Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
తీర్పుల్లో తేడాలెందుకు?
రఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడంలో రెండున్నరేళ్లు జాప్యం చేసిన ప్రజా సమాచార అధికారికి రాష్ట్ర సమాచార కమిషన్‌ వేసిన శిక్ష... హెచ్చరిక.

అందుబాటులో ఉన్న రికార్డులను దరఖాస్తుదారుకు అందజేయడంలో 53 రోజులు ఆలస్యం చేసిన మరో పీఐవోకు మన కమిషనే వేసిన జరిమానా... రూ.13,250

ఆ ఇద్దరు అధికారులు చేసిందీ ఒక రకమైన తప్పు. మరి శిక్షల్లో తేడా ఎందుకు?

53 రోజుల తర్వాత సమాచారం ఇచ్చిన పీఐవోకు చట్ట ప్రకారమే (రోజుకు రూ.250 చొప్పున) జరిమానా పడింది. ఈ లెక్కన చూస్తే... ఆయన కంటే తీవ్రంగా చట్టాన్ని కాలదన్నిన మొదటి అధికారికి ఇంకా ఎక్కువగా జరిమానా (కచ్చితంగా రూ.25 వేలు) పడాలి. కానీ అది జరగలేదు. ఇలా శిక్షల నుంచి కొందరికి ‘మినహాయింపులు’ ఇవ్వడానికి కమిషన్‌కు విచక్షణాధికారం ఉందా? లేదు. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పు (డబ్ల్యూపీ(సి).3845/2007, 28.04.2009), హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులు (సీడబ్ల్యూపీ నం.640 ఆఫ్‌ 2012-డి, 24.08.2012)లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

‘తెలిసే’ వదిలేశారు!
‘దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడంలో రెండున్నరేళ్ల జాప్యం జరిగినట్లు కమిషన్‌ గుర్తించింది. విధినిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాలకు ఇది ప్రతీక’...

మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంపై దాఖలైన అప్పీలుపై విచారణనంతరం ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.విజయబాబు పేర్కొన్న విషయమిది. చట్టం ఇంతగా ఉల్లంఘనకు గురైందని చెప్పిన ఆయన, దానికి బాధ్యులైన పీఐవోను మాత్రం హెచ్చరికతో వదిలేశారు. హైదరాబాద్‌కు చెందిన కె.శివరామకృష్ణ... నవంబరు 2009లో సంబంధిత కార్యాలయానికి ఓ సమాచారం అడిగారు. బదులు రాకపోవడంతో మొదటి అప్పీలు చేశారు. ఉపయోగం లేకపోయింది. కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషనర్‌ ఈ మధ్యనే విచారించి తీర్పిచ్చారు.

ఉల్లంఘిస్తే దండనే
పీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.13,250 జరిమానా వేస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని దరఖాస్తుదారుకు ఇవ్వనందుకు ఈ శిక్ష విధించారు.

పైన చెప్పిన సంస్థకు విశాఖపట్నానికి చెందిన ఎ.రాజేంద్ర కృష్ణ ఓ దరఖాస్తు చేశారు. కానీ ఆయనకు పీఐవో నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. దాంతో మొదటి అప్పీలు చేశారు. అప్పుడు, దరఖాస్తులో అడిగిన కొన్ని అంశాలపై సమాచారం వచ్చింది. మిగిలిన వాటికి సంబంధించిన దస్త్రాలు లేవని అధికారులు చెప్పారు. దాంతో దరఖాస్తుదారు, కమిషన్‌కు రెండో అప్పీలు చేశారు. దీనిపై విచారణానంతరం కిందటి నెల 12న కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. ఉన్న సమాచారాన్ని ఇవ్వడంలో 53 రోజుల ఆలస్యం జరిగిందని, జరిమానా కట్టాలని చెప్పారు. కార్యాలయంలో లేవన్న దస్త్రాలు ఏమయ్యాయో కనుక్కోవాలని సంస్థ ఉపాధ్యక్షుణ్ని ఆదేశించారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net