Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఆ తీర్పు.. గొడ్డలిపెట్టు
సుభాష్‌ చంద్ర అగర్వాల్‌... జాతీయ స్థాయిలో సహ చట్టానికి కాపుగాస్తున్న ఉద్యమకారుల్లో ఒకరు. వీదేశీ పర్యటనల్లో వీవీఐపీలు తీసుకుంటున్న బహుమతుల నుంచి కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాల వరకూ ఎన్నో విషయాలను సహతో వెలుగులోకి తెచ్చిన ధీశాలి. సహ చట్టంపై ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యల గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే ‘ఏవో ఒత్తిళ్లు పని చేయడం వల్లే మన్మోహన్‌ అలా మాట్లాడారని’ కుండబద్ధలు కొట్టారు. ‘ఈనాడు ముందడుగు’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖీలో... సహ అమల్లో ఎదురవుతున్న ప్రతిబంధకాలను పూసగుచ్చారు.

ముందడుగు: సహ చట్టం అమలు ఎలా ఉంది?
సుభాష్‌: ప్రస్తుతం ఫర్వాలేదు. చట్టాన్ని సవరించే కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. ఇది శుభపరిణామం. కానీ, ఈమధ్యే ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఉద్యమకారుల్లో అనుమానాలు రేపుతున్నాయి. అయితే... సమాచార హక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ పలుచన చేయబోమని డీవోపీటీ మంత్రి వి.నారాయణ స్వామి స్పష్టంగా చెప్పారు.

ముం: సెక్షన్‌ 4(1)(బి) అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. కారణమేంటి?
సు: ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలనుకోవట్లేదు. అదే సమస్య. సహ చట్టానికి సెక్షన్‌ 4(1)(బి) ఆత్మ. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని 4(1)(బి) కింద ఇవ్వాలని మేమూ సూచిస్తున్నాం. కేంద్ర సమాచార కమిషన్‌ కూడా పదే పదే చెబుతోంది. సహ అమల్లో రాష్ట్రాలతో మరో సమస్య కూడా ఉంది. సెక్షన్‌ 27, 28 ప్రకారం కొన్ని సొంత నిబంధనలను రూపొందించుకునే వెసులుబాటు వాటికి ఉంది. అలా రూపొందుతున్న నిబంధనలు ఒక్కోసారి చట్ట ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులు, ప్రభుత్వ సంస్థలూ అసాధారణంగా రూ.500 వరకు దరఖాస్తు రుసుం వసూలు చేస్తున్నాయి. ఇది పైన చెప్పిన సెక్షన్లను దుర్వినియోగం చేయడమే. ఈ నిబంధనలను సవరించాలి. దేశం మొత్తం ఒకే రకమైన విధానం అమలయ్యేలా చూడాలి.

ముం: రాష్ట్ర సమాచార కమిషన్ల పనితీరు ఎలా ఉంది?
సు: ఇదే పెద్ద సమస్య. కేంద్ర సమాచార కమిషన్‌ స్థాయిలో చట్టం బాగానే అమలవుతోంది. రాష్ట్ర కమిషన్ల పనితీరు చాలా బాధాకరంగా ఉంది. గవన్నర్లకు ఫిర్యాదు చేయడమే దీనికి పరిష్కారం. అలా చేసినా అసాధారణ మార్పులు వస్తాయని ఆశించడం అత్యాశే.

ముం: చట్టం అమల్లోకి ఏడేళ్లు దాటినా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. అడ్డంకులేంటి?
సు: మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. నేను చాలా సదస్సులకు హాజరయ్యా. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో చాలా మంది విద్యార్థులతో మాట్లాడా. దురదృష్టవశాత్తూ వారిలో చాలా మందికి ఈ అద్భుతమైన చట్టంపై అవగాహనే లేదు. చట్టం గురించి అన్ని పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆ ప్రయత్నం చేస్తోంది. విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులను విస్తృతం చేయాలి. అలాగైతే కనీసం కొత్తతరమైనా చైతన్యమవుతుంది. సహపై ప్రచారం చేస్తున్న మీడియా, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు. సహ విజయాలను ప్రత్యేకంగా చూపుతూ, బాధితుల కథనాలు ప్రసారం చేస్తూ, చట్టాన్ని మీడియా కాపుగాస్తోంది.

