Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
దేవుళ్లకీ మొండిచేయే!
పదిహేడు దేవాలయాలకు 141.49 ఎకరాల మాగాణి భూములున్నాయి. వాటిపై వచ్చే ఫలసాయంతో ఆ ఆలయాల్లోని మూర్తులకు ధూపదీప నైవేద్యాలు అందేవి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి వచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఆ భూములను తీసుకుంది. వాటికి తగిన ధర చెల్లిస్తామని చెప్పింది. ఇది జరిగి ఇప్పటికి పదిహేనేళ్లు అయింది. ఇప్పటికీ ఆ దేవాలయాలకు సర్కారు పూర్తిస్థాయిలో సొమ్ములివ్వలేదు. మొత్తమ్మీద రూ.50 లక్షలు బాకీ పడింది. ఒకపక్క భూములు పోవడంతో ఫలసాయం దూరమైంది. ప్రభుత్వం నుంచి సొమ్మూ రాలేదు. దాంతో ఆ ఆలయాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది.

కృష్ణా జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల పరిస్థితిపై సహ దరఖాస్తు చేస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మచ్చుకు ఒక ఉదంతాన్ని పరిశీలిస్తే... అవనిగడ్డలోని రాజశేఖరస్వామి కోవెల భూములను సర్కారు తీసుకుంది. దీనికి గానూ రూ.7.96 లక్షలు చెల్లించాల్సి ఉంది. కిందటి నెల ప్రారంభం వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

కొసరుతోనే రూ.కోట్లొచ్చాయి!

తెలుగు చిత్రసీమ ఇదివరకు ఓవర్సీస్‌ వసూళ్లని లెక్కలోకి తీసుకొనేదే కాదు. పంపిన ప్రింట్‌ డబ్బులు తిరిగొస్తే చాలు అనుకొనేవాళ్లు నిర్మాతలు. మరీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net