Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
పునాదులు కదలాల్సిందే
అనుమతులుండవు కానీ ఆరంతస్తుల మేడ వెలుస్తుంది.
నిబంధనలను పాటించరు కానీ నిలువెత్తు భవనాలను నిర్మించేస్తారు.
ఏంటయ్యా మీ ధైర్యం అంటే అధికార యంత్రాంగం మా నేస్తం అంటారు.
అందుకుతగ్గటే వారి ‘స్నేహితులు’ కావాల్సిన ‘పనులన్నీ’ చేసి పెడతారు.
ఇలాంటి వారిని ఏం చేయాలి? అక్రమ నిర్మాణాలను ఎలా అడ్డుకోవాలి?
దారి చూపే కథనమిది. స్ఫూర్తినిచ్చే విజయమిది.
హారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో రెండో పెద్ద పట్టణం బల్లార్‌పూర్‌. ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ నివసించే వారిలో దాదాపు 50 శాతం మంది తెలుగు వారే. స్థానిక గణపతి వార్డులోని సర్వే నంబరు 28/6లోని స్థలంలో గృహసముదాయం కట్టేందుకు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సచిన్‌ కల్లూరువార్‌ తలపోశాడు. అనుమతించాలని మున్సిపాల్టీని కోరాడు. ఆయన సోదరుడు నితిన్‌కు జిల్లా అధికారులు, రాజకీయ నాయకులతో దగ్గరి సంబంధాలున్నాయి. దీంతో జిల్లా ప్లానింగ్‌ కమిటీ అనుమతి లేకుండానే పురపాలకులు తలూపారు.

సచిన్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పూర్తి చేశాడు. రహదారికి మార్జిన్‌ వదల్లేదు. కోచి లేఅవుట్‌ నుంచి వచ్చే మార్గాన్ని మూసేశారు. పార్కింగుకు స్థలం కేటాయించలేదు.

కదిలించిన దరఖాస్తు : దీనిపై స్థానిక సహోద్యమకారుడు (వృత్తిరీత్యా కారుడ్రైవరు) సంతోష్‌ షెడమాకే దరఖాస్తు చేశారు. భవన అనుమతుల వివరాలు అడిగారు. నిబంధనలకు లోబడే అనుమతులిచ్చామని మొదటి అధికారులు తప్పించుకోజూశారు. చివరికి దిగివచ్చారు. ప్రలోభాలు, ఒత్తిడులకు లొంగి స్థానిక సిబ్బంది... భవన యజమానికి సహకరించి ఉండవచ్చని చెప్పారు.

సంతోష్‌ మళ్లీ సహ దరఖాస్తు పెట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారులు కంటితుడుపు చర్యలకు ఉపక్రమించారు. అనుమతుల్లేని భవన భాగాలను తొలగించాలని, లేకపోతే తామే కూల్చేస్తామని నోటిసిచ్చారు. ఆ తర్వాత మాట నిలబెట్టుకోలేదు. సంతోష్‌ అంతిమ పోరాటానికి సిద్ధమయ్యారు. పట్టణంలోని మొత్తం అక్రమణ నిర్మాణాలను తొలగించాలంటూ పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పది రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. స్థానికులు కూడా మద్దతుగా నిలవడంతో అధికారులు మెట్టు దిగారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇకపై చేయమని ప్రజల సమక్షంలో ప్రకటించారు. ప్రస్తుతం... నిబంధనలకు విరుద్ధంగా వెలసిన భవనాలను గుర్తిస్తున్నారు.

- మంద రామచంద్రం, న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌
వివిధ సమస్యలపై వందకు పైగా దరఖాస్తులు చేశా. అక్రమ నిర్మాణలపై పోరాట సమయంలో చాలా మంది నన్ను బెదిరించారు. అవినీతి కొంచమైనా తగ్గాలంటే సామాన్యులందరూ సహ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- సంతోష్‌ షెడమాకే
ప్రభుత్వ పనితీరులో జవాబుదారీ తనం, పారదర్శకత సాధించడానికి సమాచార హక్కు చట్టం ఆవిర్భవించింది. ప్రజల పరిశీలనకు తమ కార్యాలయాలను అందుబాటులో ఉంచడానికి అవినీతిపరులైన అధికారులు సిగ్గు పడుతున్నారు.
- ఎ.రోడ్రిగ్స్‌,ప్రముఖ సహ ఉద్యమకారులు

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

మోగ్లీ.. ఏప్రిల్‌ 15న వస్తున్నాడు

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘ది జంగిల్‌ బుక్‌’ అనే యానిమేషన్‌ చిత్రాన్ని పేరణగా తీసుకుని అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. గతంలో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net