ఓటమి (4)
5. కాయం మధ్య అక్షరంతో తెలుగు లివర్‌? (3)
7. ఉప్పు (3)
9. సత్యం (3)
10. కంబం దేని వికృతి? (2)
12. వూతం, ఆసరా (4)
14. కుక్కుటం... తిరగబడింది (2)
16. అతిశయం (2)
17. పశ్చిమ భారతంలో ఒక రాష్ట్రం (2)
19. శత్రుత్వం (2)
20. అరసంచిలో సగం! (2+2)
22. ఎండమావి (4)
24. కర్ణాలు (3)
25. ముఖం (3)
26. మంచు (2)
28. నక్షత్రం (2)
29. దుస్తుల తయారీదారు (2)
31. శిబిరం (2)
33. కాకినాడ పేరుతో ప్రసిద్ధమైన మిఠాయి? (2)
34. శాపానికి వ్యతిరేకం? (2)
35. ఖరీదు, ధర (2)
37. ఆంగ్ల కళాశాల (3)
38. అరుగు (2)
40. అంతరిక్షం (3)
42. పెట్టె (3)
43. కృష్ణుడికి ఇష్టమైనవి? (4)
45. గారె (2)
46. అరవై నిమిషాలు (2)
47. నారదుడి చేత సంగీతవాద్యం? (3)
48. పాశం (2)
49. అయిదో నెలను పదేపదే పలికే జంతువు? (2)
50. మారువేషంలో భీముడు? (4)

నిలువు:
1. ప్రసిద్ధికెక్కినది (3)
2. చేపలు పట్టేందుకు జలాల్లోకి విసిరేది? (2)
3. పందెం (2)
4. జటిలం కొంచెం మారిస్తే- పుట్టుమచ్చ! (3)
5. కొంచెం, కొద్దిగా (2)
6. వారిని అక్కడినుంచి లెమ్మనండి! (3)
8. ఉపన్యాసకుడు (2)
9. వర్షం (2)
11. ఖజానా (3)
12. సదనం, ఇల్లు (3)
13. కట్ట, మూట (2)
15. అభీష్టం, ఇచ్ఛ (3)
17. ధేనువులు (3)
18. రోడ్డుమీద ఓ భారీ వాహనం (2)
19. విదేహ రాజకుమార్తె సీతను ఇలా కూడా అంటారు? (3)
20. కపోతం (3)
21. కడ (3)
22. మీరు, మేము, అందరం కలిసి? (4)
23. పొగగొట్టం (2)
27. జ్వలించే సోమవారం! (2)
28. సరికొత్త, నూతన (2)
30. ఆలోచనలు (4)
32. రాక్షసి (3)
33. వరంగల్‌ చేరువలో ఒక రైల్వేస్టేషన్‌? (4)
34. రంగు (2)
36. కొలను, సరస్సు (4)
38. గజిబిజి (4)
39. కీడు, హాని, అపకారం (2)
41. వణకు (2)
43. ఇంతి (3)
44. లోలోన బాధపడు (3)
46. చందనం (2)

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
Top  |  previous page
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net