Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
వదిలేయమంటే వూరుకుంటారా!
ఢిల్లీ జల్‌బోర్డు కార్యాలయం. ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరికి మిగిలిన ఇద్దరు డబ్బులిస్తున్నారు. ఇంతలో సీబీఐ అధికారులు దాడి చేశారు. లంచమిస్తున్నారన్న కారణంతో ఆ ఇద్దరిని అరెస్టు చేశారు.

పై ఘటనలో అరె స్టు అయింది ప్రభుత్వ అధికారులు. వారు లంచం ఇవ్వజూపింది ఒక పౌరుడికి.

అదేంటి... అంతా రివర్స్‌గా ఉంది అనుకుంటున్నారా!

జరిగిందేంటంటే... 2004 - 11 మధ్యలో నగరంలో బోర్డు ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ పనులపై సంత్‌రాం అనే వ్యక్తి సహ దరఖాస్తు చేశారు. కొద్దిరోజులకు ఆయన్ను బోర్డు సహాయ ఇంజినీరు సుశీల్‌కుమార్‌, జూనియర్‌ ఇంజినీరు పీకే శర్మ సంప్రదించారు. ‘రూ.లక్ష ఇస్తాం. మీకు మొత్తం సమాచారం అందిందని రాసివ్వండ’ని అడిగారు. సరే అన్న సంత్‌రాం... సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు సెప్టెంబరు 29, 2011న ఆ కార్యాలయానికి వెళ్లారు. డబ్బులు తీసుకుంటున్నట్లు నటించారు. ఇంతలో సీబీఐ బృందం వచ్చింది. ఆ అధికారులిద్దరిని అరెస్టు చేసింది.

ఏడాది తర్వాత ఈ విషయమెందుకు చర్చకు వచ్చిందంటే... సీబీఐ వల్లే. ‘లంచమిచ్చింది ప్రైవేటు వ్యక్తికి. ప్రజాసేవకుడికి కాదు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం ఇక్కడ వర్తించదు. కేసును మూసేయండి’ అంటూ ఢిల్లీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది.

న్యాయస్థానం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది. కేసు విచారణను కొనసాగించమని ఉత్తర్వులిచ్చింది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net