ము: ఉద్యమకారుడిగా ఎన్నో అక్రమాలను బయటపెట్టారు. మీలాంటి వారికి రక్షణ ఉంటోందా? ప్రజావేగుల రక్షణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం జాప్యమెందుకు చేస్తోంది?
సు: ఆ చట్టం ఇప్పుడున్న ముసాయిదా రూపంలోనే అమలైతే ఉద్యమకారులకు ఎలాంటి రక్షణా కల్పించలేదు. అసలు ఉద్యమకారుణ్ని ఎలా నిర్వచిస్తారు? ఇది చాలా కష్టమైన పని. నా పరిస్థితి వేరనుకోండి. నేను ఢిల్లీలో ఉంటా. మాఫియా, సుపారీ బెడద నాకు లేదు. కానీ.. మారుమూల ప్రాంతాల్లోని ఉద్యమకారులపై దాడులు జరుగుతున్నాయి. అక్రమార్కుల గుట్టు లాగే దరఖాస్తులు చేసినప్పుడు ప్రాణాపాయయూ ఉంటోంది. అలాంటి వారికి రక్షణ కావాలి. ఆ విషయన్ని ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో గ్రహించాలి.

ముం: వ్యవస్థలో అవినీతిని పూర్తిగా రూపుమాపడం సమాచార హక్కు చట్టంతో సాధ్యమేనా?
సు: ప్రజా జీవితంలో ప్రతి చోటా అవినీతి ప్రభావం కనిపిస్తోంది. అవినీతిని చట్టబద్ధం చేసి.. కార్యాలయాల బయట పనికి ఇంతా అని లంచాల ధరలు నిర్ణయించే దుర్భర పరిస్థితులొచ్చేట్టున్నాయని సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. ఒక్క సహతోనే అవినీతిని నిర్మూలించడం అసాధ్యం. లోక్‌పాల్‌ కూడా పూర్తి పరిష్కారం కాదు. ఎన్నికల, న్యాయ సంస్కరణలు, ప్రజా గ్రీవెన్స్‌ బిల్‌... ఇవి జరగాలి. అయితే, సహతో పారదర్శక పాలన సాధ్యమన్న సంగతి మాత్రం ఇప్పటికే రుజువైంది.

ముం: మాజీ న్యాయమూర్తులనే సమాచార కమిషనర్లుగా నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్తోంది. మీరేమంటారు?
సు: ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇందులో చట్టబద్దమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ తీర్పు అమలైతే చట్టం నిర్జీవమైపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ఒక అప్పీలు పరిష్కారానికి ఇద్దరితో కూడిన ధర్మాసనం ఉండాలి. అందులో ఒకరికి న్యాయనేపథ్యం ఉండాలి.
అదే జరిగితే ప్రతీ ప్రభుత్వ సంస్థ ఓ న్యాయవాదిని తెచ్చుకుంటుంది. విచారణకు గంటల సమయం వృధా. ప్రస్తుతం.. కేంద్ర సమాచార కమిషనర్‌ ముందు రోజుకి పాతిక వరకు అప్పీళ్లు వస్తున్నాయి. వాటిలో పరిష్కారమవుతున్నవి గరిష్టంగా ఐదుకు మించి ఉండట్లేదు. మిగిలిన వాటికి ఏళ్లకేళ్లు సమయం పడుతోంది. సుప్రీం తీర్పు అమలైతే ఆ జాప్యం ఇంకా పెరుగుతుంది.
ముం: ప్రధాని మాటల్లోని పరమార్థమేమంటారు?
సు: అప్రయోజన దరఖాస్తులు, పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులను సహ నుంచి మినహాయించడం, వ్యక్తిగత రహస్యాల రక్షణ గురించి ఆయన మాట్లాడారు. ఈ మూడూ హేతుబద్ధత లేనివే. అప్రయోజన దరఖాస్తులు యంత్రాంగానికి భారంగా మారుతున్నాయన్న మాట అసంబద్ధం. దీన్ని అడ్డం పెట్టుకుని అధికారులు కొన్ని ముఖ్యమైన దరఖాస్తులను తిరస్కరించే ప్రమాదం ఉంది.

వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి సంబంధించిన విధి విధానాలేంటో సెక్షన్‌ 8(1)(జె), 11లలో స్పష్టంగా ఉన్నాయి. దరఖాస్తుదారు కోరిన సమాచారం వాటి పరిధిలోకి వస్తే సమాచారం ఇవ్వక్కర్లేదు. దీనికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. (సెక్షన్‌ 8(2)) విషయం ప్రజా సంబంధమైన, ప్రజలకు హాని చేయగలిగేది అయితే వ్యక్తిగతమైనా బయటపెట్టాల్సిందే.

ఇక పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం. పెట్టుబడిదారు ఎవరైనా సరే ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారని చట్టం చెప్తోంది. అలాంటప్పుడు ఆ ప్రాజెక్టులను సహ నుంచి మినహాయించాల్సిన అవసరమేంటి? ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రధాని కూడా ఏవో ఒత్తిళ్లకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకుంటున్నా.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net