Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
ప్రచారమేది?
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో సహ చట్టంపై ప్రభుత్వపరంగా నిర్వహించిన అవగాహన సదస్సులు... రెండంటే రెండే. అవీ భారత్‌ నిర్మాణ్‌ కార్యక్రమంలో భాగంగా. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి కావవి. అధికారులే ఈ సమాచారమిచ్చారు. ఈ జిల్లా ఒక్కటనే కాదు... రాష్ట్రంలో ఎక్కడా సర్కారు సదస్సులు నిర్వహించట్లేదు. చట్టంపై ప్రచారం చేయట్లేదు.

సహ చట్టం సెక్షన్‌ 26 ప్రకారం... ప్రజలకు ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లు దాటిపోయినా ఈ నిబంధనను అమలు చేయట్లేదు.

రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మందికి సహ చట్టం గురించి తెలియదు. మిగిలిన వారికి దానిపై ఉన్న అవగాహన కూడా పత్రికలు, స్వచ్ఛంద సంస్థలు, సహోద్యమకారుల కృషి వల్ల వచ్చిందే. ఓట్లు రాల్చే పథకాలపై రూ.కోట్లతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం... ప్రజలకు నిజమైన అధికారం కల్పించే సహ చట్టం ప్రచారానికి మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు.

ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని విభిన్న వర్గాల వారికి చట్టంపై ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి ‘ఈనాడు ముందడుగు’ ప్రయత్నించింది.

విన్నాను కానీ...
- మీనాక్షి, గృహిణి, విశాఖపట్నం
హ చట్టం గురించి విన్నా. ‘ఈనాడు’ పత్రికలో వస్తుంటుంది. ఒకసారి టీవీలోనూ చూశా. చట్టం ద్వారా ఏం చేయవచ్చో పూర్తిగా తెలియదు.
ఆ చట్టముందా!
- ఎల్‌.చిరంజీవి, ప్రైవేటు ఉద్యోగి, శ్రీకాకుళం
మీరు అడిగితేనే తెలిసింది. సహ చట్టమంటూ ఒకటి ఉందా. నాకు తెలిసినంత వరకూ ప్రభుత్వం ఎక్కడా దీనిపై ప్రచారం చేయట్లేదే!
సర్కారుకు శ్రద్ధేది?
- పి.ప్రభాకరరావు, విరామ ఉద్యోగి, ఖమ్మం
స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సదస్సు ద్వారా చట్టం గురించి తెలుసుకున్నా. సర్కారు ఆధ్వర్యంలో సదస్సులు జరగట్లేదు.
పేరు తెలుసంతే
- హిమబిందు, ఇంజనీరింగ్‌ విద్యార్థిని, గుంటూరు
మాచార హక్కు చట్టం పేరైతే విన్నా. కానీ, దానిపై పూర్తి అవగాహన లేదు. వినియోగించుకునేంతగా వివరాలేమీ తెలియదు.
పథకాలపైనే ప్రేమ
- కె.వేములయ్య గౌడ్‌, హైదరాబాద్‌
2జీ, కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణాలు బయటపడ్డాకే సహ గురించి తెలసింది. ప్రభుత్వం తన పథకాలపై ఆర్భాటంగా ప్రకటనలిస్తుంటుంది. కానీ, ఈ చట్టం గురించి ఎలాంటి ప్రచారం చేయట్లేదు. ఆర్టీఐపై ప్రకటనలివ్వాలి. హోర్డింగులు పెట్టాలి.
- కరుకోల గోపీకిశోర్‌ రాజా, ఈటీవీ2

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net