Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
మా ఇష్టం కుదరదిక!
సహ చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు జరిమానాలు విధించే విషయంలో సమాచార కమిషన్‌ ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేదు. సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన ప్రతి రోజుకు రూ.250 చొప్పున లెక్కగట్టి జరిమానా వేయాల్సిందే. ఈ మొత్తాన్ని పెంచే, తగ్గించే అధికారాన్ని కమిషన్‌కు ఇస్తున్న నిబంధనేదీ మాకు చట్టంలో కనపడలేదు.
- హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు
సెక్షన్‌ 20(1) అమలుపై హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం అతికీలకమైన తీర్పు ఇచ్చింది. దరఖాస్తుదారుకు చట్టప్రకారం సమాచారం ఇవ్వని పీఐవోకు జరిమానా వేయాలని రాష్ట్ర సమాచార కమిషన్‌ నిర్ణయిస్తే... చట్టంలో చెప్పిన ‘లెక్క’ను పాటించాల్సిందేనని నిర్దేశించింది.

నిబంధనల మేరకు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన ప్రతి రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25 వేల వరకూ జరిమానా విధించవచ్చని సెక్షన్‌ 20(1) చెబుతోంది. అంటే, దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడంలో పీఐవో 10 రోజుల ఆలస్యం చేశారనుకోండి... ఆయనకు కచ్చితంగా రూ.2500 జరిమానా వేయాలి. చాలామంది సమాచార కమిషనర్లు దీన్ని పట్టించుకోవట్లేదు. రూ.500, రూ.1000, రూ.1500 వంతున తమకు ఇష్టం వచ్చినట్లు వేస్తున్నారు. అదేంటంటే తమకు ఆ ‘విచక్షణాధికారం’ ఉందని చెప్పుకుంటున్నారు. అలాంటి అధికారమేదీ కమిషన్లకు లేదని హిమాచల్‌ హైకోర్టు తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

సోలాన్‌కు చెందిన సంజయ్‌ హిద్వాన్‌ తమ పురపాలక సంఘానికి సహ దరఖాస్తు చేశారు. గడవు దాటిన తర్వాత 14 రోజులకు ఆయనకు సమాధానం వచ్చింది. దీనిపై ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణానంతరం పీఐవోకు రూ.1500 విధిస్తూ కమిషన్‌ తీర్చిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సంజయ్‌ హైకోర్టుకు వెళ్లారు. సెక్షన్‌ 20(1)ను కమిషన్‌ అమలు చేయలేదని వాదించారు. ఆ వాదనను న్యాయస్థానం సమర్థించింది. రోజుకు రూ.250 చొప్పున వేయాల్సిందేనని చెప్పింది. సంబంధిత పీఐవోకు విధించిన జరిమానాను రూ.3500కు (14్ల250) పెంచుతూ ఆదేశాలిచ్చింది.

ఇలాంటి వారికి చెంపపెట్టే!
యన నవీన్‌కుమార్‌. మహారాష్ట్ర సమాచార కమిషనర్‌గా (కొంకణ్‌ డివిజన్‌) ఆగస్టు, 2011 వరకూ బాధ్యతలు నిర్వర్తించారు. అధికారులంటే వల్లమాలిన అభిమానం నవీన్‌కు. వారు సహ చట్టాన్ని ఎంత తీవ్రంగా ఉల్లంఘించినా పట్టించుకునే వారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానా వేయాల్సి వస్తే... రూ.1 (అక్షరాలా ఒక్క రూపాయే) మాత్రమే వేసే వారు. థానే అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌, గ్రామసేవక్‌ తదితరులకు ఇలాగే విధించారు. అదేంటండీ అంత తక్కువ అని అడిగితే... ‘నిజాయతీ గల అధికారులకు రూపాయి జరిమానా అయినా విచారం కలిగిస్తుంద’నే వారు. నిజాయతీపరులైతే... చట్టాన్ని తుంగలో తొక్కరు కదా అంటే బదులుండేది కాదు. హిమాచల్‌ హైకోర్టు తీర్పు... ఇలాంటి సమాచార కమిషనర్లందరికీ చెంపపెట్టు లాంటిదే.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net