Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
బండి దారికొచ్చింది!
అందరికీ నమస్కారం. నా పేరు షేక్‌ బాజిబాబా. విశాఖ జిల్లా ఎండాడ వాసిని. ఏపీఈపీడీసీఎల్‌ కాంట్రాక్టు ఉద్యోగిని. మన నిత్య జీవిత సమస్యలను సహతో ఎలా పరిష్కరించుకోవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.

విశాఖ నగరానికి పక్కనే ఉన్న పల్లె మాది. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు... ­ళ్లొ వాళ్లు ఎవరైనా సరే, అందరి జీవితాలు వైజాగ్‌తో ముడిపడినవే. రోజూ పొద్దున్నే నగరానికి వస్తాం. ఎవరి పనులు వారూ చూసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్తాం. మా ­రు నుంచి విశాఖకు రోజు రెండు బస్సులు (52వీ/జీ, 52ఈ) తిరుగుతాయి. ‘వీ/జీ’ బస్సు ఉదయం పూట మా అందరికీ అనుకూలమైన సమయంలో ఉంటుంది. చాలామందిమి అందులోనే ప్రయాణిస్తాం. అందుకే ఎప్పుడూ అది కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు హఠాత్తుగా ఆ బస్సు సర్వీసును నిలిపేశారు. ఇక మా బాధలు వర్ణనాతీతం. ఎవరమూ టైంకి పనులకు వెళ్లలేకపోయే వాళ్లం. విద్యార్థులకు క్లాసులు పోయేవి. దీనిపై మద్దెలపాలెం డిపో అధికారులను చాలాసార్లు కలిశాం. గోడు వెళ్లబోసుకున్నాం. ఉపయోగం లేకపోయింది. దాంతో ‘ఈనాడు ముందడుగు’ ప్రతినిధికి ఫోన్‌ చేశా. బస్సును ఎందుకు నిలిపేశారంటూ సహ చట్టం కింద అడగమని ఆయన సలహా ఇచ్చారు. సరే అని దరఖాస్తు చేశా. 15 రోజుల్లో అధికారులు స్పందించారు. బస్సు సర్వీసును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత మాట నిలబెట్టుకున్నారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net