Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ఇవ్వకుంటే వాత ఖాయం!
రంగల్‌ జిల్లా డీఎఫ్‌వో (అటవీ శాఖ) కార్యాలయ పీఐవోలుగా పని చేసిన ఇద్దరు అధికారులకు జరిమానా. అదీ ఒకే కేసులో. మరో విషయం... అందులో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. అయినా... శిక్ష తప్పలేదు. ఎందుకు? సహ చట్టాన్ని ఉల్లంఘించినందుకు!

ఓ సమాచారం అడుగుతూ కరీంనగర్‌కు చెందిన వి.చక్రపాణి... జులై 2010లో డీఎఫ్‌వో కార్యాలయానికి దరఖాస్తు చేశారు. సమాచారం రాలేదు. మొదటి అప్పీలు పంపారు. దానికీ సమాధానం లేకపోవడంతో అక్టోబరు, 2010లో రాష్ట్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీలు చేశారు. అయితే, కిందటేడాది మేలో ఆ కార్యాలయ పీఐవో (సూపరింటెండెంటు) జి.బాబు పదవీ విరమణ చేశారు. తర్వాత ఆ బాధ్యతల్లోకి ఎం.సారయ్య వచ్చారు. ఈయన కూడా దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వలేదు.

చక్రపాణి అప్పీలుపై కమిషన్‌ ఈ మధ్యనే విచారణ నిర్వహించింది. విచారణకు సారయ్య హాజరయ్యారు. సమాచారం అందుబాటులో లేకపోవడం వల్లే ఇవ్వలేకపోయామని చెప్పారు. కానీ... దీనికి కమిషన్‌ అంగీకరించలేదు. సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈయనకు, పాత పీఐవోకు షోకాజు నోటీసులు జారీ చేసింది. వాటికి వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో జరిమానాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన అధికారికి రూ.1000, సారయ్యకు రూ.పది వేలు చొప్పున వాత పెట్టింది. ‘మే 2011లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విచారణకు వచ్చే నాటి వరకూ దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడంలో జరిగిన జాప్యానికి గల కారణాలను సారయ్య వివరించలేకపోయారు. అందుకే జరిమానా’ అంటూ ఉత్తర్వుల్లో కమిషన్‌ స్పష్టం చేసింది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఏప్రిల్‌ 1న లడ్‌కీ.. లడ్‌కా.. షురూ..

అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా తెరకెక్కుతున్న ‘కీ అండ్‌ కా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు .............

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net