Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
ఏడాదికి యాదికొచ్చింది!
‘పై సహ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తుదారుకు వెంటనే అందజేయండి. ఇందులో ఏదైనా ఆలస్యం జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం’

వరంగల్‌ జిల్లా మండల విద్యాధికారులకు అక్కడి డీఈవో రాసిన లేఖ సారంశమిది. తన దగ్గరకు వచ్చిన మొదటి అప్పీలుపై స్పందించిన ఆయన ఇలా అందిరికీ లేఖలు పంపారు. ‘అధికారి మంచివారే. సమాచారం ఇవ్వమని చెబుతున్నారు’ అని అనుకుంటున్నారా! అక్కడే ఉంది మెలిక. అసలు విషయం తెలిస్తే ముక్కున వేలుసుకోవడం ఖాయం.

ఆరెపల్లికి చెందిన ఎస్‌.ప్రశాంత్‌ జిల్లా విద్యాధికారికి ఆగస్టు 9, 2011న ఓ దరఖాస్తు చేశారు. విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించిన సమాచారం అడిగారు. స్పందన లేదు. దాంతో నవంబరు 2, 2011న డీఈవోకు మొదటి అప్పీలు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. దాదాపు ఏడాది పాటు దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. హఠాత్తుగా ఆగస్టు 8, 2012 నాడు ఆయనకు ఆ అప్పీలు గుర్తుకు వచ్చింది. సమాచారం ఇవ్వమంటూ ఎంఈవోలకు లేఖలు రాసేశారు. రాష్ట్రంలో అప్పీలేట్‌ అథారిటీల పనితీరుకు సాక్ష్యమిది. 30 రోజుల్లో పరిష్కరించాల్సిన అప్పీలును ఎనిమిది నెలలకు పైగా తన దగ్గరే పెట్టుకున్నారు డీఈవో. ఎందుకో!

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net