Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
అందరూ దొరలే...
దొరికినా
కాదు... కాదు... ఇంతే తిన్నారు!
ఎం.రఘునాథరెడ్డి. విశ్రాంత ఉపాధ్యాయుడు. వీణవంక మండలం చల్లూరులో ఉంటారు. తమ గ్రామాభివృద్ధి పనులను సహతో తనిఖీ చేయాలని భావించారు. సమాచారం అడుగుతూ దరఖాస్తు చేశారు. వచ్చిన వివరాలను చూస్తే చాలా పనుల్లో తేడాలు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్‌, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిగింది. రూ.13 లక్షలు మాయమయ్యాయనే ప్రకటన కూడా వెలువడింది. ఏమైందో ఏమో... కొద్ది రోజులకు అధికారులు మాట మార్చారు. రూ.3.97 లక్షలే దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. వాటిని తిరిగి వసూలు చేయాలని చెబుతూ ఫిబ్రవరి 13, 2012న తహశీల్దార్‌కు ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత వాటి వూసే ఎత్తట్లేదు.
అంతన్నారు... ఇంతన్నారు
ల్యాల మండలం నూకపల్లి. ఇక్కడ జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. గ్రామానికి చెందిన వేణు, అతని స్నేహితులు వీటిపై సహ దరఖాస్తులు చేశారు. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించారు. దాదాపు రూ.40 లక్షల మేరకు నిధుల దుర్వినియోగం జరిగిందని నిర్థరణకు వచ్చారు. జిల్లా కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు, జగిత్యాల ఆర్డీవోలకు దీనిపై ఫిర్యాదులు చేశారు. అధికారులు విచారణకు వచ్చారు. జరిగిన పనులను పరిశీలించారు. రూ.18 లక్షలు దారితప్పాయని తేల్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ విచారించి, దుర్వినియోగమైంది రూ.11 లక్షలేనని చెప్పారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ‘లెక్క’లను సరి చేశారు. పోయిన సొమ్ము రూ.9 లక్షలని ప్రకటించారు. కానీ... ఇప్పటివరకూ రికవరీ లేదు. మొత్తమ్మీద అక్రమాలు బయటపడి రెండున్నరేళ్లు దాటిపోయింది. బాధ్యులపై కనీస చర్యలు కూడా లేవు.

మీ ఇంట్లో దొంగతనం జరిగింది...
విలువైన వస్తువులు పోయాయి...
ఆ తర్వాత ఎలాగో కష్టపడి దొంగను పట్టుకున్నారు మీరు...
అతనికి నాలుగు తగిలించి అయినా కూడా మీ వస్తువులను మీరు తీసుకుంటారు కదా!
ఘనత వహించిన మన అధికారులు మాత్రం ఈ పని చేయట్లేదు.
రూ.లక్షల కొద్దీ ప్రజాధనాన్ని మాయం చేసిన ఘనాపాటీలు తమ కళ్ల ముందే తిరుగుతున్నా చూస్తూ వూరుకుంటున్నారంతే! వారి దగ్గర నుంచి జనం సొమ్మును తిరిగి తేవడానికి వీరికి చేతులు రావట్లేదు!
సాక్ష్యాలు కావాలంటే కరీంనగర్‌ జిల్లాకు వెళదాం. ఇలాంటి ఉదంతాలు లెక్కలిమిక్కిలిగా కనిపిస్తాయి అక్కడ.

అభివృద్ధి 1, అవినీతి 12
మ్మికుంట మండలం కోరుపల్లికి 2006 - 11 మధ్యలో రూ.13.85 లక్షల మేరకు బీఆర్‌జీఎఫ్‌, 12వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. వాటి వినియోగాన్ని తెలుసుకునేందుకు గ్రామానికి చెందిన ప్రకాష్‌ సహ చట్టాన్ని ప్రయోగించారు. అసంపూర్తి సమాచారం వచ్చింది. దాన్ని పరిశీలిస్తేనే భారీ అవకతవకలు బయటపడ్డాయి. దాంతో కిందటేడాది జులైలో కలెక్టరుకు ప్రకాష్‌ ఫిర్యాదు చేశారు. దానిపై జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేయబోతే, ఆయనకు రికార్డులు దొరకలేదు. రికార్డులను సమర్పించాలని సర్పంచికి నోటిసిచ్చారు. ఆ తర్వాత అధికారులు అక్రమాల నిగ్గు తేల్చారు. వచ్చిన నిధుల్లో రూ.1.05 లక్షలు మాత్రమే సద్వినియోగమయ్యాయని గుర్తించారు. మిగిలిన సొమ్మును రికవరీ చేయాలని ఈ ఏడాది మే 23న కలెక్టరు ఆదేశించారు. నేటికీ ఆ పని జరగలేదు.
చెప్పారు... మర్చిపోయారు!
తిరుపతి గౌడ్‌... మానకొండూరు మండలం చెంజెర్ల వాసి. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై ఆయనకు అనుమానం కలిగింది. సహ దరఖాస్తు చేశారు. నిధులు పక్కదారిపట్టినట్లు తేలింది. కలెక్టరు ఫిర్యాదు చేశారు. విచారణ జరిగింది. అక్రమాలు వాస్తవమని వెల్లడైంది.

గ్రామాభివృద్ధి నిధులను దుర్వినియోగం చేసిన వారి నుంచి రూ.42 వేలు తిరిగి వసూలు చేయాలని తహశీల్దార్‌కు ఈ ఏడాది మార్చి 19న ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికీ అవి అమలు కాలేదు.

- కటకం రాజేందర్‌, కరీంనగర్‌

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net