Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
సుప్రీం చెప్పినా వినరా
దేశంలోని ఏ విశ్వవిద్యాలయమైనా, సెకండరీ విద్య బోర్డులైనా, సీబీఎస్‌ఈ అయినా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం చేసిన సమాధానపత్రాలనేవి... ‘పత్రాలు, రాతప్రతులు, అభిప్రాయాల’ వర్గంలోనివి. ఇవన్నీ సహ చట్టం సెక్షన్‌ 2(ఎఫ్‌)లో చెప్పిన ‘సమాచారం’ నిర్వచనంలో ఉన్నవే. కాబట్టి జవాబుపత్రాలను బయటపెట్టాల్సిందే.
- సుప్రీంకోర్టు (సివిల్‌ అప్పీలు నం.6454, ఆగస్టు 9, 2011)

భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన పై తీర్పును ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ధిక్కరిస్తోంది. మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను సహ చట్టం కింద ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

చంద్రగిరికి చెందిన టి.రాజేష్‌ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ చదువుతున్నారు. తాను రాసిన పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను అడుగుతూ ఈ ఏడాది జూన్‌లో సహ దరఖాస్తు చేశారు. విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం ఇలా ఇవ్వడానికి కుదరదంటూ ప్రజా సమాచార అధికారి సమాధానమిచ్చారు. దరఖాస్తుదారు మొదటి అప్పీలు చేశారు. ‘గతంలో జవాబుపత్రాల నకళ్లను ఇవ్వాలన్న రాష్ట్ర సమాచార కమిషన్‌ తీర్పుపై విశ్వవిద్యాలయం దాఖలు చేసిన రిట్‌పిటీషన్‌పై 21.06.2010న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కమిషన్‌ తీర్పును సస్పెండ్‌ చేసింది’ అంటూ అప్పీలుకు బదులు వచ్చింది.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు 2010 నాటివి. కానీ, సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది 2011లో. ఈ కీలక విషయాన్ని విశ్వవిద్యాలయ అధికారులు గమనించారో లేదో!

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net