Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
సమాచార సింగం
రెండొందలకు పైగా సహ దరఖాస్తులు... విస్తృతంగా సమాచార సేకరణ... దాని ఆధారంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాల దాఖలు... ఇదంతా చేసిందీ, చేస్తోందీ ఏదో ఓ సంస్థ కాదు. ఒకే ఒక వ్యక్తి. అదీ ఏడు పదుల వయస్సులోని పండుటాకు.
చెన్నుపాటి సింగయ్య... ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం నివాసి. గతంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుతం పదవిలో లేకపోయినా ప్రజాసంక్షేమమే పరమావధిగా వ్యవస్థపై పోరాడుతున్నారు. నీటి స్రాజెక్టుల్లో అక్రమాల నుంచి భూముల కబ్జా వరకూ అనేక అంశాలపై సేకరించిన సమాచారంతో హైకోర్టులో వ్యాజ్యాలు వేస్తున్నారు. విజయాలూ సాధిస్తున్నారు.

ఎన్‌ఏపీ పథకం ద్వారా జిల్లాలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం చెరువులను సాగర్‌ నీటితో నింపాలి. కానీ, స్థానికంగా అధికారులు మాత్రం ఓగేరు వాగు (ఇది కాలుష్యమయం) నీటిని మళ్లించారు. ఫలితంగా ప్రజలకు కలుషిత జలాలతో ఇబ్బందులు. ఈ సమస్యను గుర్తించిన సింగయ్య... పథక వివరాలను అడుగుతూ గ్రామీణ నీటి సరఫరా శాఖకు దరఖాస్తు చేశారు. అలాగే, ఓగేరు వాగు నీటి నాణ్యతపై కూడా సమాచారం సేకరించారు. ఆ జలాలు తాగడానికి పనికిరావన్న కచ్చితమైన వివరాలను సాధించారు. ఈ ఆధారాలతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సంబంధిత అధికారులకు న్యాయస్థానం తాఖీదులిచ్చింది. దాంతో యంత్రాంగంలో తక్షణం చురుకు పుట్టింది. సాగర్‌ నీటితో అన్నంబొట్లవారిపాలెం చెరువు నింపేలా పైపులైను నిర్మాణానికి రూ.కోటి మంజూరు అయిందంటూ సంబంధిత ఉత్తర్వులతో సహా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి నిధులు మంజూరయ్యాయి కాబట్టి సమస్య పరిష్కారమైనట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.

స్ఫూర్తి
న్యాయపోరాటమే మార్గం
* రాష్ట్రంలో చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలపై సహతో వివరాలు సేకరించారు సింగయ్య. వాటి ఆధారంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (డబ్ల్యూపీ:24645/2011) వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులకు తాఖీదులు జారీ చేసింది.

* పర్చూరు రెవెన్యూ కార్యాలయాన్ని మండల కేంద్రంలో కాకుండా ఉప్పుటూరు గ్రామ పరిధి లో ఏర్పాటు చేశారు. దీని వల్ల స్థానికులకు అసౌకర్యం కలుగుతోంది. మరోవైపు... కార్యాలయ ఏర్పాటుకు ఒక దాత ఇచ్చిన స్థలం ఆక్రమణలకు గురైంది. అయినా, అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. దీనిపై సమాచారం తీసుకుని వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 

* ఓగేరు వాగు నీటిని మళ్లించేందుకు నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పటికే నిర్మించిన దిగువ పథకాలకు నీరు అందదన్న వాస్తవాన్నీ సమాచార హక్కు చట్టంతోనే బయటపెట్టారు. అంతే కాదు, కొత్త నిర్మాణాన్ని ఆపాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

* పర్చూరు ప్రాంతంలో కొమ్మమూరు కాలవ పరిధిలో రూ.నాలుగు కోట్ల వ్యయంతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. సరైన నిర్వహణ లేకపోవడంతో ఇది నిరుపయోగంగా మారింది. దీనికి బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలేంటంటూ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ కార్యాలయానికి సింగయ్య సహ దరఖాస్తు చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు దాటినా సమాచారం రాలేదు. ఉన్నతాధికారులను కలిసినా స్పందన లేదు.


నకెందుకులే అనుకుంటే అక్రమాలకు అడ్డుకట్ట పడదు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు సహ దరఖాస్తు చేస్తా. వచ్చిన సమాచారంతో సంబంధిత అధికారులను సంప్రదిస్తా. వారు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. సమాజ హితం కోసమే ఇదంతా.
- సింగయ్య

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net