Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఆ తీర్పును పట్టించుకోలేదేం?
 
సెక్షన్‌ 4(1)(బి) సమాచారం ఆన్‌లైన్‌లో ఉంది, అక్కడ చూసుకోండి అంటే కుదరదు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసి దరఖాస్తుదారుకు అందించే బాధ్యత సంబంధిత ప్రజా సమాచార అధికారిదే.
- రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశాలు,
అప్పీలు నం.4421/సీఐసీ/2009, (29.04.2010)
పై తీర్పు.. రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ సీడీ అర్హా ఇచ్చింది. 2010 వార్షిక నివేదికలో కూడా దీన్ని పేర్కొన్నారు. కానీ... ప్రస్తుత సమాచార కమిషనర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోవట్లేదు. 4(1)(బి) సమాచారం నెట్‌లో ఉంది, అక్కడ నుంచి తీసుకోండంటున్న అధికారుల వాదనతో ఏకీభవిస్తున్నారు.

సాంకేతిక విద్య కమిషనరేట్‌కు నెల్లూరుకు చెందిన ఆర్‌.రమేష్‌ ఓ దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వివరాలు, సెక్షన్‌ 4(1)(బి) సమాచారం ఇవ్వాలంటూ అడిగారు. అసంపూర్తి సమాచారం ఇవ్వడంతో కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ నిర్వహించిన కమిషనర్‌ గత నెలలో తీర్పిచ్చారు. కమిషన్‌ గత తీర్పు ప్రకారం, ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని తీసి దరఖాస్తుదారుకు ఇవ్వమని అందులో ఆదేశించలేదు.

దీంతో పాటు తీర్పులో కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దరఖాస్తుదారు కోరిన సమాచారంలో ప్రజా స్రయోజనం లేదు. ఆ సమాచారం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించడానికి దరఖాస్తుదారు, కమిషన్‌ విచారణకు హాజరు కాలేదు’ అని అన్నారు.

ప్రభుత్వ నిధుల లెక్కలు తెలుసుకునే అధికారం భారత పౌరులందరికీ ఉంది. అసలు సహోద్యమం ­పిరి పోసుకుందే ‘మా డబ్బు - దాని లెక్కలు మాకు తెలియాలి’ అన్న నినాదం నుంచే. మరి కమిషనర్‌ అలా ఎలా వ్యాఖ్యానించారో!

మరోవైపు... విచారణకు కచ్చితంగా రావాల్సిన అవసరం అప్పీలుదారుకు లేదు. కమిషన్‌ పంపే విచారణ నోటీసులోనే ఆ విషయం ఉంటుంది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా అప్పీళ్లను విచారిస్తామని గతంలో కమిషన్‌ ఆర్భాటంగా ప్రకటించింది. అది ఏ మేరకు అమలవుతోంది?

తమ వాదనలను వినిపించగలిగే అవకాశాన్ని రాజధానికి సుదూర ప్రాంతాల్లో ఉండే అప్పీలుదారులకు దూరం చేస్తోందెవరు?

కొసమెరుపు: పైన చెప్పిన సీడీ అర్హా తీర్పు కూడా గతంలో ఆర్‌.రమేష్‌ చేసిన అప్పీలుపై వచ్చిందే.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net